ఐసీసీ (ICC) పురుషుల టీ20 వరల్డ్ కప్‌ను (T20 World Cup) తొలిసారిగా గెలిచిన ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు (Australian Cricket Team) దుబాయ్‌లో రాత్రంతా పార్టీలోనే మునిగిపోయింది. న్యూజీలాండ్ జట్టుపై (New Zealand Team) విజయం సాధించిన తర్వాత దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అంగరంగ వైభవంగా బహుమతి ప్రదానోత్సవం జరిగింది. అనంతరం ట్రోఫీని చేత పట్టుకొని కెప్టెన్ ఆరోన్ ఫించ్ సహా మిగిలిన క్రికెటర్లు అందరూ మైదానం అంతా పరుగెత్తుతూ సందడి చేశారు. ప్రేక్షకులు అభివాదం చేస్తూ వారికి ధన్యవాదాలు తెలిపారు. ప్రతీ ఆసీస్ క్రికెటర్ మొఖంలో చాంపియన్లు (Champions) అయ్యామన్న సంతోషం కనిపిస్తూనే ఉన్నది. మైదానంలో ట్రోఫీ అందుకునే సమయంలోనే డేవిడ్ వార్నర్ షాంపేన్ పొంగించాడు. సహచర క్రికెటర్లపై షాంపేన్‌ను చల్లుతూ హంగామా చేశాడు. క్రికెటర్లతో పాటు కోచ్, సహాయక సిబ్బంది కూడా వారితో జత కట్టారు.
ఇక ఈ వేడుకలు అక్కడితో ముగిసిపోలేదు. డ్రెస్సింగ్ రూమ్‌కు చేరుకున్న తర్వాత మరింతగా సందడి మొదలైంది. షాంపేన్ బాటిల్స్ పొంగిస్తూ.. చేతిలో బీరు క్యాన్లతో ఆస్ట్రేలియన్లు ఫుల్ ఎంజాయ్ చేశారు. అడమ్ జంపా, పాట్ కమిన్స్, స్టొయినిస్, మిచెల్ స్టార్క్, మిచెల్ మార్ష్, మ్యాక్సీ, జోష్ హాజెల్‌వుడ్ స్టీవ్ స్మిత్ అందరూ కలసి డ్రెస్సింగ్ రూమ్‌లో చిందులు వేశారు. బీర్లు తాగుతూ.. పాటలకు డ్యాన్సులు వేస్తూ అక్కడే చాలా సేపు గడిపారు. మాథ్యూ వేడ్, మార్కస్ స్టొయినిస్ అయితే ఏకంగా బూట్లలో బీరు పోసుకొని తాగేశారు. ఈ వేడుకలు అక్కడితోనే ముగిసిపోలేదు. హోటల్ రూమ్‌కు వెళ్లిన తర్వాత కూడా ఆస్ట్రేలియన్ క్రికెటర్ల సంబరాలు కొనసాగాయి. చాలా మంది క్రికెటర్లు తెల్లవారే వరకు ఆటపాటల్లో మనిగితేలినట్లు తెలుస్తున్నది.
View this post on Instagram
Never turn off the music! ?#T20WorldCup pic.twitter.com/gzK6tWPH4B
— T20 World Cup (@T20WorldCup) November 15, 2021
టోర్నీని సాధాసీగాగా ప్రారంభించిన ఆస్ట్రేలియా.. చివరకు చాంపియన్‌గా అవతరించింది. కివీస్ సెట్ చేసిన టార్గెట్ ను ఆస్ట్రేలియా 18.5 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి ఫినిష్ చేసింది. 8 వికెట్ల తేడాతో మెడిన్ ధనాధన్ టోర్నీని తమ ఖాతాలో వేసుకుంది ఆస్ట్రేలియా. దీంతో పొట్టి కప్ లేని లోటును తీర్చుకుంది కంగారూల టీమ్. మిచెల్ మార్ష్ ( 50 బంతుల్లో 77 పరుగులు.. 6 ఫోర్లు, 4 సిక్సర్లు), డేవిడ్ వార్నర్ (38 బంతుల్లో 53 పరుగులు.. 4 ఫోర్లు, 3 సిక్సర్లు) తో ఆస్ట్రేలియాకు విజయాన్ని అందించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Australia, T20 World Cup 2021