హోమ్ /వార్తలు /క్రీడలు /

Eng Vs Aus : ఇంగ్లండ్ ముందు పసికూనలా మారిన ఆస్ట్రేలియా.. కేవలం 70 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్...

Eng Vs Aus : ఇంగ్లండ్ ముందు పసికూనలా మారిన ఆస్ట్రేలియా.. కేవలం 70 బంతుల్లోనే టార్గెట్ ఫినిష్...

Jos Buttler ( PC : ICC)

Jos Buttler ( PC : ICC)

Eng Vs Aus : దుబాయ్ లో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది ఇంగ్లండ్. మోర్గాన్ సేన దెబ్బకి ఆస్ట్రేలియా పసికూనలా మారిపోయింది. దీంతో భారీ ఓటమిని మూటగట్టుకుంది.

  టీ-20 వరల్డ్ కప్ 2021( T20 World Cup 2021)లో భాగంగా జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియాపై సూపర్ విక్టరీ కొట్టింది ఇంగ్లండ్. బౌలింగ్ తో ఆస్ట్రేలియాను కట్టడి చేసిన ఇంగ్లండ్.. వీరబాదుడుతో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించింది. ఇంగ్లండ్ ధాటికి 125 పరుగుల టార్గెట్ కేవలం 11.4 ఓవర్లలోనే ఫినిష్ అయింది. మరో బంతులు 50 మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించింది ఇంగ్లీష్ సేన. జాస్ బట్లర్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో ఆస్ట్రేలియాపై విరుచుకుపడ్డాడు. ఆఖర్లో బెయిర్ స్టో కూడా 11 బంతుల్లో 16 పరుగులు చేశాడు.125 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ ఓపెనర్లు అదిరే ఆరంభాన్ని అందించారు. ఓపెనర్లు జాసన్ రాయ్, జోస్ బట్లర్ ఇన్నింగ్స్ ఆరంభం నుంచే ఆస్ట్రేలియా బౌలర్లపై విరుచుకపడ్డారు. ముఖ్యంగా జోస్ బట్లర్ అయితే చిన్నపాటి విధ్వంసాన్ని సృష్టించాడు. వీరిద్దరి ధాటికి పవర్ ప్లే ఆరు ఓవర్లలో 66 పరుగులు చేసింది ఇంగ్లీష్ టీమ్. ముఖ్యంగా స్టార్క్ వేసిన ఆరో ఓవర్ లో ఏకంగా 18 పరుగులు చేసింది ఇంగ్లండ్ టీమ్. ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడి ఆస్ట్రేలియా స్పిన్నర్ ఆడమ్ జంపా విడదీశాడు. 20 బంతుల్లో 22 పరుగులు చేసిన జాసన్ రాయ్ జంపా బౌలింగ్ లో ఎల్బీడబ్ల్యూగా వెనుదిరిగాడు. దీంతో 66 పరుగుల పార్టనర్ షిష్ కి బ్రేక్ పడింది.

  మొదటి వికెట్ కోల్పోయిన బట్లర్ తన జోరును ఆపలేదు. వరుస బౌండరీలతో ఆస్ట్రేలియా బౌలర్లను ఓ ఆటాడుకున్నాడు. ఈ క్రమంలో 25 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్కు అందుకున్నాడు. ఇక, ఈ టోర్నీలో ఇదే ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీ. మరోవైపు, మలాన్ కూడా బట్లర్ కు సరియైన సహాకారాన్ని అందించాడు. అయితే 8 బంతుల్లో 8 పరుగులు చేసిన మలాన్ ను అగర్ పెవిలియన్ కు పంపాడు. అగర్ బౌలింగ్ లో మాథ్యూ వేడ్ కి క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు మలాన్. ఇక, ఆ తర్వాత వచ్చిన జానీ బెయిర్ స్టో కూడా సిక్సర్లు వర్షం కురిపించడంతో టార్గెట్ ను ఈజీగా ఫినిష్ చేసింది ఇంగ్లండ్.

  అంతకు ముందు టాస్ ఓడి బ్యాటింగ్ కు ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించారు ఇంగ్లండ్ బౌలర్లు. ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకి ఆలౌట్ అయింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ ఫించ్ 49 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఆఖర్లో అగర్, కమిన్స్, స్టార్క్ మెరుపులు మెరిపించడంతో ఆస్ట్రేలియా ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. లేకపోతే.. 100 పరుగుల్లోపు ఆలౌట్ అయి ఉండేది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు, క్రిస్ వోక్స్, టైమల్ మిల్స్ రెండు వికెట్లతో సత్తా చాటారు.

  టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియాకి రెండో ఓవర్‌లోనే షాక్ తగిలింది. 1 పరుగు చేసిన డేవిడ్ వార్నర్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంపైర్ అవుట్‌గా ప్రకటించకపోయినా వార్నర్ స్వచ్ఛందంగా పెవిలియన్‌కి చేరుకున్నాడు. 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాతి ఓవర్‌లో 5 బంతుల్లో 1 పరుగు చేసిన స్టీవ్ స్మిత్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ బాట పట్టాడు.

  ఆ తర్వాత 9 బంతుల్లో 6 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్ రివ్యూకి వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ 4 బంతుల్లో డకౌట్ అయ్యాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు స్టోయినిస్. దీంతో 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా.

  ఆ తర్వాత 18 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన మాథ్యూ వేడ్, లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో జాసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ దశలో ఆరోన్ ఫించ్, ఆస్టన్ అగర్ కలిసి ఆరో వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో స్టార్క్, కమిన్స్ మెరుపులు మెరిపించారు. అయినా, ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Cricket, David Warner, England vs Australia, Glenn Maxwell, T20 World Cup 2021

  ఉత్తమ కథలు