T10 LEAGUE 2019 DELHI BULLS AMBASSADOR SUNNY LEONE THRILLS AUDIENCE IN LATEST VIDEOS NK
Video : టీ10 లీగ్‌లో సందడి చేసిన సన్నీలియోన్
T10 League 2019 : సన్నీ లియోన్ ఒక్క ఫొటో పెడితే చాలు... పార్టీ చేసుకుంటారు ఫ్యాన్స్. అలాంటిది... టీ10 లీగ్ ప్రారంభోత్సవాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది ఈ బ్యూటీ.
T10 League 2019 : సన్నీ లియోన్ ఒక్క ఫొటో పెడితే చాలు... పార్టీ చేసుకుంటారు ఫ్యాన్స్. అలాంటిది... టీ10 లీగ్ ప్రారంభోత్సవాన్ని ఫ్యాన్స్‌తో షేర్ చేసుకుంది ఈ బ్యూటీ.
T10 League 2019 :క్రికెట్లో పొట్టి క్రికెట్ అయిన టీ20 అందరికీ తెలుసు. దాంట్లోనే ఇంకా పొట్టిదైన టీ10 ఇప్పుడిప్పుడే దుమ్మురేపుతోంది. ఇప్పటికే రెండేళ్లలో రెండు సీజన్లు అయిపోయాయి. ఇప్పుడు మూడో సీజన్ మొదలైంది. ఈ సీజన్లో ఢిల్లీ బుల్స్ జట్టుకు బాలీవుడ్ బ్యూటీ సన్నీలియోన్ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపికైంది. ఇప్పటికే టీమ్ ప్రమోషన్లో ఓ రేంజ్లో సందడి చేసిన సన్నీ... టోర్నీ ప్రారంభోత్సవంలోనూ దుమ్మురేపింది. మ్యాచ్ ప్రారంభం సందర్భంగా... స్టేడియంలో తిరుగుతూ... ఫ్లాగ్‌తో ఫ్యాన్స్‌ని పలకరించడం ప్రత్యేక ఫీలింగ్ అంటూ తన అనుభవాన్ని షేర్ చేసింది సన్నీ లియోన్. ఇలా ముంబై బ్యూటీ తమ ముందుకొచ్చేసరికి... పట్టరాని ఆనందంతో కేరింతలు కొట్టారు ఢిల్లీ క్రికెట్ అభిమానులు. ఢిల్లీ బుల్స్ జట్టు... ఇంతకుముందు బెంగాల్ టైగర్స్ పేరుతో ఆడింది. ఈసారి పేరు మార్చడమే కాకుండా... సన్నీలియోన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా పెట్టుకోవడం విశేషం.
టీ10 స్పోర్ట్స్ మేనేజ్మెంట్ కంపెనీ... ఈ టీ10 లీగ్ నిర్వహిస్తోంది. ఇందులో 10 ఓవర్లే ఉంటాయి. జస్ట్ 90 నిమిషాల్లో మ్యాచ్ ముగుస్తుంది. 2017లో తొలిసారి ఈ లీగ్ మొదలైనప్పుడు... 8 ఓవర్లే ఉండేవి. ఆ ఏడాది కేరళ కింగ్స్ విన్నర్‌గా నిలిచారు. తర్వాతి ఏడాది ఆగస్టులో మొదలైన ఈ లీగ్‌కి ICC అధికారికంగా పర్మిషన్స్ ఇచ్చేసింది. ఆ సంవత్సరం నార్తరన్స్ వారియర్స్ విన్నర్స్ అయ్యారు. మరి ఈ ఏడాది ఎవరు విజేతలో త్వరలో తేలుతుంది.