Home /News /sports /

Aus Vs Ban : బంగ్లాను వణికించిన ఆస్ట్రేలియా బౌలర్లు.. కేవలం 73 పరుగులకే ఆలౌట్..

Aus Vs Ban : బంగ్లాను వణికించిన ఆస్ట్రేలియా బౌలర్లు.. కేవలం 73 పరుగులకే ఆలౌట్..

Photo Credit : ICC

Photo Credit : ICC

Aus Vs Ban : గ్రూప్ 1లో భాగంగా జరుగుతున్న మ్యాచులో బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపారు ఆస్ట్రేలియా బౌలర్లు. ఆసీస్‌ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్‌ వణికిపోయింది.

    గ్రూప్ 1లో భాగంగా జరుగుతున్న మ్యాచులో బంగ్లాదేశ్ బ్యాటర్లకు చుక్కలు చూపారు ఆస్ట్రేలియా బౌలర్లు. ఆసీస్‌ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్‌ వణికిపోయింది. ఈ మ్యాచ్ లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే బంగ్లాదేశ్ అత్య‌ల్ప స్కోర్ న‌మోదు చేసింది. ఆస్ట్రేలియాతో దుబాయ్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కేవ‌లం 73 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 15 ఓవ‌ర్ల‌లో అన్ని వికెట్లు న‌ష్ట‌పోయి కేవ‌లం 73 ప‌రుగులే చేసి.. ఆస్ట్రేలియాకు 74 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా(5/19) వికెట్లతో సత్తా చాటాడు. జంపాకు తోడుగా హేజిల్‌వుడ్‌(2/8), మిచెల్‌ స్టార్క్‌(2/21), మ్యాక్స్‌వెల్‌(1/6) తోడవ్వడంతో కేవలం 15 ఓవర్లలోనే బంగ్లా ఇన్నింగ్స్‌ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమ్‌ హొసేన్‌(19)దే అత్యధిక స్కోర్‌ కాగా, మరో ఇద్దరు(నయీమ్‌(17), మహ్మదుల్లా(16)) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.

    ఈ టోర్నీలో ఆస్ట్రేలియాకు ఇది నాలుగో మ్యాచ్. ఇప్పటిదాకా మూడు మ్యాచ్‌లను ఆడిన కంగారూ టీమ్.. రెండింట్లో విజయాన్ని సాధించింది. పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఈ మ్యాచులో భారీ తేడాతో గెలిచి నెట్ రన్ రేట్ సంపాదించి పాయింట్ల టేబుల్ లో దూసుకెళ్లాలని ఆసీస్ భావిస్తోంది.


    బంగ్లాదేశ్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నంగా ఉంటోంది. ఇప్పటిదాకా ఆ జట్టు ఇంకా బోణీ కూడా చెయ్యలేదు. నాలుగు మ్యాచ్‌లను ఆడగా.. నాలుగింట్లోనూ ఓటమి పాలైంది. పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచింది. టోర్నమెంట్‌లో ముందుకు వెళ్లలేని దుస్థితిని ఎదుర్కొంటోంది.








    View this post on Instagram






    A post shared by ICC (@icc)





    ఆస్ట్రేలియా తుది జట్టు : డేవిడ్ వార్నర్, ఆరోన్ ఫించ్, మిఛెల్ మార్ష్, స్టీవెన్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, మార్కస్ స్టోయినిస్, మాధ్యూ వేడ్ (వికెట్ కీపర్), పాట్ కమ్మిన్స్, మిఛెల్ స్టార్క్, ఆడమ్ జంపా, జోష్ హేజిల్‌వుడ్

    బంగ్లాదేశ్ తుది జట్టు : మహమ్మద్ నయీం, లిట్టన్ దాస్, సౌమ్యా సర్కార్, ముష్ఫికుర్ రహీమ్, మహ్మదుల్లా, అఫీఫ్ హొస్సెయిన్, షమీమ్ హొస్సెయిన్, మెహదీ హసన్, తస్కీన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రెహ్మాన్, షరీఫుల్ ఇమామ్ ఉన్నారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Australia, Bangladesh, T20 World Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు