INDvPAK: ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌పై రామ్‌దేవ్ బాబా సంచలన వ్యాఖ్యలు

విరాట్ కొహ్లీ, బాబా రామ్‌దేవ్, బాబర్ అజామ్

Ramdev baba on india-pakistan match: బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహరంపైనా బాబా రామ్‌దేవ్‌ స్పందించారు. దేశంలోని యువతరానికి ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకోవడం బాధారమని ఆయన తెలిపారు.

 • Share this:
  ఇండియా-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ (India-Pakistan Cricket Match). ఇప్పుడు దేశవ్యాప్తంగా దీని గురించే చర్చ జరుగుతోంది. మరికొద్ది గంటల్లో ఈ హై వోల్టేజ్ ఫైట్ జరగబోతోంది. అసలు సిసలు క్రికెట్ వినోదాన్ని అభిమానులకు పంచబోతోంది. దాయాదుల సమరంలో ఎవరు గెలుస్తారా? అని అందరూ ఉత్కంఠగా ఎదురుచూస్తున్న వేళ.. యోగా గురువు రామ్‌దేవ్ బాబా (Ramdev baba) సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌-పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్‌ జాతీయ ప్రయోజనాలు, రాజధర్మానికి విరుద్ధమని అన్నారు. జమ్మూకాశ్మీర్‌లోని పాకిస్తాన్ సరిహద్దులో ఉద్రిక్తతలు నెలకొన్న నేపథ్యంలో.. ఆదేశంతో క్రికెట్ ఆడడం రాజధర్మానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. క్రికెట్ ఆటని, ఉగ్ర క్రీడని ఒకేసారి ఆడలేమని పేర్కొన్నారు బాబా రామ్‌దేవ్.

  బాలీవుడ్‌లో డ్రగ్స్ వ్యవహరంపైనా బాబా రామ్‌దేవ్‌ స్పందించారు. దేశంలోని యువతరానికి ఇది చాలా ప్రమాదకరమని అన్నారు. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన సినీ ప్రముఖులు డ్రగ్స్ తీసుకోవడం బాధారమని ఆయన తెలిపారు. బ్లాక్ మనీని దేశానికి రప్పించడం వల్లే ఇంధన ధరలు తగ్గుతాయని చెప్పారు బాబా రామ్‌దేవ్. ముడి చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్ ధర ఉండాలని అభిప్రాయపడ్డారు. తక్కువ పన్ను విధించాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు. జాతీయ ప్రయోజనాల కోసం సంక్షేమ కార్యక్రమాలను ప్రభుత్వం కొనసాగించాల్సి ఉంటుందని.. ఈ కారణాల వల్లే ప్రభుత్వం పన్నులను తగ్గించలేకపోతుందని చెప్పారు. పెట్రోల్ ధరలు తగ్గాలన్న కల ఏదో ఒక రోజు నెరవేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

  ఇండియా - పాకిస్తాన్ మ్యాచ్‌ను ఫ్రీగా చూడండి.. క్రికెట్ ఫ్యాన్స్ కోసం జియో బంపర్ ఆఫర్లు

  కాగా, టీ20 ప్రపంచ కప్‌ (T20 World Cup)లో భాగంగా దుబాయ్ (Dubai) వేదికగా ఇవాళ పాకిస్తాన్, ఇండియా మ్యాచ్ రాత్రి 07.30కు ప్రారంభం కానుంది.వరల్డ్ కప్‌ మ్యాచ్‌లో పాకిస్తాన్‌పై ఇప్పటి వరకూ భారత్‌దే పైచేయి. ఒక్కసారి కూడా మెన్ ఇన్ బ్లూ ఓడిపోలేదు. టీ20 వరల్డ్ కప్ మ్యాచ్‌లో పాకిస్తాన్ జట్టును ఐదుసార్లు ఓడించింది. ఆరోసారి కూడా గెలిచి పాకిస్తాన్‌పై జైత్రయాత్రను కొసాగించాలని విరాట్ కొహ్లీ(Virat Kohli) సేన భావిస్తోంది.

  India Vs Pakistan: దాయాదీల పోరులో గెలిచేదెవరో? గత రికార్డులు ఇవే.. భారత్‌ను ఊరిస్తున్న మరో

  020 ఐపీఎల్ తొలి అర్ధ భాగంలో మొదట బ్యాటింగ్ చేసిన జట్లే 77శాతం గెలిచాయి. కానీ రెండో అర్ధభాగంలో పరిస్థితి మారింది. 77శాతం చేజింగ్ చేసిన జట్లే విజయం సాధించాయి. మరి టాస్ ఎవరు గెలుస్తారో? విరాట్ కొహ్లీ, బాబర్ అజామ్ ఎలాంటి నిర్ణయ తీసుకుంటారన్నది హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఐపీఎల్ మ్యాచ్‌ల్లో దుబాయ్ పిచ్‌పై సగటున 150-160 స్కోర్ నమోదయింది. ఫాస్ట్ బౌలర్లే అధిక వికెట్లు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఇరు జట్టు ముగ్గురు పేసర్ల చొప్పున బరిలోకి దింపే అవకాశముంది. ఏదేమైనా ఈ మ్యాచ్‌పై ఇండియా, పాకిస్తాన్‌లోనే కాదు...ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు కూడా ఎంతో ఆసక్తి చూపిస్తున్నారు.
  Published by:Shiva Kumar Addula
  First published: