Eng Vs Ban : పొట్టి ఫార్మాట్ లో మొదటి సారి బంగ్లా, ఇంగ్లండ్ ఢీ.. టాస్ గెలిచిన బంగ్లాదేశ్..

Eng Vs Ban

Eng Vs Ban : ఇప్పటికే ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్‌లో తన జైత్రయాత్రను మొదలు పెట్టింది. తాను ఎదుర్కొన్న తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ వీరులను మట్టి కరిపించింది. ఇక రెండో మ్యాచ్‌లోనూ తన జైత్ర యాత్ర కంటిన్యూ చేయాలని ఇంగ్లండ్ టీమ్ భావిస్తోంది.

 • Share this:
  యూఏఈ వేదికగా సాగుతున్న టీ-20 ప్రపంచకప్ (T20 World Cup 2021) ఫ్యాన్స్ కు కావాల్సిన బోలెడంత మజా అందిస్తోంది. హాట్ ఫేవరెట్లకు బిగ్ షాకిలిస్తూ చిన్న జట్లు కూడా సత్తా చాటుతున్నాయ్. ఈ నేపథ్యంలో మెగా టోర్నీ మరో ఆసక్తికరమైన పోరుక కాసేపట్లో తెరవలేవనుంది. వరల్డ్ నెం.1 ఇంగ్లండ్ జట్టుతో బంగ్లా పులులు (Eng Vs Ban) తలపడనున్నారు. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన బంగ్లాదేశ్ బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. ష్రోఫుల్ ఇస్లామ్ జట్టులోకి వచ్చాడు. ఇక, ఇంగ్లండ్ టీమ్ ఎటువంటి మార్పుల్లేకుండా బరిలోకి దిగుతోంది.పొట్టి ఫార్మట్ మ్యాచ్‌ల్లో ఇప్పటిదాకా ఈ రెండు జట్లు ఎప్పుడూ ఎదురు పడలేదు..మ్యాచ్ ఆడలేదు. ఇంగ్లాండ్-బంగ్లాదేశ్ మధ్య తొలిసారిగా టీ20 మ్యాచ్ జరుగనుంది. దీనికి టీ20 ప్రపంచ కప్ మెగా ఈవెంట్ వేదిక కావడం ఆసక్తిగా మారింది.

  ఇప్పటికే ఇంగ్లాండ్ టీ20 ప్రపంచకప్‌లో తన జైత్రయాత్రను మొదలు పెట్టింది. తాను ఎదుర్కొన్న తొలి మ్యాచ్‌లో వెస్టిండీస్ వీరులను మట్టి కరిపించింది. ఇక రెండో మ్యాచ్‌లోనూ తన జైత్ర యాత్ర కంటిన్యూ చేయాలని ఇంగ్లండ్ టీమ్ భావిస్తోంది. బంగ్లాదేశ్‌పై ఇప్పటిదాకా టీ20 ఆడిన అనుభవం లేనప్పటికీ.. సూపర్ స్ట్రాంగ్ గా ఉన్న ఇంగ్లండ్ ఈ మ్యాచ్ ను తమ ఖాతాలో వేసుకోవాలని భావిస్తోంది.

  మరోవైపు, బంగ్లా పరిస్థితి భిన్నంగా ఉంది. సూపర్ 12లో ఓటమితో తమ వరల్డ్ కప్ ప్రయాణాన్ని ప్రారంభించింది బంగ్లాదేశ్. శ్రీలంకపై ఓటమి చవి చూసింది. భారీ స్కోర్‌ను సాధించినా.. బౌలింగ్‌లో రాణించినా.. పెద్దగా ఫలితం దక్కలేదు. వెంటవెంటనే వికెట్లను పడగొట్టి శ్రీలంక జట్టుకు కొంతవరకు కంగారు పెట్టగలిగింది. మిడిలార్డర్, లోయర్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్లు నిలదొక్కుకోవడంతో బంగ్లాదేశ్ బౌలర్ల ఆటలు సాగలేదు. భారీ స్కోర్‌ను సాధించినప్పటికీ.. బౌలర్లు తడబడటంతో ఓటమి పాలు కాక తప్పలేదు.

  ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ జట్టు పెద్దగా ప్రయోగాలకు సిద్ధపడట్లేదు. తుదిజట్టులోనూ ఎలాంటి మార్పులు చేయట్లేదు. విండీస్‌పై విజయాన్నిసాధించిన జట్టుతోనే బరిలోకి దిగనుంది. అటు బౌలింగ్.. ఇటు బ్యాటింగ్‌లో రాణించడంతో మార్పులు చేయదలచుకోవట్లేదని ఇంగ్లాండ్ టీమ్ మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. వెస్టిండీస్‌పై గెలిచిన జట్టును యధాతథంగా ఆడిస్తామని పేర్కొంది. జట్టు ఆటగాళ్లందరూ సమష్టిగా సత్తాచాటడం వల్లే విండీస్‌పై విజయం సాధించగలిగామని తేల్చి చెబుతోంది.

  ఇది కూడా చదవండి : మోకాలిపై నిలబడటం ఇష్టం లేక మ్యాచ్ నుంచి తప్పుకున్న క్వింటన్ డికాక్.. సర్వత్రా విమర్శలు

  బంగ్లా టీమ్ లో కుడిచేతి వాటం మీడియం పేస్ బౌలర్ మహ్మద్ సైఫుద్దీన్ గాయపడ్డాడు. అతని స్థానంలో రుబెల్ హొస్సేన్‌ను రీప్లేస్ చేసింది బంగ్లాటీమ్. ఫామ్‌లో ఉన్న బౌలర్ జట్టుకు దూరం కావడం ఒకింత ఇబ్బందుల్లో పడినట్టే కనిపిస్తోన్నారు బంగ్లా టైగర్లు. పైగా- బలమైన ఇంగ్లాండ్ జట్టును ఢీ కొట్టాల్సిన మ్యాచ్ కావడం వల్ల ఫలితం ఎలా ఉంటుందనేది ఆసక్తిగా మారింది.

  తుది జట్లు :

  ఇంగ్లండ్ : జేసన్ రాయ్, జోస్ బట్లన్ (వికెట్ కీపర్), డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, లియామ్ లివింగ్‌స్టోన్, ఇవాన్ మోర్గాన్ (కేప్టెన్), మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్

  బంగ్లాదేశ్ : మహ్మద్ నయీం, లిట్టన్ దాస్, షకీబుల్ హసన్, ముష్పికుర్ రహీం, మహ్మదుల్లా (కేప్టెన్), అఫిఫ్ హొస్సేన్, నూరుల్ హసన్ (వికెట్ కీపర్), మెహదీ హసన్, ష్రోఫుల్ ఇస్లామ్, నాసుమ్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్
  Published by:Sridhar Reddy
  First published: