• Home
  • »
  • News
  • »
  • sports
  • »
  • T20 WORLD CUP 2020 TO BE RESCHEDULED TO 2022 IPL LIKELY IN OCTOBER NOVEMBER BA

ఈ ఏడాది టీ20 వరల్డ్ కప్ వాయిదా... ఆ ప్లేస్‌లో ఐపీఎల్?

ప్రతీకాత్మక చిత్రం

ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు 2022వ సంవత్సరానికి వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

  • Share this:
    ఈ ఏడాది జరగాల్సిన టీ20 వరల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్‌లు 2022వ సంవత్సరానికి వాయిదా పడే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ ప్రతిపాదనకు ఐసీసీ సానుకూలంగా ఉందని, దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. గురువారం రోజు ఐసీసీ బోర్డు మీటింగ్ జరగబోతోంది. అందులో చర్చించిన తర్వాత ఐసీసీ వరల్డ్ కప్ వాయిదాపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్టు ఐసీసీ వర్గాలు చెబుతున్నాయి. 2021లో కూడా మరో టీ 20 వరల్డ్ కప్ షెడ్యూల్ ఉండడంతో 2022కి వాయిదా వేసే అవకాశం ఉంది. వాస్తవానికి అక్టోబర్‌లో జరగాల్సిన టీ20 వచ్చే ఏడాది మార్చి, ఏప్రిల్ నెలలో జరగొచ్చంటూ ప్రచారం జరిగింది. కానీ, ఒకే ఏడాది, ఒకే ఫార్మాట్‌లో ఉన్న రెండు వరల్డ్ కప్‌లో నిర్వహించడం సమంజసం కాకపోవడంతో 2022 సంవత్సరానికి వాయిదా పడనుంది. ఈ ఏడాది అక్టోబర్, నవంబర్ నెలల్లో ఐపీఎల్ టీ20 నిర్వహించే అవకాశం ఉంది. వాయిదా వేయడం వల్ల రెండు రకాల లాభాలు ఉంటాయని చెబుతున్నారు. రద్దు కావడం లేదు కాబట్టి, యాడ్స్ పరంగా ఇబ్బంది ఉండదు. 2022లో మరో మెగా ఈవెంట్ కూడా లేదు. 2021లో జరిగే టీ 20 వరల్డ్ కప్‌ను భారత్ నిర్వహిస్తుంది. 2022లో జరిగే టీ 20 వరల్డ్ కప్‌ను ఆస్ట్రేలియా నిర్వహించనుంది. 2023లో వన్డే వరల్డ్ కప్ మళ్లీ భారత్‌లో జరగనుంది.

    Published by:Ashok Kumar Bonepalli
    First published: