• HOME
  • »
  • NEWS
  • »
  • SPORTS
  • »
  • T20 CHALLENGE TO BE POSTPONED BCCI YET TO RELEASE WOMEN T20 CHALLENGE SCHEDULE JNK

IPL 2021 : కోవిడ్ నేపథ్యంలో కీలక టోర్నీని వాయిదా వేసిన బీసీసీఐ.. ఈ ఏడాదికి ఆ సిరీస్ లేనట్లే!

IPL 2021 : కోవిడ్ నేపథ్యంలో కీలక టోర్నీని వాయిదా వేసిన బీసీసీఐ.. ఈ ఏడాదికి ఆ సిరీస్ లేనట్లే!

మహిళా ఐపీఎల్ ఈ ఏడాది లేనట్లేనా?

  • Share this:
    ఇండియన్ ప్రీమియల్ లీగ్ (IPL 2021) సూపర్ హిట్ అవడంతో ఎప్పటి నుంచో మహిళలకు కూడా ఐపీఎల్ నిర్వహించాలనే డిమాండ్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో గత మూడు సీజన్లుగా మహిళల కోసం టీ20 చాలెంజ్ ట్రోఫీని బీసీసీఐ నిర్వహిస్తున్నది. టీ20 చాలెంజ్ ట్రోఫీ (T20 Challenge) విజయవంతం అవడంతో పూర్తి స్థాయిలో మహిళ ఐపీఎల్ కూడా నిర్వహించతలపెట్టింది. అయితే గత ఏడాది కరోనా కారణంగా యూఏఈలో ఐపీఎల్ నిర్వహించడంతో అక్కడే టీ20 చాలెంజ్ ట్రోఫీని నిర్వహించారు. ఇక ఈ ఏడాదైనా పూర్తి స్థాయిలో ఐపీఎల్ ఉంటుందని అనుకుంటే.. ఏకంగా టీ20 చాలెంజ్ సిరీస్ వాయిదా పడే పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఐపీఎల్‌లో ప్లేఆఫ్స్ జరిగే సమయంలో మహిళల టీ20 చాలెంజ్ సిరీస్‌ను నిర్వహిస్తారు. దేశంలో కరోనా కేసులు భారీగా పెరిగిపోవడంతో పాటు పలు దేశాలు ప్రయాణాలపై ఆంక్షలను విధించాయి. దీంతో ఇతర దేశాలకు చెందిన క్రికెటర్లు ఇండియాకు రావడానికి అడ్డంకులు ఏర్పడుతున్నాయి. దీంతో ఇప్పటి వరకు బీసీసీఐ టీ20 చాలెంజ్‌కు సంబంధించి షెడ్యూల్ ప్రకటించలేదు.

    గత ఏడాది భారత మహిళా క్రికెటర్లతో పాటు ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, వెస్టిండీస్, బంగ్లాదేశ్, శ్రీలంకకు చెందిన 12 మంది విదేశీ క్రీడాకారిణులు ఈ సిరీస్‌లో పాల్గొన్నారు. మంగళవారం ఆస్ట్రేలియా తాత్కాలికంగా భారత విమానాలపై నిషేధం విధించింది. దీంతో ఆ దేశానికి చెందిన క్రికెటర్లు రావడం అనుమానమే. ఇక యూకే చాలా రోజుల క్రితమే ఇండియాను రెడ్ లిస్ట్‌లో పెట్టింది. టీ20 చాలెంజ్ సిరీస్‌ను ఓకే వేదికలో మూడు జట్లతో నిర్వహిస్తారు. ఇండియన్ ప్లేయర్స్‌ను ఒక దగ్గరకు చేర్చడం సులభమే కానీ విదేశీ క్రీడాకారిణులు తీసుకొని రావడం తలకు మించిన భారంగా మారింది. అందుకే బీసీసీఐ ఇప్పటి వరకు షెడ్యూల్ ప్రకటించలేదనే అనుమానాలు ఉన్నాయి. మరో మూడు వారాల్లో ఐపీఎల్ ప్లేఆఫ్స్ ప్రారంభం కానున్నాయి. టీ20 చాలెంజ్ సిరీస్ నిర్వహించాలంటే వారందరి కోసం ఒక బయోబబుల్ ఏర్పాటు చేయాలి. ఇప్పటికే దానికి సంబంధించిన ఏర్పాట్లు జరగాలి. కానీ ఇప్పటి వరకు దానిపై బీసీసీఐ నిర్ణయం తీసుకోలేదు. ఈ ఏడాదికి టీ20 చాలెంజ్ సిరీస్‌ను రద్దు చేస్తుందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

    2018లో చాలెంజ్ ప్రారంభం అయినప్పుడు కేవలం రెండు జట్లతో ఒకే మ్యాచ్ నిర్వహించారు. ఆ తర్వాత ఏడాది జైపూర్ వేదికగా వెలాసిటీ, సూపర్ నోవాస్, ట్రయల్ బ్లేజర్స్ పేరుతో మూడు టీమ్స్ ఏర్పాటు చేసి టోర్నీ నిర్వహించారు. భారత ప్లేయర్లు మిథాలీ రాజ్, హర్మన్ ప్రీత్ కౌర్, స్మృతి మంధాన ఈ జట్లకు కెప్టెన్లుగా వ్యవహరించారు. ఇక గత ఏడాది యూఏఈలో ఈ సిరీస్ నిర్వహించగా.. ఈ ఏడాది అహ్మదాబాద్‌లో నిర్వహించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. కానీ ఇప్పటి వరకు ఆ దిశగా ఎలాంటి ఏర్పాట్లు జరగలేదు.
    Published by:John Naveen Kora
    First published: