హోమ్ /వార్తలు /క్రీడలు /

Eng Vs Sa : మ్యాచ్ గెలిచినా సౌతాఫ్రికాకు నిరాశే.. సెమీస్ కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు..

Eng Vs Sa : మ్యాచ్ గెలిచినా సౌతాఫ్రికాకు నిరాశే.. సెమీస్ కు ఆస్ట్రేలియా, ఇంగ్లండ్ జట్లు..

Photo Credit : ICC Twitter

Photo Credit : ICC Twitter

Eng Vs Sa : గ్రూప్ -1 నుంచి సెమీఫైనలిస్టులు ఎవరో తెలిసిపోయింది. ఈ టోర్నీలో అద్భుతంగా రాణించిన ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు సెమీస్ కు చేరుకున్నాయ్. బాగానే రాణించినప్పటికీ.. సౌతాఫ్రికాకు నిరాశ తప్పలేదు.

  టీ-20 ప్రపంచకప్ గ్రూప్ -1 లో నుంచి ఇంగ్లండ్, ఆస్ట్రేలియాలు సెమీస్ కు చేరుకున్నాయ్. డూ ఆర్ డై మ్యాచులో సౌతాఫ్రికా గెలిచినా ఫలితం లేకుండా పోయింది. ఒకవేళ 130 పరుగులలోపు ఇంగ్లండ్‌ను ఆలౌట్‌ చేసి ఉంటే దక్షిణాఫ్రికా సెమీస్ చేరి ఉండేది. తక్కువ నెట్ రన్ ఉండటంతో సౌతాఫ్రికా సెమీస్ కు దూరమైంది. కానీ, ఉత్కంఠగా జరిగిన పోరులో కేవలం పది పరుగుల తేడాతో మాత్రమే సౌతాఫ్రికా నెగ్గింది. దీంతో సెమీస్ రేస్ నుంచి ఔట్ అయింది. 190 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ నిర్ణీత 20 ఓవర్లలో వికెట్లు కోల్పోయి పరుగులు చేసింది. ఆఖరి ఓవర్ లో 14 పరుగులు అవసరమైన సమయంలో కగిసో రబాడా హ్యాట్రిక్ తో తన జట్టుకు విజయాన్ని అందించాడు. ఆఖరి ఓవర్ ఫస్ట్ మూడు బంతుల్లో క్రిస్ వోక్స్, మోర్గాన్, క్రిస్ జోర్డాన్ లను ఔట్ చేసి ఈ మెగా టోర్నీలో మూడో హ్యాట్రిక్ ను నమోదు చేశాడు కగిసో రబాడా. షమ్సీ , పెట్రోరియస్ చెరో రెండు వికెట్లతో సత్తా చాటారు.

  190 పరుగుల భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ బ్యాటర్లు తమ ఇన్నింగ్స్ ను ధాటిగా ఆరంభించారు. వరుస బౌండరీలు, సిక్సర్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించారు. అయితే, 15 బంతుల్లో 20 పరుగులు చేసి సూపర్ ఫామ్ లో ఉన్న జాసన్ రాయ్ గాయంతో రిటైర్ హర్డ్ గా వెనుదిరిగాడు. అయితే, ఈ వరల్డ్ కప్ లో సూపర్ ఫామ్ లో ఉన్న బట్లర్.. సౌతాఫ్రికా బౌలర్లపై విరుచుకుపడ్డాడు. అయితే 15 బంతుల్లో 26 పరుగులు చేసిన జాస్ బట్లర్ ని అన్రిచ్ నోర్ట్జే పెవిలియన్ కు పంపాడు. బావుమాకి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు బట్లర్. 6 ఓవర్లు ముగిసేసరికి దక్షిణాఫ్రికా వికెట్‌ నష్టానికి 59 పరుగులు చేసింది. ఆ వెంటనే ఇంగ్లండ్ రెండో వికెట్ కోల్పోయింది. ఒక పరుగు మాత్రమే చేసిన బెయిర్ స్టో బ్రైజ్ షమ్సీ బౌలింగ్‌లో ఎల్బీగా వెనుదిరిగాడు.

  అయితే, మొయిన్ అలీలు, డేవిడ్ మలాన్ లు ఇంగ్లండ్ ఇన్నింగ్స్ ను చక్కదిద్దారు. వీరిద్దరూ మూడో వికెట్ కు 51 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. వరుస బౌండరీలతో ఊపుమీదున్న మొయిన్ అలీనీ షంసీ బోల్తా కొట్టించాడు. 27 బంతుల్లో 37 పరుగులు చేసిన మొయిన్ అలీ మిల్లర్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. డేవిడ్ మలాన్ కూడా 33 పరుగులు చేసి పెట్రోరియస్ బౌలింగ్ లో ఔటయ్యాడు. ఆఖర్లో లివింగ్ స్టోన్, మోర్గాన్, క్రిస్ వోక్స్ మెరుపు బ్యాటింగ్ చేసినప్పటికీ ఫలితం లేకుండా పోయింది.

  ఇక, అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన ద‌క్షిణాఫ్రికా ఇంగ్లండ్ ముందు భారీ ల‌క్ష్యాన్ని ఉంచింది. నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 2 వికెట్ల న‌ష్టానికి 189 ప‌రుగులు చేసింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ద‌క్షిణాఫ్రికా ఆట‌గాళ్లు దూకుడు చూపించారు. ఓపెన‌ర్ రీజా హెండ్రిక్స్ (2) విఫ‌ల‌మైన‌ప్ప‌టికీ.. మ‌రో ఓపెన‌ర్ క్వింట‌న్‌ డికాక్ (34) ఆక‌ట్టుకున్నాడు. ఇక హెండ్రిక్స్ ఔట్ కావ‌డంతో బ్యాటింగ్‌కు దిగిన వాన్ డర్ డ‌స్సేన్ (94) చెల‌రేగాడు. ఆరు సిక్సులు, ఐదు ఫోర్ల‌తో భారీ స్కోర్‌ను సాధించాడు. డికాక్ త‌ర్వాత క్రీజులోకి వ‌చ్చిన మార్‌క్ర‌మ్ (52)తో హాఫ్ సెంచ‌రీతో రాణించాడు. మొత్తంగా నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 189 ప‌రుగులు చేశారు. ఇంగ్లండ్ బౌలర్లలో మొయిన్ అలీ, అదిల్ రషీద్ కు మాత్రమే చెరో వికెట్ దక్కింది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Australia, England, South Africa, T20 World Cup 2021

  ఉత్తమ కథలు