Aus Vs Sl : ఆస్ట్రేలియాను శ్రీలంక కంగారూ పెట్టేనా..? రికార్డులు, తుది జట్లు ఇవే..!

Aus Vs Sl

Aus Vs Sl : ఆస్ట్రేలియా జట్టు తమ మొదటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చేతిలో 5 వికెట్లతో ఓడించింది. ఆసీస్ బౌలింగ్ విభాగం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. మరోవైపు, శ్రీలంక కూడా పూర్వ వైభవాన్ని తిరిగి సంపాదించే ప్రయత్నం చేస్తోంది.

 • Share this:
  టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) లో మరో ఆసక్తిపోరుకు తెరలేవనుంది. స్ట్రాంగ్ గా ఉన్న ఆస్ట్రేలియా (Australia)తో తాడోపేడో తేల్చుకోవడానికి లంకన్ లయన్స్ (Sri Lanka) రెడీ అయ్యారు. ఇప్పటికే ఇరు జట్లు చెరో విజయంతో సూపర్ -12 క్యాంపెయిన్ ను ప్రారంభించాయ్. ఇదే ఫామ్ ను కంటిన్యూ చేయాలని రెండు జట్లు భావిస్తున్నాయ్. దుబాయ్ వేదికగా జరగనున్న ఈ పోరు కోసం క్రికెట్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఆస్ట్రేలియా జట్టు తమ మొదటి మ్యాచ్ లో దక్షిణాఫ్రికాను చేతిలో 5 వికెట్లతో ఓడించింది. ఆసీస్ బౌలింగ్ విభాగం కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయితే, ఆస్ట్రేలియా ఓపెనర్లు వార్నర్‌ (David Warner), కెప్టెన్‌ ఫించ్‌ (Aaron Finch) ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరూ లయ అందుకోకపోతే కంగారూ పడాల్సిందే. వీరిద్దరూ వరుసగా ఫెయిలవ్వడం ఆస్ట్రేలియాకు పెద్ద తలనొప్పిగా మారింది. అయితే, స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, మిచెల్‌ మార్ష్‌ లతో కూడిన మిడిలార్డర్‌ పటిష్ఠంగా ఉంది.

  ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే మ్యాక్సీ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. స్పిన్‌కు సహకరించే పిచ్‌పై బౌలింగ్‌తో సత్తాచాటేందుకు జంపా సిద్ధమయ్యాడు. కమిన్స్‌, స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, హేజిల్‌వుడ్‌తో కూడిన పేస్‌ దళం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలు విసరనుంది.

  మరోవైపు, లంకేయులు కూడా తమ ఫస్ట్ మ్యాచ్ లో చెలరేగి ఆడారు. బంగ్లాదేశ్ ని చిత్తు చేశారు. శ్రీలంక లో చరిత్ అసలంక, భానుక రాజపక్స సూపర్ ఫామ్ లో ఉన్నారు. బంగ్లా టైగర్ పై 49 బంతుల్లో 80 పరుగులు చేశాడు చరిత్. భానుక రాజపక్స 31 బంతుల్లో 53 పరుగులు చేశాడు. అయితే, మరో ఓపెనర్ కుశాల్ పెరీరా ఫామ్ శ్రీలంక జట్టుకు మైనస్ గా మారింది. కుశాల్ పెరీరాతో పాటు పాతుమ్ నిస్సాంక, కెప్టెన్ దసున్ శనక, అవిష్క ఫెర్నాండో రాణించాల్సిన అవసరం ఉంది.

  శ్రీలంక బౌలింగ్ కూడా పటిష్టంగానే ఉంది. ముఖ్యంగా ఆ జట్టు స్పిన్ విభాగం విజయాల్లో కీ రోల్ ప్లే చేస్తోంది. వానిందు హసరంగా, మహేశ్ తీక్షణ తమ మ్యాజిక్ బంతులతో బ్యాటర్లను తికమక పెడుతున్నారు. పేస్ విభాగంలో లహిరు కుమార, చమిక కరుణరత్నే, దుష్మంత చమీరా కీలకం కానున్నారు.

  హెడ్ టు హెడ్ రికార్డులు :

  ఇప్పటి వరుకు పొట్టి ఫార్మాట్ లో ఇరు జట్లు 16 సార్లు తలపడగా సమఉజ్జీలుగా నిలిచాయ్. శ్రీలంక 8 మ్యాచుల్లో గెలవగా.. ఆస్ట్రేలియా ఎనిమిదింటిలో నెగ్గింది. టీ20 ప్రపంచకప్‌లో మూడు సార్లు ఇరు జట్లు తలపడగా.. రెండు మార్లు ఆస్ట్రేలియానే నెగ్గింది. మరో మ్యాచ్ లో శ్రీలంక గెలిచింది.

  పిచ్ రిపోర్ట్ :

  దుబాయ్ లో పిచ్ చాలా నెమ్మదిగా బిహేవ్ చేసే ఛాన్స్ ఉంది. మరో వైపు మంచు ప్రభావం కూడా ఉండనుంది. దీంతో.. టాస్ గెలిచిన జట్టు ఛేజింగ్ వైపే మొగ్గు చూపే అవకాశం ఉంది. టోర్నీలో ఇప్పటి వరకు ఈ వేదికపై ఆడిన 3 మ్యాచ్‌ల్లోనూ ఛేజింగ్ చేసిన జట్టు విజయం సాధించింది.

  ఇది కూడా చదవండి : " అతి తెలివిగా మాట్లాడితే సహించేది లేదు.. షో నుంచి వెళ్లిపోండి " .. అక్తర్ కు ఘోర అవమానం..!

  తుది జట్లు అంచనా :

  ఆస్ట్రేలియా : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్ (కెప్టెన్), మిచెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాథ్యూ వేడ్ (కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

  శ్రీలంక : కుసల్ పెరెరా (కీపర్), పాతుమ్ నిస్సాంక, చరిత్ అసలంక, అవిష్క ఫెర్నాండో, వనిందు హసరంగా, భానుక రాజపక్స, దసున్ షనక (కెప్టెన్), చమిక కరుణరత్నే, దుష్మంత చమీర, లాహిరు కుమార, బినుర ఫెర్నాండో/మహీష్ తీక్షణ
  Published by:Sridhar Reddy
  First published: