Home /News /sports /

T20 WORLD CUP 2021 AUS VS SA HEAD TO HEAD RECORDS KEY STATS AND PREDICTED PLAYING XI OF BOTH TEAMS SRD

T20 World Cup - Aus Vs Sa : ఇక సూపర్ ధమాకా.. ఆస్ట్రేలియాకు సౌతాఫ్రికా చెక్ పెట్టేనా..? తుది జట్లు ఇవే..!

Aus Vs Sa

Aus Vs Sa

T20 World Cup - Aus Vs Sa : ఏకంగా ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ కోసం నువ్వా.. నేనా.. అనే రీతిలో సవాల్‌ విసిరేందుకు ఎదురుచూస్తున్నాయి.ఇప్పుడు ఈ ‘సూపర్‌–12’ నుంచి ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారనేది ఆసక్తికరం.

ఇంకా చదవండి ...
  టీ20 ప్రపంచకప్‌ (T-20 World Cup 2021) అసలు సిసలు పోరుకు రెడీ అయింది. ధనాధన్‌ క్రికెట్‌ రెండో అంకానికి చేరుకుంది. తాడో పేడో తేల్చుకోవడానికి ఏకంగా 12 జట్లు (Super -12 Stage) రెడీ అయ్యాయి. ఏకంగా ఐదేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత జరుగుతున్న టీ20 ప్రపంచకప్‌ కోసం నువ్వా.. నేనా.. అనే రీతిలో సవాల్‌ విసిరేందుకు ఎదురుచూస్తున్నాయి.ఇప్పుడు ఈ ‘సూపర్‌–12’ నుంచి ఎవరు విశ్వవిజేతగా నిలుస్తారనేది ఆసక్తికరం. ఇక, సూపర్ -12 ధమాకాలో తొలి మ్యాచ్ లో ఆస్ట్రేలియాతో సౌతాఫ్రికా (Australia Vs South Africa) అమీతుమీ తేల్చుకోనుంది. సుదీర్ఘ కాలంపాటు క్రికెట్‌ను శాసించినా టి20 ప్రపంచకప్‌ మాత్రం ఆస్ట్రేలియా జట్టుకు అందని ద్రాక్షే అయింది. ఆరు టోర్నీలను చూస్తే 2010లో ఫైనల్‌ చేరడం మినహా చెప్పుకోదగ్గ ప్రదర్శన ఏదీ లేదు. ఆ జట్టు పేస్‌ దళం మెరుగ్గానే ఉన్నా... స్పిన్‌కు అనుకూలించే యూఏఈ పిచ్‌లపై జంపా, అగర్‌ స్థాయి బౌలర్లు ఏమాత్రం ప్రభావం చూపించగలరనేది సందేహమే. మరోవైపు స్టార్లతో నిండి ఉన్నప్పుడు కూడా దక్షిణాఫ్రికా ఒక్కసారి కూడా ప్రపంచకప్‌లో ఫైనల్‌ చేరలేదు. ఇప్పుడు పెద్దగా అనుభవంలేని ఆటగాళ్లు ఎక్కువ మందితో సఫారీ జట్టు బరిలోకి దిగుతోంది. ఇదే వారికి అడ్వాండేజ్ కానుంది.

  టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం.. తాజా ఫామ్‌.. ఆస్ట్రేలియాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ టోర్నీకి ముందు వరుసగా అయిదు టీ20 సిరీస్‌ల్లో ఓడడం ఆ జట్టును కలవరపెడుతోంది. ఓపెనర్లు వార్నర్‌ (David Warner), కెప్టెన్‌ ఫించ్‌ (Aaron Finch) ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది. ఈ ఇద్దరూ లయ అందుకోకపోతే కంగారూ పడాల్సిందే.

  ఇక స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, మిచెల్‌ మార్ష్‌తో కూడిన మిడిలార్డర్‌ పటిష్ఠంగా ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే మ్యాక్సీ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. స్పిన్‌కు సహకరించే పిచ్‌పై బౌలింగ్‌తో సత్తాచాటేందుకు జంపా, అగర్‌ సిద్ధమయ్యారు. కమిన్స్‌, స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, హేజిల్‌వుడ్‌తో కూడిన పేస్‌ దళం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలు విసరనుంది.

  మరోవైపు వరుస విజయాలతో.. పూర్తి ఆత్మవిశ్వాసంతో దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో అడుగుపెడుతుంది. వరుసగా మూడు టీ20 సిరీస్‌లు నెగ్గి ఊపు మీదున్న సఫారీ సేన.. ఈ ప్రపంచకప్‌లో రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. కెప్టెన్‌ బవుమా, డికాక్‌, హెండ్రిక్స్‌, మార్‌క్రమ్‌లో కూడిన టాప్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా ఉంది. మిడిలార్డర్‌ బలహీనం. పేస్‌ విభాగం రబాడ, ఎంగిడి, ఆనార్జ్‌లతో బలంగానే ఉంది. షంసి, కేశవ్‌లతో స్పిన్‌ విభాగం కూడా పటిష్టంగానే ఉంది.

  ఇది కూడా చదవండి : పాకిస్థాన్ దేశంలో విరాట్ కోహ్లీ కన్నా ఆ టీమిండియా ఆటగాడికే క్రేజ్ ఎక్కువ...!

  హెడ్ టు హెడ్ రికార్డులు :

  టీ-20 ల్లో హెడ్ టు హెడ్ రికార్డులు ఆస్ట్రేలియాకే అనుకూలంగా ఉన్నాయ్. 13 మ్యాచుల్లో ఆస్ట్రేలియా గెలవగా.. సౌతాఫ్రికా 8 మ్యాచుల్లో నెగ్గింది. ఇక టీ-20 వరల్డ్ కప్ లో ఒకసారి మాత్రమే ఇరు జట్లు తలపడ్డాయ్. ఆ ఒక మ్యాచులో ఆస్ట్రేలియాదే ఆధిపత్యం.

  తుది జట్లు (అంచనా) :

  ఆస్ట్రేలియా: ఆరోన్ ఫించ్‌ (కెప్టెన్), డేవిడ్ వార్నర్‌, మిచెల్ మార్ష్‌, గ్లెన్ మ్యాక్స్‌వెల్‌, స్టీవ్ స్మిత్‌, మార్క్ స్టాయినిస్‌, మాథ్యూ వేడ్‌, అస్టన్ అగర్‌, మిచెల్ స్టార్క్‌, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్‌

  దక్షిణాఫ్రికా: క్వింటన్ డికాక్‌, బవుమా (కెప్టెన్), మార్‌క్రమ్‌, వాన్ డర్ డసెన్‌, డేవిడ్ మిల్లర్‌, క్లాసెన్‌, ముల్డర్‌, కగిసో రబాడ, కేశవ్‌, నార్జ్‌/ఎంగిడి, తబ్రేజ్ షంసి
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Australia, Cricket, David Warner, Glenn Maxwell, South Africa, Steve smith, T20 World Cup 2021

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు