T20 World Cup 2021 : ఆస్ట్రేలియా పొట్టి కప్ కరువు తీరేనా..? కంగారూల పూర్తి బలగం ఇదే..!

Australia Team

T20 World Cup 2021 : వన్డేల్లో ఆ జట్టుకు దరిదాపుల్లో ఎవరూ లేరు. ఏకంగా ఐదు టైటిళ్లతో అందనంత ఎత్తులో నిలిచింది. కానీ, పొట్టి క్రికెట్ కు వచ్చే సరికి వారి ప్రదర్శన తీసికట్టుగా ఉంది. ఆ జట్టే ఆస్ట్రేలియా.

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup) మొదలైంది. రెండంచెల్లో పోటీలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 16 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే క్వాలిఫైయర్స్ మ్యాచ్ లు జరుగుతుండగా.. అసలు సిసలు సమరం సూపర్ -12 స్టేజీ అక్టోబర్ 23 న ప్రారంభం కానుంది.
    ర్యాంకింగ్‌ ప్రకారం భారత్ (India), వెస్టిండీస్ (West Indies), ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా(Australia), దక్షిణాఫ్రికా(South Africa), పాకిస్తాన్ (Pakistan), న్యూజిలాండ్(Newzealand), అఫ్గానిస్తాన్‌(Afganistan) (8 జట్లు) నేరుగా అర్హత సాధించాయి. రౌండ్‌–1 లో క్వాలిఫయింగ్‌ టోర్నీ మ్యాచ్‌లు జరుగుతున్నాయ్. శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా (గ్రూప్‌–ఎ) ... బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఒమన్‌ ,పాపువా న్యూగినియా (గ్రూప్‌–బి) రెండు గ్రూప్‌లుగా విడిపోయి అర్హత మ్యాచ్‌లు ఆడుతున్నాయ్. రెండు గ్రూప్‌లలో టాప్‌–2లో నిలిచిన నాలుగు జట్లు మిగిలిన 8 టీమ్‌లతో కలిసి ఈనెల 23 నుంచి ‘సూపర్‌–12’లో పోటీ పడతాయి. ఇక్కడా 12 జట్లను గ్రూప్‌–1, గ్రూప్‌ –2లుగా విభజించారు. తమ గ్రూప్‌ లోని మిగిలిన ఐదు జట్లతో మ్యాచ్‌లు ఆడిన అనంతరం రెండు గ్రూప్‌లలో అగ్రస్థానంలో నిలిచిన రెండేసి జట్లు సెమీఫైనల్‌కు చేరతాయి.

    ఇక, వన్డే ప్రపంచకప్‌ వచ్చిన ప్రతిసారి టైటిల్‌ ఫేవరేట్‌గా ఆ జట్టు పేరే వినిపిస్తుంది. ఇప్పటికే ఐదు సార్లు ఆ కప్పు దక్కించుకుని అత్యంత విజయవంతమైన జట్టుగా కొనసాగుతోంది. అలాంటి మేటి జట్టు.. టీ20 ప్రపంచకప్‌లో మాత్రం ఇప్పటివరకూ బోణీ కొట్టలేకపోయింది. ఆ జట్టే ఆస్ట్రేలియా(Australia). గత ఆరు టీ20 ప్రపంచకప్‌ల్లో మూడు సార్లు సెమీస్‌ చేరిన ఆస్ట్రేలియా.. 2010లో చివరి మెట్టుపై బోల్తా పడింది. ఈ సారి ట్రోఫీ సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో బరిలో దిగుతున్న ఆ జట్టుకు అంత ఈజీ కాదు. ఇటీవల ఆ జట్టు ప్రదర్శన పేలవంగా ఉండడమే అందుకు కారణం.

    నిజానికి 2020లో ఈ ధనాధన్ టోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యమివ్వాల్సింది. వరుసగా నాలుగు టీ20 సిరీస్‌లు గెలిచిన ఆసీస్‌.. 2020 మేలో ర్యాంకింగ్స్‌లో నంబర్‌వన్‌ స్థానాన్ని సొంతం చేసుకుంది. అప్పుడే ప్రపంచకప్‌ జరిగి ఉంటే ఆ జట్టుకు విజేతగా నిలిచేందుకు ఎక్కువ అవకాశాలుండేవి. కానీ కరోనా కారణంగా వాయిదా పడ్డ ప్రపంచకప్‌ ఇప్పుడు బీసీసీఐ ఆధ్వర్యంలో ఒమన్‌, యూఏఈలో జరుగుతోంది. మరోవైపు ఆసీస్ జట్టు ప్రదర్శన కూడా దారుణంగా ఉంది. జట్టు సరైన కూర్పు కుదరక వరుసగా అయిదు టీ20 సిరీస్‌ల్లోనూ పరాజయం పాలైంది. బంగ్లాదేశ్‌ చేతిలోనూ ఓడింది.

    వివిధ కారణాల వల్ల కీలక ఆటగాళ్లు కొన్ని సిరీస్‌లకు దూరమవడం జట్టును దెబ్బతీసింది. ఈ ప్రపంచకప్‌ కోసం ఆస్ట్రేలియా బలమైన జట్టునే బరిలో దింపింది. విధ్వంసకర ఓపెనర్లు ఫించ్‌, వార్నర్‌.. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే మ్యాక్స్‌వెల్‌, నమ్మదగ్గ స్మిత్‌, ఫామ్‌లో ఉన్న మార్ష్‌, పేసర్లు స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, హేజిల్‌వుడ్‌, ఆల్‌రౌండర్లు కమిన్స్‌, స్టాయినిస్‌, స్పిన్నర్లు జంపా, అగర్‌.. ఇలా జట్టు చూడ్డానికి పటిష్ఠంగా కనిపిస్తోంది. కానీ ఇందులో చాలా మంది ఆటగాళ్ల ఫామ్‌, ఫిట్‌నెస్‌ ఆందోళన రేకెత్తిస్తోంది. ముఖ్యంగా కెప్టెన్‌ ఫించ్‌తో పాటు వార్నర్‌ ఫామ్‌ అంతంత మాత్రంగానే ఉంది.

    ఇది కూడా చదవండి : బ్లాక్ బస్టర్ పోరుకు ముందు రోహిత్ శర్మ అరుదైన రికార్డు..! ధోనీ, కోహ్లీల వల్ల కూడా కాలేదు..

    బ్యాటింగ్‌లో మ్యాక్స్‌వెల్‌, మార్ష్‌ మాత్రమే జోరు మీదున్నారు. ఇక బౌలింగ్‌లో స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, హేజిల్‌వుడ్‌ కీలకం కానున్నారు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌లపై స్పిన్నర్లు జంపా, అగర్‌ సత్తాచాటేందుకు సిద్ధమయ్యారు. అయితే వ్యక్తిగతంగా ఆటగాళ్ల ప్రదర్శన ఫర్వాలేదనిపిస్తున్నా.. జట్టుగా మెరుగ్గా రాణిస్తేనే కప్పు అందుకోవాలనే ఆసీస్‌ కల నిజమవుతుంది. ఇంగ్లాండ్‌, దక్షిణాఫ్రికా, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌తో కలిసి గ్రూప్‌- 1లో ఉన్న ఆసీస్‌.. సెమీస్‌ చేరాలంటే కష్టపడాల్సిందే.

    ఆస్ట్రేలియా షెడ్యూల్ : 



















































    మ్యాచ్ నెం. డేట్ మ్యాచ్ టైం వెన్యూ స్టేజ్
    1 అక్టోబరు 23 ఆస్ట్రేలియా వర్సెస్‌ దక్షిణాఫ్రికా 03: 30 అబుదాబి సూపర్‌ 12
    2 అక్టోబరు 28 ఆస్ట్రేలియా వర్సెస్‌ A1 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
    3 అక్టోబరు 30 ఇంగ్లండ్‌ వర్సెస్‌ ఆస్ట్రేలియా 07:30 దుబాయ్‌ సూపర్‌ 12
    4 నవంబరు 4 ఆస్ట్రేలియా వర్సెస్‌ B2 03:30 దుబాయ్‌ సూపర్‌ 12
    5 నవంబరు 6 ఆస్ట్రేలియా వర్సెస్‌ వెస్టిండీస్‌ 03:30 అబుదాబి సూపర్‌ 12

    ఆస్ట్రేలియా ఫుల్ స్వ్యాడ్ : 

    కీలక ఆటగాళ్లు: మ్యాక్స్‌వెల్‌, వార్నర్‌, ఫించ్‌, స్టార్క్‌, స్మిత్‌, మార్ష్‌

    ఉత్తమ ప్రదర్శన: రన్నరప్‌ (2010), సెమీస్‌ (2007, 2012)

    ఆస్ట్రేలియా జట్టు: ఫించ్‌ (కెప్టెన్‌), కమిన్స్‌, అగర్‌, క్రిస్టియన్‌, ఎలిస్‌, హేజిల్‌వుడ్‌, జోష్‌ ఇంగ్లిస్‌, మిచెల్‌ మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌, రిచర్డ్‌సన్‌, డేనియల్‌ సామ్స్‌, స్మిత్‌, స్టార్క్‌, స్టాయినిస్‌, స్వెప్సన్‌, వేడ్‌, వార్నర్‌, జంపా.
    Published by:Sridhar Reddy
    First published: