Aus Vs Sa : దురదృష్టానికి కేరాఫ్ అడ్రస్ డికాక్.. ఈ వీడియో చూస్తే మీరు కూడా అదే అంటారు..!

Photo Credit : Twitter

Aus Vs Sa : ధనాధన్ క్రికెట్ అంటనే ఊహించని విన్యాసాలు జరుగుతుంటాయ్. ఒక్కొక్కసారి ఊహించని విధంగా బ్యాటర్లు ఔటవ్వడం మనం చూస్తుంటాం. అలాంటి ఔటై.. సూపర్ -12 స్టేజ్ ఫస్ట్ మ్యాచ్ లోనే చోటు చేసుకుంది.

 • Share this:
  టీ20 ప్రపంచకప్‌ 2021 (T-20 World Cup 2021) లో భాగంగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న మ్యాచులో దక్షిణాఫ్రికా బ్యాటర్లు నిరాశపర్చారు. ఫలింత.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 చేసి.. ఆసీస్ ముందు 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రామ్ (40 పరుగులు) ఒక్కడే పోరాడాడు. 36 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు. కెప్టెన్ బావుమా (12), స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ (7) పూర్తిగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఐదుగురు బ్యాటర్స్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా, మిచెల్‌ స్టార్క్‌ తలా రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌, పాట్ కమిన్స్‌ చెరో వికెట్‌ తీశారు.

  అయితే, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ను దురదృష్టం వెంటాడింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ తొలి బంతిని డికాక్‌ డిఫెన్స్‌ చేయబోయి మిస్‌ అయ్యాడు. అయితే బంతి అతని ప్యాడ్స్‌కు తాకి క్రీజు మీద పడింది. దీంతో డికాక్‌ పరుగుకు యత్నించాడు. అయితే బంతి అనూహ్యంగా వెనక్కి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో డికాక్‌ అవుట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఔట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు.. భిన్నంగా స్పందిస్తున్నారు. డికాక్ బ్యాడ్ లక్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
  View this post on Instagram


  A post shared by ICC (@icc)

  ఇక, మ్యాచ్‌లో టాస్ గెలిచిన ఆస్ట్రేలియా కెప్టెన్ అరోన్ ఫించ్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. దాంతో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌ని ఆరంభించింది. ప్రోటీన్ ఓపెనర్లు క్వింటన్ డికాక్ (7: 12 బంతుల్లో 1x4), తెంబా బవుమా (12: 7 బంతుల్లో 2x4) పేలవరీతిలో వికెట్లు చేజార్చుకున్నారు. ఆపై వాన్ డెర్ డ్యూసెన్ కూడా విఫలమయ్యాడు. స్టార్ బ్యాటర్ డ్యూసెన్ మూడు బంతులల్లో 2 రన్స్ చేశాడు. ఈ సమయంలో ఐడెన్ మార్క్రామ్ జట్టును ఆదుకున్నాడు. హెన్రిచ్ క్లాసెన్ (13: 13 బంతుల్లో 2x4) అండతో మార్క్రామ్ పరుగులు చేశాడు. దీంతో ప్రొటీస్ స్కోర్ బోర్డు ముందుకు కదిలింది.

  ఇది కూడా చదవండి : బ్లాక్ బస్టర్ పోరుకు ముందు విరాట్ కోహ్లీ సంచలన వ్యాఖ్యలు.. ఇలా అన్నాడేంటి..?

  అయితే ఒకవైపు మార్క్రామ్ పోరాడుతున్నా.. డేవిడ్ మిల్లర్ (16: 18 బంతుల్లో), ప్రిటోరియస్ (1) తక్కువ స్కోరుకే ఔటవడంతో దక్షిణాఫ్రికా కనీసం 100 పరుగుల మార్కుని కూడా చేరేలా కనిపించలేదు. అయితే, ఆఖర్లో పట్టుదలతో క్రీజులో నిలిచిన పేస్ బౌలర్ కాగిసో రబాడ.. దక్షిణాఫ్రికా జట్టుకు మంచి స్కోర్ అందించాడు. అతడు ఆఖరి ఓవర్‌లో ఓ సిక్స్ కూడా కొట్టడం విశేషం. రబాడ బ్యాట్ జులిపించడంతో ప్రొటీస్ స్కోర్ 100 దాటింది. మొత్తంగా సఫారీ జట్టులో ఆరుగురు బ్యాట్స్‌మెన్‌లు సింగిల్ డిజిట్‌ స్కోరుకే పరిమితమయ్యారు. టీ20 ప్రపంచకప్‌ 2021లోని మొదటి మ్యాచే అభిమానులను నిరాశపరిచింది.
  Published by:Sridhar Reddy
  First published: