T20 WORLD CUP 2021 ENG VS NZ KEY STATS HEAD TO HEAD RECORDS PITCH REPORT AND PREDICTED PLAYING XI OF BOTH TEAMS SRD
Eng Vs Nz : ఇంగ్లండ్ బ్యాటింగ్ వర్సెస్ కివీస్ బౌలింగ్.. ఫస్ట్ పంచ్ ఎవరిదో..? తుది జట్లు ఇవే..!
Eng Vs Nz
Eng Vs Nz : 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఇంగ్లీష్ జట్టు గెలిచింది. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తన ఆధిపత్యం కొనసాగుతుందా లేదా చూడాలి. న్యూజిలాండ్ టీమ్ కూడా ఇంగ్లీష్ జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలని భావిస్తోంది.
అభిమానుల్ని ఎంతగానో అలరించిన టీ-20 వరల్డ్ కప్ 2021(T20 World Cup 2021) ఆఖరి ఘట్టానికి చేరుకుంది. అబుదాబి వేదికగా జరిగే తొలి సెమీస్ లో టాప్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయ్. 2019 వన్డే ప్రపంచకప్ విజేత అయిన ఇంగ్లండ్.. టెస్టుల్లో ప్రపంచ ఛాంపియన్ అయిన న్యూజిలాండ్ ప్రపంచకప్ సెమీఫైనల్లో (England Vs New Zealand) సై అంటున్నాయి. బలాబలాలు చూస్తే ఏ జట్టుకా జట్టే పటిష్టంగా ఉంది. చివరిగా ఈ రెండు జట్ల మధ్యే వన్డే ప్రపంచకప్ జరిగింది. క్రికెట్ చరిత్రలోనే అత్యంత ఉత్కంఠగా సాగిన ఆ పోరులో అదృష్టం ఇంగ్లీష్ టీమ్ నే వరించింది. కానీ ఈ సారి మాత్రం విక్టరీ మాదే అంటోంది కివీస్. సూపర్-12 స్టేజిలాగా ఒక మ్యాచ్ పోతే మరో మ్యాచ్ చూసుకుందాం అంటే కుదరదు. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే ఫైనల్ పోరులో పోటీ పడే అవకాశం ఉంటుంది. ఓడిన జట్టు ఇంటికే. 2016 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో, 2019 వన్డే ప్రపంచకప్ ఫైనల్లో న్యూజిలాండ్‌పై ఇంగ్లీష్ జట్టు గెలిచింది. ఈసారి టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తన ఆధిపత్యం కొనసాగుతుందా లేదా చూడాలి. ఈ కీలక పోరు నేపథ్యంలో తుది జట్లపై ఓ లుక్కేద్దాం.
టైటిల్ ఫేవరేట్‌గా టీ20 ప్రపంచకప్ 2021లో అడుగుపెట్టిన ఇంగ్లండ్.. అంచనాలు నిలబెట్టుకుంటూ సాగుతోంది. గ్రూప్-1లో ఆడిన అయిదు మ్యాచ్‌ల్లో నాలుగు విజయాలు, ఓ ఓటమితో అగ్రస్థానంలో నిలిచి సెమీస్‌కు అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటివరకూ ఈ రెండు జట్లు అయిదు మ్యాచ్‌ల్లో తలపడగా.. ఇంగ్లండ్ మూడు, న్యూజిలాండ్ రెండు మ్యాచులు గెలిచాయి. అబుదాబి పిచ్ ఆరంభంలో పేసర్లకు సహకరించే అవకాశం ఉంది.
సూపర్-12 దశలో చివరి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా చేతిలో ఓటమి కాస్త నిరాశ కలిగించినా.. తిరిగి పుంజుకునే సత్తా ఇంగ్లండ్‌కు ఉంది. అయితే ఇంగ్లీష్ జట్టును గాయాలు కలవరపెడుతున్నాయి. దక్షిణాఫ్రికాతో మ్యాచ్ సందర్భంగా పిక్క గాయానికి గురైన స్టార్ ఓపెనర్ జేసన్ రాయ్ మొత్తం టోర్నీకే దూరమయ్యాడు. ఇక ఆఖరి ఓవర్లలో వైవిధ్యమైన బౌలింగ్‌తో ప్రత్యర్థులను కట్టడి చేసిన స్టార్ పేసర్ టైమల్ మిల్స్ తొడ కండరాల గాయంతో మిగతా మ్యాచ్‌లకు అందుబాటులో లేకుండా పోయాడు.
కీలక సెమీస్‌కు రాయ్, మిల్స్ దూరమవడం మోర్గాన్ సేనకు పెద్ద ఎదురు దెబ్బే అని చెప్పాలి. ఇద్దరు స్టార్ ఆటగాళ్లు దూరమయినా ఇంగ్లండ్ జట్టు ఇప్పటికి పటిష్టంగానే ఉంది. ఇది ఇంగ్లీష్ జట్టుకు సానుకూలాంశం. జాస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, ఇయాన్ మోర్గాన్లతో కూడిన ఇంగ్లండ్ బ్యాటింగ్ బలంగా ఉంది. ముఖ్యంగా బట్లర్ సూపర్ ఫామ్‌లో ఉన్నాడు. ఇప్పటికే టోర్నీలో ఓ సెంచరీ బాదేశాడు. టోర్నీలో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్లలో రెండో స్థానంలో ఉన్నాడు.
బట్లర్‌తో కలిసి బెయిర్‌స్టో ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం ఉంది. రాయ్ స్థానంలో సామ్ బిల్లింగ్స్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది.స్పిన్నర్లు మొయిన్ అలీ, ఆదిల్ రషీద్ గొప్పగా రాణిస్తున్నారు. ముఖ్యంగా అలీ బంతితోనే కాకుండా బ్యాట్‌తో కూడా విధ్వంసం సృష్టిస్తున్నాడు. పేసర్లు మార్క్ వుడ్, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్ ఆఖరి ఓవర్లలో పరుగులు కట్టడి చేస్తే ఆ జట్టుకు తిరుగుండదు.
ఇక ఇంగ్లాండ్ మాదిరే కివీస్ కు కూడా పటిష్టమైన బ్యాటింగ్ లైనప్ ఉంది. మార్టిన్ గప్తిల్, మిచెల్, కేన్ విలియమ్సన్ లు టాపార్డర్ లో అదరగొడుతుండగా.. నీషమ్, ఫిలిప్స్ లు ఆఖర్లో మెరుపులు మెరిపిస్తున్నారు. కెప్టెన్ విలియమ్సన్ పరిస్థితులకు తగ్గట్టు ఆడుతున్నాడు. అయితే నేటి పోరులో వీళ్లంతా ఏ మేరకు రాణిస్తారో వేచి చూడాలి. బౌలింగ్ లో కివీస్ జట్టు బలంగా ఉంది.
టిమ్ సౌథీ నేతృత్వంలోని బౌలింగ్ దళమే న్యూజిలాండ్ ప్రధాన ఆయుధం. ట్రెంట్ బౌల్ట్ నిప్పులు చెరుగుతున్నాడు. మిల్నె కూడా అదరగొడుతున్నాడు. ఇక స్పిన్నర్లు ఇష్ సౌధీ, మిచెల్ సాంట్నర్ లు యూఏఈ పిచ్ లపై స్పిన్ ను రాబడుతున్నారు. బౌలర్లు విజృంభిస్తే ఇంగ్లాండ్ కు కష్టాలు తప్పవు. ఈ మెగాటోర్నీలో న్యూజిలాండ్ ను గెలిపించింది బౌలర్లే. దీంతో, ఈ మ్యాచ్ లో కూడా వారు సత్తా చాటుతారని కివీస్ టీమ్ భావిస్తోంది.
పిచ్ రిపోర్ట్ :
అబుదాబి పిచ్ మొదట్లో పేసర్లకు సహకరిస్తూ తర్వాత బ్యాటింగ్ కు అనుకూలంగా ఉంటుంది. దీంతో బంతికి.. బ్యాట్ కు రసవత్తర పోరు ఖాయం. రాత్రి పూట మ్యాచ్ కావడంతో రెండో ఇన్నింగ్స్ లో మంచు కురుస్తున్నది. ఇది ఛేదన చేసేవారికి అనుకూలించే అవకాశమే ఎక్కువ. దీంతో టాస్ గెలిచిన జట్టు తొలుత ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశమే ఉంది.
ఇంగ్లండ్: జొస్ బట్లర్, జానీ బెయిర్‌స్టో, డేవిడ్ మలన్, ఇయాన్ మోర్గాన్, లియామ్ లివింగ్‌స్టోన్, సామ్ బిల్లింగ్స్, మొయిన్ అలీ, ఆదిల్ రషీద్, క్రిస్ వోక్స్, మార్క్ వుడ్, క్రిస్ జోర్డాన్.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.