టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచులోనూ డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ చేతులేత్తేసింది. ఈ మెగా టోర్నీని హాట్ ఫేవరేట్ గా ప్రారంభించిన విండీస్ కేవలం ఒక్క విజయంతో ఇంటి బాట పట్టింది. ఆస్ట్రేలియాతో జరిగిన ఆఖరి సూపర్ 12 రౌండ్ మ్యాచ్‌లో వెస్టిండీస్, ఆసీస్ చేతిలో చిత్తుగా ఓడింది. వెస్టిండీస్ విధించిన 158 పరుగుల లక్ష్యాన్ని కేవలం 16.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది ఆస్ట్రేలియా. డేవిడ్ వార్నర్ సూపర్ ఇన్నింగ్స్ తో మరో విక్టరీని తమ ఖాతాలో వేసుకుని సెమీస్ రేస్ లో ముందు నిలిచింది కంగారూ టీమ్. డేవిడ్ వార్నర్ (56 బంతుల్లో 89 పరుగులు.. 9 ఫోర్లు, 4 సిక్సర్లు) తో చెలరేగాడు. 158 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన విండీస్ కు ఆదిలోనే షాక్ తగిలింది. ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్ 11 బంతుల్లో 9 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. విండీస్ బౌలర్ అకీల్ హుస్సేన్ బౌలింగ్ లో ఫించ్ క్లీన్ బౌల్డ్ అయ్యాడు.
అయితే, డేవిడ్ వార్నర్ తో కలిసిన మిచెల్ మార్ష్ మరో వికెట్ పడకుండా ఆస్ట్రేలియా ఇన్నింగ్స్ ను ముందుండి నడిపించాడు. ఈ ఇద్దరూ విండీస్ బౌలర్లపై విరుచుకుపడ్డారు. మిచెల్ మార్ష్, డేవిడ్ వార్నర్ రెండో వికెట్ కు 124 పరుగుల విలువైన భాగస్వామ్యాన్ని జోడించారు. అయితే, విజయానికి ఒక్క పరుగు కావాల్సిన దశలో మిచెల్ మార్ష్ పెవిలియన్ బాట పట్టాడు. మిచెల్ మార్ష్ 32 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 53 పరుగులు చేసి క్రిస్ గేల్ బౌలింగ్‌లో జాసన్ హోల్డర్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
Job done from Australia ✅
Over to you South Africa!
#T20WorldCup | #AUSvWI | https://t.co/YEQqoRudxN pic.twitter.com/ccrPRMUHHY
— T20 World Cup (@T20WorldCup) November 6, 2021
ఆ తర్వాత విజయ లాంఛనాన్ని డేవిడ్ వార్నర్ పూర్తి చేశాడు. డేవిడ్ వార్నర్ 56 బంతుల్లో 9 ఫోర్లు, 4 సిక్సర్లతో 89 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ విక్టరీతో సెమీస్ రేస్ లో మరింత ముందుకు దూసుకెళ్లింది ఆస్ట్రేలియా టీమ్. ఈ విక్టరీతో సౌతాఫ్రికా సెమీస్ ఆశలు సంక్లిష్టం అయ్యాయ్. సౌతాఫ్రికా టీమ్ ఇంగ్లండ్ టీమ్ ను ఓడించడమే కాకుండా.. భారీ తేడాతో నెగ్గితినే ముందుకు వెళుతోంది.
ఇక, అంతకుముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ వెస్టిండీస్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. పొలార్డ్ (31 బంతుల్లో 44 పరుగులు), లూయిస్ (26 బంతుల్లో 29 పరుగులు), హెట్ మేయర్ (28 బంతుల్లో 27 పరుగులు) రాణించారు. ఆఖర్లో 7 బంతుల్లో 18 పరుగులతో రస్సెల్ మెరుపులు మెరిపించడంతో ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. మొదటి ఓవర్‌లో 20 పరుగులు సమర్పించిన జోష్ హజల్‌వుడ్, ఆ తర్వాత మూడు ఓవర్లలో 19 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం విశేషం. ఇక, క్రిస్ గేల్, డ్వేన్ బ్రావో ఈ మ్యాచ్ తో తమ అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, Chris gayle, David Warner, T20 World Cup 2021, West Indies