Home /News /sports /

Eng Vs Sa : ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. సెమీస్ కు చేరాలంటే..

Eng Vs Sa : ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేసిన సౌతాఫ్రికా బ్యాటర్లు.. సెమీస్ కు చేరాలంటే..

Photo Credit : ICC

Photo Credit : ICC

Eng Vs Sa : టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఇంగ్లాండ్ జట్టుపై ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. సౌతాఫ్రికా సెమీస్‌కి చేరాలంటే ఇంగ్లాండ్ జట్టును 130 పరుగుల లోపు కట్టడి చేయాల్సి ఉంటుంది.

    టీ20 వరల్డ్ కప్ 2021 గ్రూప్ 1 లో చావోరేవో తేల్చుకోవడానికి రెడీ అయిన సౌతాఫ్రికా రెచ్చిపోయింది. ఇంగ్లండ్ బౌలర్లను ఉతికారేసిన ఆ జట్టు బ్యాటర్లు భారీ స్కోరు సాధించి.. సెమీస్ రేస్ లో నిలిచారు. బౌలర్లు కూడా సరైన ప్రదర్శన ఇస్తే.. సఫారీ జట్టు సెమీస్ లోకి ఎంట్రీ ఇవ్వడం ఖాయం. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన సౌతాఫ్రికా, నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 189 పరుగుల భారీ స్కోరు చేసింది. వాన్ డర్ డస్సెన్ ( 60 బంతుల్లో 94 పరుగులు.. 5 ఫోర్లు, 6 సిక్సర్లు), మార్క్రమ్ (25 బంతుల్లో 52 పరుగులు.. 2 ఫోర్లు, 4 సిక్సర్లు) వీర వీహారం చేయడంతో భారీ స్కోరు సాధించింది సఫారీ టీమ్. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, అదిల్ రషీద్ కు మాత్రమే చెరో వికెట్ దక్కాయ్. డూ ఆర్ డై మ్యాచులో సఫారీ జట్టుకి శుభారంభం దక్కలేదు. 8 బంతులాడి కేవలం 2 పరుగులు మాత్రమే చేసిన రీజా హెండ్రిక్స్, మొయిన్ ఆలీ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు. 15 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది సౌతాఫ్రికా.

    అయితే డి కాక్, రస్సీ వాన్ డర్ డస్సెన్ కలిసి రెండో వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం జోడించారు. 27 బంతుల్లో 4 ఫోర్లతో 34 పరుగులు చేసిన క్వింటన్ డి కాక్, అదిల్ రషీద్ బౌలింగ్‌లో జాసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత వాన్ డర్ డస్సెన్, అయిడెన్ మార్క్‌రమ్ కలిసి స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు.


    క్రిస్ వోక్స్ వేసిన 16వ ఓవర్‌లో వాన్ దేర్ దుస్సేన్ వరుసగా రెండు సిక్సర్లు బాదగా, మార్క్‌రమ్ ఓ సిక్సర్ బాది 21 పరుగులు రాబట్టారు. ఆ తర్వాత మార్క్‌వుడ్ వేసిన 17వ ఓవర్‌లో 11 పరుగులు రాగా, క్రిస్ జోర్డాన్ వేసిన 18వ ఓవర్‌లో 10 పరుగులు వచ్చాయి... మార్క్ వుడ్ వేసిన 19వ ఓవర్‌లో కూడా 13 పరుగులు వచ్చాయి. సిక్సర్‌తో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు మార్క్‌రమ్. మార్క్‌రమ్ 25 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులతో నాటౌట్‌గా నిలవగా, వాన్ డర్ డస్సెన్ 60 బంతుల్లో 5 ఫోర్లు, 6 సిక్సర్లతో 94 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు.

    టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో ఇంగ్లాండ్ జట్టుపై ఇదే అత్యధిక స్కోరు కావడం విశేషం. సౌతాఫ్రికా సెమీస్‌కి చేరాలంటే ఇంగ్లాండ్ జట్టును 130 పరుగుల లోపు కట్టడి చేయాల్సి ఉంటుంది. 130లోపు ఇంగ్లాండ్‌ పరిమితమైతే సౌతాఫ్రికా, ఇంగ్లాండ్ జట్లు సెమీస్ చేరతాయి. ఒకవేళ ఇంగ్లాండ్ జట్టు 86 పరుగుల కంటే తక్కువ స్కోరు చేస్తే... సెమీస్ రేసు నుంచి తప్పుకుంటుంది. సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లు మెరుగైన నెట్ రన్‌రేట్ కారణంగా సెమీస్ కు చేరతాయ్. మరి ఆ అదృష్టం వరించనుందో కాసేపట్లో తేలనుంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: England, South Africa, T20 World Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు