హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup 2021 : బిగ్ షాకింగ్.. అఫ్గాన్ - కివీస్ మ్యాచ్ పిచ్ క్యూరేటర్ అనుమానస్పద మృతి..!

T20 World Cup 2021 : బిగ్ షాకింగ్.. అఫ్గాన్ - కివీస్ మ్యాచ్ పిచ్ క్యూరేటర్ అనుమానస్పద మృతి..!

Nz Vs Afg

Nz Vs Afg

T20 World Cup 2021 : అఫ్గాన్ - కివీస్ మ్యాచ్‌కు ముందు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. అబుదాబి స్టేడియం పిచ్ చీఫ్ క్యూరేటర్ మోహన్ సింగ్ అనుమానస్పదంగా మృతి చెందారు.

  టీ20 ప్రపంచకప్‌ లో సెమీస్ రేస్ నుంచి భారత్ అధికారికంగా ఔట్ అయింది. కోహ్లీసేన సాధించిన రెండు భారీ విజయాలతో రేకెత్తిన ఆశలపై నీళ్లు చల్లింది న్యూజిలాండ్ టీమ్. అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ సమష్టిగా చెలరేగి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సగర్వంగా విలియమ్సన్ సేన సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది. నజీబుల్లా జడ్రాన్(48 బంతుల్ల 6 ఫోర్లు, 3 సిక్స్‌లతో 73) మినహా అంతా విఫలమయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లలో టీమ్ సౌథీ(2/24), ట్రెంట్ బౌల్ట్(3/17) అఫ్గాన్ పతనాన్ని శాసించగా.. ఆడమ్ మిల్నే, జేమ్స్ నీషమ్, ఇష్ సోదీ తలో వికెట్ తీశారు.

  అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ ఆడుతూ పాడుతూ 18.1 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 125 పరుగులు చేసి 11 బంతులు మిగిలుండగానే విజయాన్నందుకుంది. మరోసారి కెప్టెన్ కేన్ విలియమ్సన్(42 బంతుల్లో 3 ఫోర్లతో 40 నాటౌట్) కీలక ఇన్నింగ్స్ ఆడగా.. డేవాన్ కాన్వే(32 బంతుల్లో 4 ఫోర్లతో 36), మార్టిన్ గప్టిల్(23 బంతుల్లో 4 ఫోర్లతో 28) రాణించారు. అఫ్గాన్ బౌలర్లలో ముజీబ్ ఉర్ రెహ్మాన్, రషీద్ ఖాన్ తలో వికెట్ తీశారు.

  అయితే, మ్యాచ్‌కు ముందు షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఈ స్టేడియం పిచ్ చీఫ్ క్యూరేటర్ మోహన్ సింగ్ అనుమానస్పదంగా మృతి చెందారు. సరిగ్గా ఈ మ్యాచ్ ప్రారంభానికి ముందే అతను తన గదిలో విగత జీవిగా కనిపించారు. అయితే అతని మరణానికి గల కారణాలు తెలియకపోయినప్పటికీ.. ఆత్మహత్య చేసుకొని ఉండవచ్చని అబుదాబి పోలీసులు భావిస్తున్నారు.

  మోహన్ సింగ్​.. 2004లో అబుదాబికి వచ్చారు. అంతకుముందు పంజాబ్​లోని మొహాలీలో ఉన్న పంజాబ్​ క్రికెట్ స్టేడియంలో క్యురేటర్​గా ట్రైనింగ్ తీసుకున్నారు. అక్కడ ఆయన 1994లో చేరారు. తొలుత గ్రౌండ్​ సూపర్​వైజర్​గా, తర్వాత కోచ్​గా, సహాయకుడిగా సేవలందించారు.

  ఇది కూడా చదవండి : వచ్చే ఏడాది టీ-20 వరల్డ్ కప్ సూపర్-12 కి క్వాలిఫై అయిన జట్లు ఇవే.. విండీస్ కు నిరాశే...!

  ఇక మ్యాచ్ ముందే క్యూరేటర్ అనుమానస్పద స్థితిలో మరణించడంతో అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. టీ20 ప్రపంచకప్‌లో కీలక మ్యాచ్‌కు పిచ్‌ను సిద్దం చేయడం, టీమిండియా భవితవ్యంపై ఈ ఫలితంపై ఆధారపడిన నేపథ్యంలో క్యూరేటర్ అకాల మరణం అనేక అనుమానాలకు తావిస్తోంది. ఆత్మహత్య? లేక ఎవరైనా ఆగంతకులు హత్య చేశారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కేసు నమోదు చేసుకున్న అబుదాబీ పోలీసులు ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Afghanistan, New Zealand, T20 World Cup 2021, UAE

  ఉత్తమ కథలు