Home /News /sports /

T20 WORLD CUP 2021 AUS VS WI LIVE UPDATES WEST INDIES SETS FIGHTING TOTAL ON BOARD SRD

Aus Vs Wi : ఆస్ట్రేలియా సెమీస్ ఆశలపై విండీస్ నీళ్లు చల్లేనా..! కంగారూల ముందు టఫ్ టార్గెట్..

Aus Vs Wi (Twitter)

Aus Vs Wi (Twitter)

Aus Vs Wi : ఇక, ఈ మ్యాచ్ గెలవడం ఆస్ట్రేలియాకు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ అవకాశాలు పుష్కలంగా ఉంటాయ్. ఓడిపోతే.. ఈ రాత్రి జరిగే ఇంగ్లండ్, సౌతాఫ్రికాల ఫలితం మీద వారి ఆశలు ఆధారపడి ఉంటాయ్.

    టీ20 వరల్డ్‌కప్ 2021 టోర్నీలో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తమ ఆఖరి లీగ్ మ్యాచులో డిఫెండింగ్ ఛాంపియన్స్ వెస్టిండీస్ ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది. టాస్ ఓడిపోయి ఫస్ట్ బ్యాటింగ్ వెస్టిండీస్, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 157 పరుగులు చేసింది. పొలార్డ్ (31 బంతుల్లో 44 పరుగులు), లూయిస్ (26 బంతుల్లో 29 పరుగులు), హెట్ మేయర్ (28 బంతుల్లో 27 పరుగులు) రాణించారు. ఆఖర్లో 7 బంతుల్లో 18 పరుగులతో రస్సెల్ మెరుపులు మెరిపించడంతో ఫైటింగ్ టోటల్ సెట్ చేసింది కరేబియన్ టీమ్. ఆస్ట్రేలియా బౌలర్లలో జోష్ హజెల్ వుడ్ 4 వికెట్లతో సత్తా చాటాడు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ కు మొదటి ఓవర్‌లో నాలుగు పరుగులు మాత్రమే రాగా, రెండో ఓవర్‌లో లూయిస్ వరుసగా మూడు ఫోర్లు, క్రిస్ గేల్ ఓ సిక్సర్ బాదడడంతో 20 పరుగులు వచ్చాయి. అయితే ప్యాట్ కమ్మిన్స్ వేసిన మూడో ఓవర్‌లో వెస్టిండీస్‌కి తొలి దెబ్బ తగిలింది. 9 బంతుల్లో 2 సిక్సర్లతో 15 పరుగులు చేసిన క్రిస్ గేల్, కమ్మిన్స్ బౌలింగ్‌లో క్లీన్ బౌల్డ్ అయ్యాడు.

    మొదట్లో దూకుడుగా కన్పించిన నికోలస్ పూరన్, హజల్‌వుడ్ బౌలింగ్‌లో మిచెల్ మార్ష్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత రెండో బంతికే రోస్టన్ ఛేజ్‌ను కూడా హజల్‌వుడ్ క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో ఒకానొక దశలో 30/0 స్కోరుతో ఉన్న వెస్టిండీస్, 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. 26 బంతుల్లో 5 ఫోర్లతో 29 పరుగులు చేసిన ఓపెనర్ ఇవిన్ లూయిస్, ఆడమ్ జంపా బౌలింగ్‌లో స్టీవ్ స్మిత్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. 28 బంతుల్లో 2 ఫోర్లతో 27 పరుగులు చేసిన హెట్మయర్ కూడా జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో కీపర్ మాథ్యూ వేడ్‌కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు.


    ఇప్పటికే అంతర్జాతీయ క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించి, ఆఖరి మ్యాచ్ ఆడుతున్న ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో 12 బంతుల్లో ఓ సిక్సర్‌తో 10 పరుగులు చేసి జోష్ హజల్‌వుడ్ బౌలింగ్‌లో అవుట్ అయ్యాడు... 31 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 44 పరుగులు చేసిన పోలార్డ్‌ను మిచెల్ స్టార్క్ అవుట్ చేయగా ఆఖరి రెండు బంతుల్లో రెండు సిక్సర్లు బాదిన ఆండ్రే రస్సెల్, విండీస్ స్కోరును 150+ మార్కు దాటించాడు.

    ఇక, ఈ మ్యాచ్ గెలవడం ఆస్ట్రేలియాకు చాలా ముఖ్యం. ఈ మ్యాచ్ గెలిస్తే సెమీస్ అవకాశాలు పుష్కలంగా ఉంటాయ్. ఓడిపోతే.. ఈ రాత్రి జరిగే ఇంగ్లండ్, సౌతాఫ్రికాల ఫలితం మీద వారి ఆశలు ఆధారపడి ఉంటాయ్. ఇక, ఈ మ్యాచ్ లో డ్వేన్ బ్రావోతో పాటు విండీస్ హిట్టర్, టీ-20 లెజెండ్ యూనివర్శల్ బ్రాస్ క్రిస్ గేల్ కూడా అంతర్జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెప్పాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Australia, Chris gayle, David Warner, T20 World Cup 2021, West Indies

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు