Home /News /sports /

T20 WORLD CUP 2021 ARE YOU WANT TO SEE MATCHES IN STADIUM THEN HERE ARE THE RULES FOR EVERY ONE SRD

T20 World Cup 2021 : ధనాధన్ మ్యాచ్ లు స్టేడియాల్లో చూడాలంటే ఈ రూల్స్ పాటించాల్సిందే..!

T-20 World Cup 2021

T-20 World Cup 2021

T20 World Cup 2021 : ఐపీఎల్ లాంటి మెగాటోర్నీ పూర్తవ్వగానే.. మరో మహా సంగ్రామం క్రికెట్ లవర్స్ ను అలరించడానికి రెడీ అవుతోంది. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న టీ-20 ప్రపంచకప్ సమరంలో గెలవాలని ప్రతి జట్టు ఉవ్విల్లూరుతోంది.

    క్రికెట్‌ లవర్స్ కు మరో ధనాధన్ టోర్నీ ఆహ్వానం పలుకుతోంది. యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2021) ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్‌లు.. జరుగుతుండగా నేటి నుంచి క్వాలిఫై మ్యాచులు ప్రారంభం కానున్నాయ్. ఐదేళ్ల తర్వాత జరుగుతున్న ఈ మహా సంగ్రామంలో కప్పు ఎగరేసుకోవాలని అన్ని జట్లు మాస్టర్ ప్లాన్ వేస్తున్నాయ్. అయితే.. ఈ నెల 24న పాకిస్థాన్‌తో(Ind vs Pak 2021).. భారత జట్టు ప్రపంచకప్‌ వేట మొదలు పెట్టనుంది. రౌండ్ 1 మ్యాచ్‌లు ఒమన్-పపువా న్యూ గినియా (Oman VS Papua new guinea) మ్యాచ్‌తో మహా సంగ్రామం ప్రారంభం కానుంది. ఇక, ఈ మ్యాచ్ లను స్టేడియాల్లో డైరక్ట్ గా చూడాలనుంకుంటే మాత్రం కొన్ని రూల్స్ పాటించాల్సిందే. అవి ఏంటో ఓ లుక్కేద్దాం.

    * మ్యాచులు చేసేందుకు ప్రేక్షకులకు అనుమతి ఉంది. అయితే తక్కువ సంఖ్యలో మాత్రమే అనుమతి ఇవ్వనున్నారు. ఒమన్‌లోని అల్ అమెరాట్ స్టేడియంలో 3000 మంది అభిమానులకు ఆతిథ్యమివ్వనున్నారు. ఒమన్ ప్రభుత్వం దేశంలోకి ప్రవేశించే వారందరికీ పూర్తిగా టీకాలు వేయడం తప్పనిసరి చేసింది.

    * యూఏఈలో అన్ని వేదికలు గరిష్ట సామర్థ్యంలో దాదాపు 70 శాతం వద్ద పనిచేస్తాయి . అలాగే, మ్యాచ్ చూడాలనుకున్న వారు రెండు డోసులు వేసుకున్నా సర్టిఫికెట్లు సమర్పించాల్సిందే.

    * అబుదాబి స్టేడియానికి వెళ్లాలంటే మాత్రం రెండు డోసులు వేసుకోవాల్సిందే. అయితే దుబాయ్, షార్జాలో మాత్రం ఇలాంటి కండీషన్లు లేవు. అన్ని వేదికల వద్ద మాత్రం మాస్కులు ధరించాల్సి తప్పనిసరి. ఇక, భారత్ నుంచి వెళ్లే ప్రేక్షకులకు వారం రోజుల క్వారంటైన్ తప్పనిసరి. వారం రోజుల క్వారంటైన్ తర్వాత నెగటివ్ రిపోర్ట్ సమర్పిస్తే మ్యాచ్ లకు అనుమతిస్తారు.

    ఇది కూడా చదవండి : " ధోనీ నువ్వు ఎక్కడుంటే మేము కూడా అక్కడే " .. తలా క్రేజే వేరప్పా..!

    టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం చూడాలంటే..

    అన్ని మ్యాచులను స్టార్ స్పోర్ట్స్ ఛానల్స్‌ ప్రత్యక్ష ప్రసారం చేయనున్నాయి. తెలుగులో చూడాలనుకునే వారు మాత్రం స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు ఛానల్ చూడొచ్చు. అలాగే యాప్‌లో చూడాలనుకునే వారు డిస్నీ హాట్ స్టార్ యాప్ డౌన్‌లోడ్ చేసుకుని మ్యాచులను ప్రత్యక్షప్రసారం చూడొచ్చు. టీమిండియా మ్యాచుల్ని భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7.30 గంటలకు ప్రారంభం కానున్నాయ్.

    ఇది కూడా చదవండి : టీ 20 వరల్డ్ కప్ లో వేరే దేశానికి ఆడుతున్న హైదరాబాద్ కుర్రాడు..! ఆ జట్టుకు మనోడే కీలకం..

    ఇక, టీ20 ప్రపంచ కప్‌లో ఛాంపియన్‌‌గా నిలిచిన టీం $ 1.6 మిలియన్ డాలర్లు(రూ 12.02 కోట్లు), రన్నరప్‌లకు $ 800,000 మిలియన్ డాలర్లు(రూ. 6 కోట్లు) దక్కనున్నాయి. అలాగే సెమీ ఫైనలిస్టులకు ఒక్కొక్క టీంకు $ 400,000 మిలియన్ డాలర్లు(రూ. 3 కోట్లు) లభిస్తాయి.ఈసారి టీ 20 ప్రపంచకప్‌లో తొలిసారి డీఆర్​ఎస్ సమీక్షలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ప్రతీ జట్టుకు ఒక ఇన్నింగ్స్‌కు గరిష్టంగా రెండు రివ్యూలు వాడుకునే అవకాశం ఉంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bcci, Cricket, India VS Pakistan, T20 World Cup 2021, UAE

    తదుపరి వార్తలు