T20 WORLD CUP 2021 ENG VS AUS LIVE UPDATES ENGLAND TEAM WON THE TOSS AND OPTED TO FIELD FIRST SRD
Eng Vs Aus : హ్యాట్రిక్ విజయంపై కన్నేసిన చిరకాల ప్రత్యర్ధులు.. టాస్ గెలిచిన ఇంగ్లండ్..
Eng Vs Aus
Eng Vs Aus : మెగా టోర్నీలో ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు రెండు మ్యాచ్‌లు ఆడగా.. రెండూ గెలిచాయి. గ్రూప్ 1లో పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది.
టీ20 వరల్డ్‌కప్ 2021(T20 World Cup 2021) మ్యాచ్‌లు రసవత్తరంగా జరుగుతున్నాయి. అన్ని జట్లు గెలుపు కోసం వ్యూహాలు రచిస్తూ ముందుకెళ్తున్నాయి. ఈ నేపథ్యంలో ఫ్యాన్స్ కి మరింత కిక్ ఇవ్వడానికి మరో ఆసక్తికర పోరురెడీ అయింది. చిరకాల ప్రత్యర్ధులు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు మరికాసేపట్లో అమీతుమీ తేల్చుకోనున్నాయ్. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఇక, ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది ఇంగ్లండ్ టీమ్. ఈ మ్యాచ్ లో ఆస్ట్రేలియా ఒక మార్పుతో బరిలోకి దిగుతోంది. మిచెల్ మార్ష్ స్థానంలో అస్టన్ ఆగర్ జట్టులోకి వచ్చాడు. ఇంగ్లండ్ విన్నింగ్ కాంబినేషన్ ను రిపీట్ చేస్తోంది.మెగా టోర్నీలో ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు రెండు మ్యాచ్‌లు ఆడగా.. రెండూ గెలిచాయి. గ్రూప్ 1లో పాయింట్ల పట్టికలో ఇంగ్లండ్ మొదటి స్థానంలో ఉండగా.. ఆస్ట్రేలియా రెండో స్థానంలో ఉంది. రెండు జట్లలో భారీ హిట్టర్లు ఉన్నారు. దీంతో హ్యాట్రిక్ విజయంపై కన్నేశాయ్ రెండు జట్లు. ఈ మ్యాచ్ లో గెలిచి టాప్ ప్లేస్ దక్కించుకుని సెమీస్ కు మరింత చేరువ అవ్వాలని రెండు జట్లు ప్రయత్నిస్తున్నాయ్.
హెడ్ టు హెడ్ రికార్డులు :
ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా జట్లు 19 టీ20 మ్యాచుల్లో తలపడ్డాయి. ఇందులో 10 మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, 8 మ్యాచుల్లో ఇంగ్లండ్ విజయం సాధించాయి. ఒక మ్యాచులో మాత్రం ఫలితం తేలలేదు. రెండు టీ20 ప్రపంచకప్ మ్యాచ్‌ల్లో ఇరు జట్లు ఒక్కో విజయం సాధించాయి.
ఇంగ్లండ్ లో ఓపెనర్ జేసన్ రాయ్ సూపర్ ఫామ్ లో ఉన్నాడు. జోస్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్, లియామ్ లివింగ్‌స్టోన్ లాంటి హిట్టర్లు ఇంగ్లండ్ సొంతం. మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్ లాంటి నాణ్యమైన బౌలింగ్ లైనప్ కూడా ఇంగ్లీష్ జట్టుకు ఉంది.
మరోవైపు, ఆస్ట్రేలియాలో 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్‌తో తుఫాన్ ఇన్నింగ్స్ ఆడిన డేవిడ్ వార్నర్.. ఫామ్ అందుకున్నాడు. కెప్టెన్ ఆరోన్ ఫించ్ కూడా ఫామ్ అందుకున్నాడు ఇక స్టార్ బ్యాటర్ స్టీవ్ స్మిత్ మంచి టచ్ లో ఉన్నాడు. . గ్లెన్ మాక్స్వెల్, మార్కస్ స్టోయినిస్, మిచెల్ మార్ష్, మాథ్యూ వేడ్ తమ బ్యాట్లకు పని చెబితే ఆస్ట్రేలియాకు తిరుగుండదు. పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్ లాంటి టాప్ క్లాస్ బౌలర్లు అందుబాటులో ఉన్నారు.
తుది జట్లు:
ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.