Aus Vs Sa : మెగాటోర్నీలో ఫస్ట్ పంచ్ ఆస్ట్రేలియాదే..! ఉత్కంఠ పోరులో బోణి కొట్టిన కంగారూలు..

Australia Team

Aus Vs Sa : 119 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా ఆదిలోనే తడబడింది. 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా.

  • Share this:
    టీ20 వరల్డ్‌కప్ 2021 (T20 World Cup 2021) టోర్నీలో ఆస్ట్రేలియాదే ఫస్ట్ పంచ్. చివరి ఓవర్ వరకు సాగిన ఉత్కంఠ పోరులో సౌతాఫ్రికాపై పై చేయి సాధించారు కంగారూలు. 119 పరుగల ఈజీ టార్గెట్ అయినా ఆఖరి ఓవర్ వరకూ సాగిన థ్రిల్లర్‌లో ఐదు వికెట్ల తేడాతో ఆసీస్ విజయాన్ని అందుకుంది. 119 పరుగుల లక్ష్యఛేదనతో బ్యాటింగ్ మొదలెట్టిన ఆస్ట్రేలియా ఆదిలోనే తడబడింది. 38 పరుగులకే 3 వికెట్లు కోల్పోయింది ఆస్ట్రేలియా. అయితే స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కలిసి నాలుగో వికెట్‌కి 42 పరుగుల భాగస్వామ్యం జోడించి ఆదుకునే ప్రయత్నం చేశారు. 34 బంతుల్లో 3 ఫోర్లతో 35 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, నోర్ట్జే బౌలింగ్‌లో మార్క్‌రమ్ పట్టిన కళ్లు చెదిరే క్యాచ్‌కి పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత 21 బంతుల్లో ఓ ఫోర్‌తో 18 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్ కూడా రివర్స్ స్వీప్‌కి ప్రయత్నించి, షంసీ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. దీంతో మ్యాచులో ఉత్కంఠ రేగింది.

    అయితే ఆఖర్లో.. మ్యాక్స్‌వెల్ అవుటైన తర్వాత స్టోయినిస్, మాథ్యూ వేస్ కలిసి పోరాడారు. 24 బంతుల్లో 36 పరుగులు కావాల్సిన దశలో రబాడా వేసిన 17వ ఓవర్‌లో 11 పరుగులు రాబట్టాడు మాథ్యూ వేడ్. ఆ తర్వాత పెట్రోరియస్ వేసిన 18వ ఓవర్‌లో 7 పరుగులు మాత్రమే వచ్చాయి. నోర్ట్జే వేసిన 19 వ ఓవర్ లో 10 పరుగులు వచ్చాయి. ఆఖరి 6 బంతుల్లో 8 పరుగులు కావాల్సిన స్థితిలో మొదటి బంతికి 2 పరుగులు వచ్చాయి. తర్వాతి బౌండరీ రావడంతో సీన్ పూర్తి ఆసీస్‌వైపు మళ్లింది.


    అంతకు ముందు టాస్ ఓడిపోయి బ్యాటింగ్ కు దిగిన దక్షిణాఫ్రికా బ్యాటర్లు నిరాశపర్చారు. ఫలింత.. నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 118 చేసి.. ఆసీస్ ముందు 119 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. దక్షిణాఫ్రికా బ్యాటర్ మార్క్రామ్ (40 పరుగులు) ఒక్కడే పోరాడాడు. 36 బంతుల్లో మూడు ఫోర్లు, ఓ సిక్స్ సాయంతో 40 పరుగులు చేశాడు. కెప్టెన్ బావుమా (12), స్టార్ ప్లేయర్ క్వింటన్ డికాక్ (7) పూర్తిగా విఫలమయ్యారు. దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌లో ఐదుగురు బ్యాటర్స్‌ సింగిల్‌ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఆసీస్‌ బౌలర్లలో జోష్ హాజిల్‌వుడ్‌, ఆడమ్‌ జంపా, మిచెల్‌ స్టార్క్‌ తలా రెండు వికెట్లు తీయగా.. గ్లేన్ మ్యాక్స్‌వెల్‌, పాట్ కమిన్స్‌ చెరో వికెట్‌ తీశారు.








    View this post on Instagram






    A post shared by ICC (@icc)





    అయితే, ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఓపెనర్‌ క్వింటన్‌ డికాక్‌ను దురదృష్టం వెంటాడింది. హాజిల్‌వుడ్‌ బౌలింగ్‌లో ఇన్నింగ్స్‌ 4వ ఓవర్‌ తొలి బంతిని డికాక్‌ డిఫెన్స్‌ చేయబోయి మిస్‌ అయ్యాడు. అయితే బంతి అతని ప్యాడ్స్‌కు తాకి క్రీజు మీద పడింది. దీంతో డికాక్‌ పరుగుకు యత్నించాడు. అయితే బంతి అనూహ్యంగా వెనక్కి వెళ్లి స్టంప్స్‌ను గిరాటేసింది. దీంతో డికాక్‌ అవుట్‌గా వెనుదిరిగాల్సి వచ్చింది. ప్రస్తుతం ఈ ఔట్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోపై నెటిజన్లు.. భిన్నంగా స్పందిస్తున్నారు. డికాక్ బ్యాడ్ లక్ కు బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నావుగా అంటూ కామెంట్లు చేస్తున్నారు.
    Published by:Sridhar Reddy
    First published: