Home /News /sports /

T20 WORLD CUP 2021 ENG VS WI HEAD TO HEAD RECORDS KEY STATS AND PREDICTED PLAYING XI OF BOTH TEAMS SRD

T20 World Cup - Eng Vs WI : వన్డే చాంపియన్స్ వర్సెస్ టీ-20 విశ్వవిజేతలు.. గెలుపెవరిదో..? తుది జట్లు ఇవే..!

Eng Vs WI

Eng Vs WI

T20 World Cup - Eng Vs WI : ఏకంగా ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ కోసం నువ్వా.. నేనా.. అనే రీతిలో సవాల్‌ విసిరేందుకు ఎదురుచూస్తున్నాయి.ఇప్పుడు ఈ ‘సూపర్‌–12’ నుంచి ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారనేది ఆసక్తికరం.

ఇంకా చదవండి ...
  టీ20 ప్రపంచకప్‌ (T-20 World Cup 2021) అసలు సిసలు పోరుకు రెడీ అయింది. ధనాధన్‌ క్రికెట్‌ రెండో అంకానికి చేరుకుంది. తాడో పేడో తేల్చుకోవడానికి ఏకంగా 12 జట్లు (Super -12 Stage) రెడీ అయ్యాయి. ఏకంగా ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ కోసం నువ్వా.. నేనా.. అనే రీతిలో సవాల్‌ విసిరేందుకు ఎదురుచూస్తున్నాయి.ఇప్పుడు ఈ ‘సూపర్‌–12’ నుంచి ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారనేది ఆసక్తికరం. ఇక, సూపర్ -12 ధమాకాలో రెండో మ్యాచ్ లో దుబాయ్ వేదికగా ఇంగ్లండ్ తో డిఫెండింగ్ ఛాంపియన్స్ విండీస్ (England Vs West Indies) అమీతుమీ తేల్చుకోనుంది. వరల్డ్ కప్ టైటిళ్లు నెగ్గడం వీరి వల్ల కాదంటూ వచ్చిన విమర్శలకు సరియైన సమాధానం చెబుతూ 2010లో ఇంగ్లండ్‌​ టైటిల్‌ను నెగ్గింది. ఇక, 2019 వన్డే వరల్డ్ కప్ ను కూడా నెగ్గింది ఇంగ్లండ్. ప్రస్తుతం ఉన్న జట్లలో లిమిటెట్ క్రికెట్ లో విధ్వంసకరంగా మారింది ఇంగ్లీష్ టీమ్. ఈ టీ -20 వరల్డ్ కప్ లో కూడా హాట్ ఫేవరట్లు గా బరిలోకి దిగుతున్నారు.టీ20 ప్రపంచకప్‌ 2021 ఇంగ్లండ్ జట్టును ఇయాన్ మోర్గాన్ ముందుండి నడిపించనున్నాడు. అందరూ ఊహించిన విధంగానే ఈసీబీ ఇంగ్లండ్ జట్టును ప్రకటించింది. మానసిక సమస్యలతో స్టార్ ఆల్‌రౌండర్‌ బెన్ స్టోక్స్.. గాయాల కారణంగా జోఫ్రా ఆర్చర్, సామ్ కరన్ లాంటి స్టార్లు ఇంగ్లండ్ జట్టుకు దూరమయ్యారు. వీరు మినహా రెగ్యులర్‌గా టీ20ల్లో ఆడే ఇంగ్లీష్ ప్లేయర్స్ అందరు ప్రపంచకప్‌ జట్టులో చోటు దక్కించుకున్నారు.

  ఈ ముగ్గురు మెగా టోర్నీకి దూరమయినా.. ఇంగ్లండ్ పటిష్టంగానే ఉంది. అన్ని విభాగాల్లో బలంగా ఉన్న ఇంగ్లండ్ జట్టు ఈసారి కప్ కొడుతుందని అందరూ అంటున్నారు. కెప్టెన్‌ మోర్గాన్‌ సహా బట్లర్‌, రాయ్‌, మలన్‌, బెయిర్‌ స్టో లాంటి విధ్వంసక బ్యాటర్లున్న జట్టుతో విండీస్‌ బౌలర్లకు ప్రమాదం తప్పకపోవచ్చు. వార్మప్ మ్యాచుల్లో బట్లర్‌, బెయిర్‌ స్టోలు తిరిగి ఫామ్ అందిపుచ్చుకున్నారు.

  ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీతో పాటు మరో స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ యూఏఈ పిచ్‌లపై కీలకం కానున్నారు. ఈ ఇద్దరు.. విండీస్‌ హిట్టర్లను ఎలా అడ్డుకుంటారో చూడాలి. మిల్స్‌, విల్లీ, మార్క్‌వుడ్‌, క్రిస్‌ వోక్స్‌, జోర్డాన్‌ లాంటి పేసర్లు జట్టులో ఉన్నారు.ముగ్గురు స్టార్ ప్లేయర్స్ అందుబాటులో లేకపోయినా.. ఆ ప్రభావం ఇంగ్లీష్ జట్టుపై ఎక్కడా పడే అవకాశం లేదు.

  ఇక, ఈ టోర్నీలో ఆటను క్షణాల్లో మార్చగల హిట్టర్లు ఆ జట్టు సొంతం. ఆ టీమ్ లో ఏ ఒక్కరు నిలబడినా.. ప్రత్యర్థి టీమ్ ఆశలు వదులుకోవాల్సిందే. ఆ జట్టే డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్. అయితే, ఈ ఏడాది జరిగిన వార్మప్ మ్యాచుల్లో విండీస్ తేలిపోయింది. ఆఖరికి అఫ్గానిస్థాన్ చేతిలో కూడా 54 పరుగుల భారీతో తేడాతో ఓటమి చవిచూసింది.

  ఇది కూడా చదవండి : సూపర్ ఓవర్ల స్పెషలిస్ట్ లు వీళ్లే..! ఏ జట్టు ఎవరిని బరిలోకి దింపుతుందంటే..?

  లూయిస్‌, సిమన్స్‌, గేల్‌, పూరన్‌, పొలార్డ్‌, హెట్‌మయర్‌, రసెల్‌, బ్రావో లాంటి హిట్టర్లు జట్టులో ఉన్నప్పటికీ.. అవసరమైన సమయంలో కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకోలేకపోతున్నారు. బ్రావో, రసెల్‌, పొలార్డ్‌.. బ్యాట్‌తో పాటు తమ తెలివైన బౌలింగ్‌తోనూ సత్తాచాటగలరు. స్పిన్నర్లు వాల్ష్‌, ఛేజ్‌, హొసేన్‌, పేసర్లు రవి రాంపాల్‌, థామస్‌, మెక్‌కాయ్‌తో కూడిన బౌలింగ్‌లో కీలకం.

  హెడ్ టు హెడ్ రికార్డులు :

  టీ-20 ల్లో హెడ్ టు హెడ్ రికార్డులు విండీస్ కే అనుకూలంగా ఉన్నాయ్. ఇరు జట్లు 18 మ్యాచుల్లో తలపడగా.. 11 గేమ్ లు విండీస్ నెగ్గగా.. కేవలం ఏడు మాత్రమే ఇంగ్లండ్ గెలిచింది. ఇక, టీ-20 వరల్డ్ కప్ ల్లో పూర్తి ఆధిపత్యం విండీస్ దే. మెగా టోర్నీలో ఇరు జట్లు ఐదు సార్లు తలపడగా.. ఐదింటిలోనూ కరేబియన్లే విజేతలుగా నిలిచారు.

  తుది జట్లు (అంచనా) :

  ఇంగ్లండ్‌: జాసన్ రాయ్‌, జోస్ బట్లర్‌, జానీ బెయిర్‌స్టో, మొయిన్ అలీ, లివింగ్‌స్టోన్‌, ఇయాన్ మోర్గాన్‌ (కెప్టెన్), క్రిస్ వోక్స్‌, జోర్డాన్‌, రషీద్‌, మార్క్‌వుడ్‌, కైల్ మిల్స్‌

  వెస్టిండీస్‌: ఎవిన్ లూయిస్‌, లెండిల్ సిమన్స్‌, క్రిస్ గేల్‌, నికోలస్ పూరన్‌, హెట్‌మేయర్, పొలార్డ్‌, రసెల్‌, బ్రావో, వాల్ష్‌, మెక్‌కాయ్‌, థామస్‌/రవి రంపాల్
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Chris gayle, Cricket, England, T20 World Cup 2021, West Indies

  తదుపరి వార్తలు