Ban Pak Cricket : " పాక్ తో మ్యాచ్ ఆడొద్దు... ఆ జట్టును బ్యాన్ చేయండి " .. టీమిండియాపై పెరుగుతున్న ఒత్తిడి..

India Vs Pakistan

Ban Pak Cricket : అక్టోబర్ 24న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ (India Vs Pakistan) తలపడనున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. దీంతో, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 • Share this:
  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup) ప్రారంభం అయింది. అక్టోబర్ 17 నుంచి క్వాలిఫైయిర్స్ మ్యాచ్ లు జరగనున్నాయ్. ఇక, అక్టోబ‌ర్ 23న అసలు సమరం.. సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. ఇక అక్టోబర్ 24న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ (India Vs Pakistan) తలపడనున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. దీంతో, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ధనా ధన్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇక, దాయాది దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల ఎఫెక్ట్ తో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయ్. ఇక టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్‌ నాలుగు గెలుపొందింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.

  దాయాది దేశాల మధ్య దాదాపు రెండేళ్ల తర్వాత మ్యాచ్ జరుగుతుండడంతో ఈ మ్యాచ్‌కి విపరీతమైన క్రేజ్ వచ్చింది. భారత్, పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ టికెట్లు బుకింగ్ ఓపెన్ చేసిన కొన్ని నిమిషాల్లోనే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయ్. అయితే, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ పై నీలీనీడలు కమ్ముకునేలా ఉన్నాయ్.

  ఇది కూడా చదవండి : కోహ్లీని సంప్రదించకుండానే బీసీసీఐ కీలక నిర్ణయం..! విరాట్ దూకుడుకు కళ్లెం వేశారా..?

  లేటెస్ట్ గా శ్రీనగర్‌లో జరిగిన ఉగ్రదాడి ప్రభావం టీ20 వరల్డ్ కప్ 2021 టోర్నీలో భారత్, పాకిస్తాన్ మ్యాచ్‌పై తీవ్రంగా పడే అవకాశం కనిపిస్తోంది. గత 24 గంటల్లో దాదాపు శ్రీనగర్ ప్రాంతంలో దాదాపు 9 ఎన్‌కౌంటర్లు జరగగా, ఇందులో 13 మంది టెర్రరిస్టులను కాల్చివేసినట్టు పోలీసులు తెలియచేశారు. తీవ్రవాదుల దాడుల్లో ఓ పానీపూరీ వ్యాపారితో పాటు మరికొందరు పౌరులు ప్రాణాలు కోల్పోయారు.
  ఈ సంఘటనతో సోషల్ మీడియాలో భారత్, పాక్ మ్యాచ్‌ను రద్దు చేయాలని భారీ సంఖ్యలో డిమాండ్లు చేస్తూ, ‘ #banpakcricket’ హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు నెటిజన్లు. పాకిస్తాన్ తీవ్రవాదులు, భారత్‌పై దాడులు చేస్తూ, ఇక్కడి వారి ప్రాణాలు తీస్తుంటే, మీరు వారితో క్రికెట్ ఎలా ఆడతారంటూ కామెంట్లు చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్‌ 2021 టోర్నీలో పాకిస్తాన్ ‌తో మ్యాచ్ ఆడకపోతే మహా అయితే రెండు పాయింట్లు కోల్పోతామని, భారత ప్రజల ప్రాణాల కంటే అవేమీ ఎక్కువ కావంటూ పోస్టులు పెడుతున్నారు.
  పాక్‌తో మ్యాచులు రద్దు చేసుకోవడంతో పాటు తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తూ, టెర్రరిజం పెంచుతున్న పాకిస్తాన్ క్రికెట్ జట్టుపై బ్యాన్ విధించాలంటూ ఐసీసీకి డిమాండ్ చేస్తున్నారు. అయితే మరికొందరు క్రికెట్ అభిమానులు మాత్రం పాకిస్తాన్ తో మ్యాచ్‌ను రద్దు చేసుకోవడం కంటే, వారిని చిత్తుగా ఓడించి.. ఈ హింసాత్మక చర్యలకు ప్రతీకారం తీర్చుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. టీమండియా క్రికెటర్లు కసిగా ఆడి దాయాది దేశానికి తగిన బుద్ధి నేర్పాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
  Published by:Sridhar Reddy
  First published: