హోమ్ /వార్తలు /క్రీడలు /

T10 League : 6, 6, 6, 6, 6, 6.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. కొట్టిందెవరో కాదు..

T10 League : 6, 6, 6, 6, 6, 6.. ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు.. కొట్టిందెవరో కాదు..

ఆరు బంతులు ఆరు సిక్సర్లు (PC : TWITTER)

ఆరు బంతులు ఆరు సిక్సర్లు (PC : TWITTER)

T10 League : క్రికెట్ చరిత్రలో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం అంతా ఆశామాషీ వ్యవహారం కాదు. అయినప్పటికీ మరోసారి ఈ ప్రదర్శన పునరావృతం అయ్యింది.

T10 League : క్రికెట్ చరిత్రలో ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదడం అంతా ఆశామాషీ వ్యవహారం కాదు. అయినప్పటికీ మరోసారి ఈ ప్రదర్శన పునరావృతం అయ్యింది. పాండిచ్చేరి వేదికగా జరుగుతోన్న టి10 (T10 League) లీగ్ లో పేట్రియాట్స్ యువ కెరటం కృష్ణ పాండే (Krishna Pandey) ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాది ఈ అరుదైన రికార్డును తన సొంతం చేసుకున్నాడు. క్రికెట్ లో చివరిసారిగా వెస్టిండీస్ (West Indies) మాజీ కెప్టెన్ కీరన్ పొలార్డ్ (Kieron Pollard) శ్రీలంక (Sri Lanka)పై ఈ ఫీట్ ను నమోదు చేయగా.. చాలా రోజుల తర్వాత ఒక ప్రైవేట్ లీగ్ లో మళ్లీ ఈ ప్రదర్శన నమోదైంది.

శనివారం రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కృష్ణ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పేట్రియాట్స్ ఇన్నింగ్స్ సమయంలో 6వ ఓవర్ ను వేయడానికి నితీష్‌ ఠాకూర్‌ బౌలింగ్ కు వచ్చాడు. స్ట్రయికింగ్ ఎండ్ లో ఉన్న కృష్ణ పాండే ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. ఫ్లిక్ షాట్, హుక్ షాట్ ఇలా అన్ని రకాల షాట్లను ఆడిన కృష్ణ పాండే.. లాంగాన్, స్క్వేర్ లెగ్, బ్యాక్ వర్డ్ పాయింట్ ఇలా గ్రౌండ్ నలువైపులా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో అతడి ఖాతాలో ఆరు బంతులకు ఆరు సిక్సర్లు రికార్డు నమోదైంది. ప్రస్తుతం ఈ మ్యాచ్ కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆలస్యం ఎందుకు మీరు కూడా చూసేయండి మరీ.

ఈ మ్యాచ్ లో కేవలం 19 బంతులను మాత్రమే ఎదుర్కొన్న కృష్ణ పాండే ఏకంగా 12 సిక్సర్లు బాదాడు. కేవలం 2 ఫోర్లు మాత్రమే కొట్టాడు. మొత్తంగా 83 పరుగులు చేశాడు. అయినప్పటికీ పేట్రియాట్స్ ఈ మ్యాచ్ లో 4 పరుగుల తేడాతో ఓడిపోయింది. 158 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పేట్రియాట్స్ 10 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 153 పరుగులు మాత్రమే చేసి ఓటమి వైపు నిలిచింది. అంతకుముందు తొలుత బ్యాటింగ్ చేసిన రాయల్స్ 10 ఓవర్లలో 157 పరుగులు చేయగలిగింది. 2007లో దక్షిణాఫ్రికా వేదికగా జరిగిన టి20 ప్రపంచకప్ లో టీమిండియా మాజీ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ ఇంగ్లండ్ పై ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. 19వ ఓవర్ వేసిన బ్రాడ్ బౌలింగ్ లో యువరాజ్ ఈ ఘనతను అందుకున్నాడు.

First published:

Tags: Cricket, India vs South Africa, IPL, IPL 2022, Kieron pollard, Puducherry, Ravi Shastri, South Africa, Team India, Yuvraj Singh

ఉత్తమ కథలు