Srilanka Vs Bangladesh: దంచి కొట్టిన బంగ్లా బ్యాటర్లు.. నయీం, రహీం అద్భుత హాఫ్ సెంచరీలు.. శ్రీలంక ఎదుట భారీ లక్ష్యం

దంచి కొట్టిన బంగ్లా బ్యాటర్లు.. శ్రీలంక ఎదుట భారీ లక్ష్యం..

  • Share this:
    టీ20 వరల్డ్ కప్ 2021లో (T20 World Cup) భాగంగా ఆదివారం మధ్యాహ్నం షార్జా క్రికెట్ స్టేడియం వేదికగా శ్రీలంక - బంగ్లాదేశ్ (Srilanka Vs Bangladesh) మధ్య జరుగుతున్న మ్యాచ్‌లో బంగ్లా 171/4 భారీ స్కోర్ చేసింది. టాస్ ఓడిన బంగ్లాదేశ్‌కు ఓపెనర్లు మొహమ్మద్ నయీం, లిటన్ దాస్ శుభారంభం అందించారు. మొదట్లో కాస్త నెమ్మదిగా ఆడినా క్రమంగా బౌండరీలు సాధిస్తూ పరుగులు రాబట్టారు. వీరిద్దరూ కలసి తొలి వికెట్‌కు 40 పరుగులు జోడించారు. ఓపెనర్ లిటన్ దాస్ (16) లాహిరు కుమార బౌలింగ్‌లో డాసన్ షనకకు క్యాచ్ ఇచ్చి పెవీలియన్ చేరాడు. ఆ తర్వాత వచ్చిన షకీబుల్ హసన్ (10) కరుణరత్నే బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యి వెనుదిరిగాడు. దీంతో 56 పరుగులకే 2 కీలక వికెట్లు కోల్పోయి బంగ్లా కష్టాల్లో పడింది. అయితే మరో ఓపెనర్ మహ్మద్ నయీం, ముష్ఫికర్ రహీం కలసి శ్రీలంక బౌలర్లపై ఎదురు దాడికి దిగారు. వీరిద్దరూ శ్రీలంకపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శించారు. మైదానం నలువైపులా బంతిని తరలిస్తూ వేగంగా పరుగులు రాబట్టారు.

    మొహమ్మద్ నయీం (62) వేగంగా పరుగులు చేస్తూ అర్దసెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్‌లో ముష్ఫికర్ మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. వీరిద్దరూ కలసి మూడో వికెట్‌కు 73 పరుగులు జోడించారు. ఈ క్రమంలో మహ్మద్ నయీం (62) ఫెర్నాండో బౌలింగ్‌లో అతడికే క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. కానీ ముష్ఫికర్ రహీమ్ (57 నాటౌట్) చివరి వరకు పోరాడాడు. వేగంగా పరుగులు రాబడుతూ శ్రీలంకపై ఒత్తిడి పెంచాడు. ఒక దశలో 150 పరుగులకే పరిమితం అవుతుందని భావించినా.. చివరకు నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 171 పరుగులు చేసింది. చమిక కరుణరత్నే, బినుర ఫెర్నాండో, లాహిరు కుమార తలా ఒక వికెట్ తీశారు.









    శ్రీలంక ఈ మ్యాచ్‌లో విజయం సాధించాలంటే 172 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించాల్సి ఉన్నది. ఈ పిచ్‌లో ఛేజింగ్ కాస్త కష్టమే అయినా పిచ్ పరిస్థితి చూస్తే బ్యాటింగ్‌కు అనుకూలించేలా ఉన్నది.
    Published by:John Naveen Kora
    First published: