Home /News /sports /

Aus Vs Ban : దయ లేకుండా బంగ్లాను మడతెట్టేసిన ఆస్ట్రేలియా.. కేవలం ఆరు ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్..

Aus Vs Ban : దయ లేకుండా బంగ్లాను మడతెట్టేసిన ఆస్ట్రేలియా.. కేవలం ఆరు ఓవర్లలోనే టార్గెట్ ఫినిష్..

Photo Credit : ICC

Photo Credit : ICC

Aus Vs Ban : బ్యాటింగ్ కు దిగిన దగ్గర నుంచే ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా ఆడింది. కారణం.. సెమీస్ రేస్ లో నిలవాలంటే వారికి మెరుగైన నెట్ రన్ రేట్ కావాలి. ఈ విక్టరీ నాలుగు మ్యాచుల్లో ఆరు పాయింట్లతో గ్రూప్ -1 లో రెండో స్థానానికి చేరింది ఆస్ట్రేలియా.

ఇంకా చదవండి ...
    గ్రూప్ 1లో భాగంగా జరుగుతున్న మ్యాచులో బంగ్లాదేశ్ ను చిత్తు చిత్తు చేసింది ఆస్ట్రేలియా. కనీస దయ లేకుండా బంగ్లాదేశ్ పులులుపై విరుచుకుపడ్డారు ఆసీస్ కంగారూలు. బంగ్లాదేశ్‌ సెట్ చేసిన టార్గెట్ 74 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన ఆసీస్‌ కేవలం 6.2 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మరో 82 బంతులు మిగిలుండగానే ఈ టార్గెట్ ను ఫినిష్ చేయడం విశేషం. ఫలితంగా 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆసీస్‌ ఓపెనర్లు ఆరోన్‌ ఫించ్‌(20 బంతుల్లో 40; 2 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్‌ వార్నర్‌(10 బంతుల్లో 16; 3ఫోర్లు) మెరుపులు మెరిపించగా.. చివర్లో మిచెల్‌ మార్ష్‌(5 బంతుల్లో 16 నాటౌట్‌; 2 ఫోర్లు, సిక్స్‌) మ్యాచ్‌ను లాంఛనంగా పూర్తి చేశాడు. బంగ్లా బౌలర్లలో షొరీఫుల్‌ ఇస్లాం, తస్కిన్‌ అహ్మద్‌ తలో వికెట్‌ పడగొట్టారు.

    బ్యాటింగ్ కు దిగిన దగ్గర నుంచే ఆస్ట్రేలియా బ్యాటర్లు దూకుడుగా ఆడింది. కారణం.. సెమీస్ రేస్ లో నిలవాలంటే వారికి మెరుగైన నెట్ రన్ రేట్ కావాలి. ఈ విక్టరీ నాలుగు మ్యాచుల్లో ఆరు పాయింట్లతో గ్రూప్ -1 లో రెండో స్థానానికి చేరింది ఆస్ట్రేలియా. వారి ఖాతాలో ఇప్పుడు+1.031 మెరుగైన నెట్ రన్ రేట్ ఉంది. ఆస్ట్రేలియా విక్టరీతో.. సౌతాఫ్రికా మూడో స్ధానానికి పడిపోయింది. ఐదు వికెట్లతో సత్తా చాటిన ఆడమ్ జంపాకి మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.


    ఇక, అంతకు ముందు బంగ్లా బ్యాటర్లకు చుక్కలు చూపారు ఆస్ట్రేలియా బౌలర్లు. ఆసీస్‌ బౌలర్ల ధాటికి బంగ్లాదేశ్‌ వణికిపోయింది. ఈ మ్యాచ్ లో టీ20 ప్ర‌పంచ‌క‌ప్ చ‌రిత్ర‌లోనే బంగ్లాదేశ్ అత్య‌ల్ప స్కోర్ న‌మోదు చేసింది. ఆస్ట్రేలియాతో దుబాయ్ స్టేడియంలో జ‌రుగుతున్న ఈ మ్యాచ్‌లో బంగ్లాదేశ్ కేవ‌లం 73 ప‌రుగులు మాత్ర‌మే చేసింది. 15 ఓవ‌ర్ల‌లో అన్ని వికెట్లు న‌ష్ట‌పోయి కేవ‌లం 73 ప‌రుగులే చేసి.. ఆస్ట్రేలియాకు 74 ప‌రుగుల ల‌క్ష్యాన్ని నిర్దేశించింది.

    ఇది కూడా చదవండి : స్కాట్లాండ్ పై అదే ప్రతాపాన్ని చూపించేనా..? టీమిండియా తుది జట్టు ఇదే..!

    ఆసీస్‌ స్పిన్నర్‌ ఆడమ్‌ జంపా(5/19) వికెట్లతో సత్తా చాటాడు. జంపాకు తోడుగా హేజిల్‌వుడ్‌(2/8), మిచెల్‌ స్టార్క్‌(2/21), మ్యాక్స్‌వెల్‌(1/6) తోడవ్వడంతో కేవలం 15 ఓవర్లలోనే బంగ్లా ఇన్నింగ్స్‌ ముగిసింది. బంగ్లా ఇన్నింగ్స్‌లో షమీమ్‌ హొసేన్‌(19)దే అత్యధిక స్కోర్‌ కాగా, మరో ఇద్దరు(నయీమ్‌(17), మహ్మదుల్లా(16)) మాత్రమే రెండంకెల స్కోర్‌ చేశారు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Australia, Bangladesh, T20 World Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు