గత నవంబర్ లో నటరాజన్ తండ్రైన సంగతి తెలిసిందే. ఐపీఎల్ సమయంలో అతని భార్య పండంటి బిడ్డకు జన్మనిచ్చింది. అయితే, ఈ యార్కర్ల లేటెస్ట్ గా తన కూతురు పేరను వెల్లడించాడు. కుమార్తె జన్మించి నాలుగు నెలలు పూర్తైన సందర్భంగా భార్య, బిడ్డతో కలిసి ఉన్న ఫోటోను షేర్ చేశారు. దానికి ఉద్వేగపూరిత కామెంట్ కూడా జత చేశాడు. కూతుళ్లే బెస్ట్ అంటూ పుత్రికోత్సాహంతో మురిసిపోయాడు. " జీవితంలో మేము అందుకున్న అత్యంత అందమైన బహుమతి నువ్వే. మా జీవితాలు ఇంత సంతోషకరంగా మారడానికి కారణం నువ్వే. మమ్మల్ని నీ తల్లిదండ్రులుగా ఎంచుకున్నందుకు థాంక్యూ లడ్డూ. ఎల్లప్పుడూ నిన్ను ప్రేమిస్తూనే ఉంటాం. మా చిన్నారి దేవత హన్విక" అంటూ తన కూతురి పేరును తెలిపాడు నట్టూ. అయితే, గతేడాది ఐపీఎల్ లో నటరాజన్ చెలరేగిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఆస్ట్రేలియా పర్యటనకు నెట్ బౌలర్ గా ఎంపికై.. మూడు ఫార్మాట్లలో ఆడి సత్తా చాటాడు. ఐపీఎల్ సమయంలో నటరాజన్ కూతురు జన్మిచంగా.. ఆసీస్ టూర్ లో భాగంగా తన బిడ్డకు దూరంగా ఉన్నాడు నటరాజన్.
హన్విక అంటే సరస్వతి మరియు లక్ష్మీ దేవి యొక్క నెమలి అని అర్థం. అయితే, ఈ పేరు పెట్టడంతో నటరాజన్ పై తమిళ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమిళంలో పెట్టకుండా..ఉత్తరాది పేరు పెట్టడమేంటని ప్రశ్నిస్తున్నారు. తమిళంలో పేరు పెట్టొచ్చు కదా అంటూ ఉచిత సలహాలిస్తున్నారు. మరి కొందరు నట్టూకు సపోర్ట్ చేస్తున్నారు. మంచి పేరు పెట్టవంటూ ప్రశంసలత్తో ముంచెత్తుతున్నారు. కామెంట్లు చేసే వారిని పట్టికోవద్దంటూ ట్వీట్లు చేస్తున్నారు.
ప్రస్తుతం ఇంట్లోనే ఉన్న ఈ తమిళనాడు ఫాస్ట్‌బౌలర్ కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నాడు. ఇక నెట్‌బౌలర్‌గా వెళ్లి, ఆస్ట్రేలియా గడ్డపై మూడు ఫార్మాట్లలోనూ భారత్ తరఫున అరంగేట్రం చేసిన నట్టూ భాయ్.. ఈ టూర్‌ను మరింత ప్రత్యేకంగా మార్చుకున్నాడు. ఈ అదృష్టానికి తన కూతురి రాకే కారణమంటూ మురిసిపోయాడు. ఇక స్వదేశంలో ఇంగ్లండ్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఆడే భారత జట్టులో నటరాజన్‌కు చోటు దక్కింది. మార్చి 12 నుంచి 20 మార్చి వరకు అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో జరుగనున్న ఐదు టీ20 మ్యాచ్‌లు జరుగనున్నాయి. ఈ మ్యాచ్ ల్లో కూడా సత్తా చాటితే నటరాజన్ కు ఇక తిరుగుండదని చెప్పుకోవచ్చు.
Published by:Sridhar Reddy
First published:February 23, 2021, 15:37 IST