హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 Blast 2022: వామ్మో ఈ లివింగ్ స్టోన్ మరీ ఇంత వైలెంటా.! కొడితే బంతి ఏకంగా..

T20 Blast 2022: వామ్మో ఈ లివింగ్ స్టోన్ మరీ ఇంత వైలెంటా.! కొడితే బంతి ఏకంగా..

లివింగ్ స్టోన్ (PC : TWITTER)

లివింగ్ స్టోన్ (PC : TWITTER)

T20 Blast 2022:  టి20 ఫార్మాట్ లో ఇంగ్లండ్ (England) ప్లేయర్ లియామ్ లివింగ్ స్టోన్ (Liam Livingstone) రోజు రోజుకు డేంజరస్ గా తయారవుతున్నాడు. నిన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తరఫున బరిలోకి దిగి రెచ్చిపోయిన లివింగ్ స్టోన్.. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతోన్న టి20 బ్లాస్ట్ లోనూ రెచ్చిపోతున్నాడు.

ఇంకా చదవండి ...

T20 Blast 2022:  టి20 ఫార్మాట్ లో ఇంగ్లండ్ (England) ప్లేయర్ లియామ్ లివింగ్ స్టోన్ (Liam Livingstone) రోజు రోజుకు డేంజరస్ గా తయారవుతున్నాడు. నిన్నటి వరకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2022 సీజన్ లో పంజాబ్ కింగ్స్ (Punjab Kings) తరఫున బరిలోకి దిగి రెచ్చిపోయిన లివింగ్ స్టోన్.. తాజాగా ఇంగ్లండ్ వేదికగా జరుగుతోన్న టి20 బ్లాస్ట్ లోనూ రెచ్చిపోతున్నాడు. ఈ టోర్నీలో లంకషైర్ తరఫున బరిలోకి దిగిన లివింగ్ స్టోన్ దంచి కొడుతున్నాడు. ఇక టోర్నీలో భాగంగా శుక్రవారం శుక్రవారం యార్క్‌షైర్‌తో జరగిన మ్యాచ్‌లో లివింగ్‌స్టోన్ భారీ సిక్సర్ కొట్టాడు. లంకషైర్ ఇన్నింగ్స్‌ 12వ ఓవర్ లో మాథ్యూ రెవిస్ బౌలింగ్ చేయడానికి వచ్చాడు. అతడి బౌలింగ్‌లో ఆఖరి బంతికి లివింగ్‌స్టోన్ లాంగాన్ మీదుగా భారీ సిక్సర్ బాదాడు.

ఇది కూడా చదవండి : బౌల్ట్ పెద్ద మనసు.. స్పెషల్ గిఫ్ట్ దొరకగానే ఆర్సీబీ జెర్సీని ఎలా తీసేశాడో ఈ బుడ్డోడు.. మీరే చూడండి

ఆ సిక్సర్ ఏకంగా స్టేడియం దాటి బయట పడటం విశేషం. ఈ సిక్సర్ కు సంబందించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఈ మ్యాచ్ లో లివింగ్ స్టోన్ పెద్దగా పరుగులు సాధించలేకపోయాడు. 16 బంతులు ఎదుర్కొన్న లివింగ్‌స్టోన్ 23 పరుగులు మాత్రమే చేసి అవుటయ్యాడు. ఐపీఎల్ లో పంజాబ్ కింగ్స్ తరఫున ఆడిన లివింగ్‌స్టోన్ 117 మీటర్ల భారీ సిక్సర్ బాదాడు.

ఇండియన్ ప్రీమియర్ లీగ్ లో 2019లోనే ఎంట్రీ ఇచ్చిన లివింగ్ స్టోన్ గత రెండు సీజన్లలోనూ రాజస్తాన్ రాయల్స్ తరఫున బరిలోకి దిగాడు. అయితే 2019, 2021 సీజన్లలో పెద్దగా రాణించలేకపోయాడు. అయితే ఫిబ్రవరిలో జరిగిన మెగా వేలంలో లివింగ్ స్టోన్ ను 11.50 కోట్లకు పంజాబ్ కింగ్స్ సొంతం చేసుకుంది. ఈ సీజన్ లో 14 మ్యాచ్ ల్లో ఆడిన లివింగ్ స్టోన్ 437 పరుగులు చేశాడు. 182 స్ట్రయిక్ రేట్ ఉండటం విశేషం. 4 అర్ధ సెంచరీలు చేయడం విశేషం. అత్యధిక స్కోరు 70 పరుగులు. శిఖర్ ధావన్ తర్వాత పంజాబ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్ గా లివింగ్ స్టోన్ ఉన్నాడు.

ఆఖరి సమరం నేడే

ఇక నేడు అహ్మదాబాద్ వేదికగా ఐపీఎల్ తుదిపోరు జరగనుంది. రాజస్తాన్ రాయల్స్, గుజరాత్ టైటాన్స్ జట్లు అమీతుమీకి సిద్ధమయ్యాయి. నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 8 గంటలకు ఈ మ్యాచ్ ఆరంభం కానుంది.

First published:

Tags: IPL, IPL 2022, Punjab kings, Shikhar Dhawan

ఉత్తమ కథలు