టీ20 వరల్డ్‌కప్ 2021 (T20 World Cup 2021)లో భాగంగా దుబాయ్ లో జరుగుతున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియాకు చుక్కలు చూపించారు ఇంగ్లండ్ బౌలర్లు. ఇంగ్లీష్ బౌలర్ల ధాటికి ఆస్ట్రేలియా తక్కువ స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 125 పరుగులకి ఆలౌట్ అయింది ఆస్ట్రేలియా. ఆస్ట్రేలియా బ్యాటర్లలో కెప్టెన్ ఫించ్ 49 బంతుల్లో 44 పరుగులు చేశాడు. ఆఖర్లో అగర్, కమిన్స్, స్టార్క్ మెరుపులు మెరిపించడంతో ఆస్ట్రేలియా ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. లేకపోతే.. 100 పరుగుల్లోపు ఆలౌట్ అయి ఉండేది. ఇంగ్లండ్ బౌలర్లలో క్రిస్ జోర్డాన్ మూడు వికెట్లు, క్రిస్ వోక్స్, టైమల్ మిల్స్ రెండు వికెట్లతో సత్తా చాటారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియాకి రెండో ఓవర్లోనే షాక్ తగిలింది. 1 పరుగు చేసిన డేవిడ్ వార్నర్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో వికెట్ కీపర్ జోస్ బట్లర్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అంపైర్ అవుట్‌గా ప్రకటించకపోయినా వార్నర్ స్వచ్ఛందంగా పెవిలియన్‌కి చేరుకున్నాడు. 7 పరుగుల వద్ద తొలి వికెట్ కోల్పోయింది ఆస్ట్రేలియా. ఆ తర్వాతి ఓవర్లో 5 బంతుల్లో 1 పరుగు చేసిన స్టీవ్ స్మిత్, క్రిస్ జోర్డాన్ బౌలింగ్‌లో క్రిస్ వోక్స్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌తో పెవిలియన్ బాట పట్టాడు.
ఆ తర్వాత 9 బంతుల్లో 6 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్ వోక్స్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా పెవిలియన్ చేరాడు. మ్యాక్స్‌వెల్ రివ్యూకి వెళ్లినా ఫలితం దక్కలేదు. ఆ తర్వాత మార్కస్ స్టోయినిస్ 4 బంతుల్లో డకౌట్ అయ్యాడు. అదిల్ రషీద్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ అయ్యాడు స్టోయినిస్. దీంతో 21 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా.
A magnificent bowling performance helps England restrict Australia to 125.
Can the Australian attack defend this total? ?#T20WorldCup | #AUSvENG | https://t.co/82wjRVDecK pic.twitter.com/ieq02k34l3
— T20 World Cup (@T20WorldCup) October 30, 2021
ఆ తర్వాత 18 బంతుల్లో 2 ఫోర్లతో 18 పరుగులు చేసిన మాథ్యూ వేడ్, లివింగ్‌స్టోన్ బౌలింగ్‌లో జాసన్ రాయ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. ఈ దశలో ఆరోన్ ఫించ్, ఆస్టన్ అగర్ కలిసి ఆరో వికెట్‌కి 47 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆఖర్లో స్టార్క్, కమిన్స్ మెరుపులు మెరిపించారు. అయినా, ఇంగ్లండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ వేయడంతో సాధారణ స్కోరుకే పరిమితమైంది.
తుది జట్లు:
ఇంగ్లండ్: జాసన్ రాయ్, జోస్ బట్లర్, డేవిడ్ మలన్, జానీ బెయిర్‌స్టో, ఇయాన్ మోర్గాన్ (కెప్టెన్), లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ, క్రిస్ వోక్స్, క్రిస్ జోర్డాన్, ఆదిల్ రషీద్, టైమల్ మిల్స్.
ఆస్ట్రేలియా: డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కీపర్), గ్లెన్ మాక్స్వెల్, స్టీవ్ స్మిత్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్, పాట్ కమిన్స్, అస్టన్ ఆగర్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: David Warner, England vs Australia, Glenn Maxwell, Steve smith, T20 World Cup 2021