హోమ్ /వార్తలు /క్రీడలు /

T-20 World Cup 2021 : ఇవాళ్టి నుంచే క్రికెట్ మహా సంగ్రామం.. షెడ్యూల్, టైమింగ్స్ లాంటి పూర్తి వివరాలు మీ కోసం..!

T-20 World Cup 2021 : ఇవాళ్టి నుంచే క్రికెట్ మహా సంగ్రామం.. షెడ్యూల్, టైమింగ్స్ లాంటి పూర్తి వివరాలు మీ కోసం..!

T-20 World Cup 2021

T-20 World Cup 2021

T-20 World Cup 2021 : . ఐదేళ్ల విరామం తరువాత జరగనున్న పొట్టి ప్రపంచ కప్‌లో ఈసారి అత్యధికంగా 16 జట్లు తలపడనున్నాయి. ఈ టోర్నీలో తొలుత గ్రూప్‌-ఏ, గ్రూ-బిలోని క్వాలిఫయర్స్‌ జట్ల మధ్య తొలి రౌండ్ లీగ్ మ్యాచ్‌లు జ‌రగనున్నాయి.

ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న టీ-20 వరల్డ్ కప్ సమయం రానే వచ్చింది. యూఏఈ (UAE), ఒమన్ (Oman) వేదికగా అక్టోబర్ 17 నుంచి పురుషుల టీ20 వరల్డ్ కప్ (ICC T20 World Cup) ప్రారంభం కానుంది. రౌండ్ 1 మ్యాచ్‌లు ఒమన్-పపువా న్యూ గినియా మ్యాచ్‌తో ప్రారంభం కానున్నాయి. ఇక, సూపర్ 12 మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభం కానుండగా.. దాయాది దేశాలు ఇండియా-పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా మ్యాచ్ జరుగనుంది. రౌండ్ 1లో ఒమన్, పపువా న్యూ గినియా, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, శ్రీలంక, నమీబియా జట్లు తలపడనున్నాయి. ఇందులో నుంచి 4 జట్లు సూపర్ 12కు(T20 World Cup Super 12) అర్హత సాధిస్తాయి. రౌండ్1 మ్యాచ్‌లు అక్టోబర్ 17 నుంచి 22 వరకు జరుగనున్నాయి..

మ్యాచ్ టైమింగ్స్ వివరాలు..

ప్రతీ రోజు రెండు మ్యాచ్‌ల(T20 World Cup Schedule) చొప్పున రౌండ్ 1 మ్యాచ్‌లు జరుగుతాయని ఐసీసీ( ప్రకటించింది. మొదటి మ్యాచ్ 2.00 గంటలకు, రెండో మ్యాచ్ సాయంత్రం 6.00 గంటలకు జరుగుతుందని ఐసీసీ ( International Cricket Council ) చెప్పింది. ఇక సూపర్ 12 మ్యాచ్‌లు అక్టోబర్ 23 నుంచి ప్రారంభం కానున్నాయి. సూపర్ 12లో తొలి మ్యాచ్ గ్రూప్ 1లోని ఆస్ట్రేలియా-సౌతాఫ్రికా మధ్య అక్టోబర్ 23న అబుదాబి వేదికగా మధ్యాహ్నం 2.00 (ఇండియాలో మధ్యాహ్నం 2.30 గంటలకు) ప్రారంభం కానుంది. అదే రోజు సాయంత్రం 6.00 గంటలకు ఇంగ్లాండ్-వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతుంది. ఇక గ్రూప్‌ 2లో తొలి మ్యాచ్ ఇండియా(India)-పాకిస్తాన్(Pakistan) మధ్య సాయంత్రం 6.00 గంటలకు (ఇండియాలో రాత్రి 7.30 గంటలకు) ప్రారంభం అవుతుంది. పురుషుల టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనల్ అబుదాబి వేదికగా నవంబర్ 10న సాయంత్రం 6.00 గంటలకు, రెండో సెమీఫైనల్ దుబాయ్‌లో నవంబర్ 11న సాయంత్రం 6.00 గంటలకు జరుగుతుంది. ఈ రెండు మ్యాచ్‌లకు కూడా ఐసీసీ రిజర్వ్ డే కేటాయించింది. ఫైనల్ మ్యాచ్ దుబాయ్‌లో నవంబర్ 14న జరుగనుంది.

ఇది కూడా చదవండి :  " చూడు పంత్.. నువ్వే కాకుంటే నాకు చాలా మంది కీపర్లున్నారు " .. రిషబ్ కు కోహ్లీ వార్నింగ్..


రౌండ్ 1 లో తలపడే జట్లు : 

 గ్రూప్ ఏగ్రూప్ బి
శ్రీలంకబంగ్లాదేశ్
రౌండ్ -1ఐర్లాండ్స్కాట్లాండ్
నెదర్లాండ్స్పపువా న్యూ గినియా
నమీబియాఓమన్


అందుకే యూఏఈలో..

టీ 20 వరల్డ్ కప్  ఇండియా వేదికగా జరగాల్సి ఉంది. అయితే కరోనా నేపథ్యంలో వరల్డ్ కప్ నిర్వహణకు యూఏఈనే బెటర్ ఛాయిస్ అని ఐసీసీ భావించింది.  కరోనా నేపథ్యంలో టీ20 వరల్డ్ కప్ వేదికను యూఏఈకి తరలిస్తున్నట్లు బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ (Sourav Ganguly) కూడా తెలిపారు. ఆటగాళ్ల ఆరోగ్య భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు.

ఇది కూడా చదవండి : వీడిన సస్పెన్స్.. టీమిండియా హెడ్ కోచ్ గా గంగూలీ స్నేహితుడు.. జీత‌మెంతంటే!


నేరుగా అర్హత సాధించని బంగ్లాదేశ్, శ్రీలంక..

టీ20 వరల్డ్ కప్ సూపర్-12కు మొత్తం 8 జట్లు నేరుగా అర్హత సాధించాయి. అందులో ఇంగ్లండ్, ఇండియా, ఆస్ట్రేలియా, పాకిస్తాన్, సౌతాఫ్రికా, న్యూజీలాండ్, వెస్టిండీస్, అఫ్గానిస్తాన్ ఉన్నాయి. 2014లో టి20 ప్రపంచ చాంపియన్ గా నిలిచిన శ్రీలంక ఈసారి నేరుగా అర్హత సాధించలేకపోయింది. బంగ్లాదేశ్(Bangladesh) కూడా సూపర్-12కు నేరుగా అర్హత సాధించడంలో విఫలం అయింది. బంగ్లాదేశ్, శ్రీలంకలు రౌండ్-1 లో మరో 6 జట్లతో తలపడనున్నాయి. రౌండ్-1లో శ్రీలంక, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా గ్రూప్-ఏలో, బంగ్లాదేశ్, స్కాట్లాండ్, పపువా న్యూగినియా, ఓమన్ గ్రూప్‌-బిలో తలపడనున్నాయి. రౌండ్ -1 లో ప్రతి గ్రూప్ లో టాప్ -2 లో నిలిచిన జట్లు సూపర్-12 కి అర్హత సాధిస్తాయి.

సూపర్ -12 లో తలపడే జట్లు : 

గ్రూప్ -1గ్రూప్ -2
ఇంగ్లండ్ఇండియా
ఆస్ట్రేలియాపాకిస్థాన్
సూపర్-12సౌతాఫ్రికాన్యూజీలాండ్
వెస్టిండీస్అఫ్గానిస్థాన్
గ్రూప్ -ఏ విజేతగ్రూప్- ఏ రన్నరప్
గ్రూప్ -బి రన్నరప్గ్రూప్ - బి విజేత


అక్టోబర్ 23 నుంచి అసలైన సమరం..

రౌండ్ 1 మ్యాచ్‌లు ముగిసిన తర్వాత అక్టోబర్ 23 టీ 20 అసలైన సమరం మొదలుకానుంది. సూపర్- 12 సమరంలో మొత్తం 12 జట్లు రెండు గ్రూపులుగా తలపడనున్నాయి. సూపర్-12 లో తొలి మ్యాచ్ అక్టోబర్ 23న ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్ల మ్యాచ్ జరగనుంది.  సూపర్-12 లో ప్రతి గ్రూప్ నుంచి టాప్ -2 లో నిలిచిన జట్లు సెమీఫైనల్స్ కు అర్హత సాధిస్తాయ్.

టీమిండియా ఏ జట్లతో తలపడనుందంటే..

టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా(India T20 World Cup Squad).. పాకిస్తాన్‌తో తలపడనుంది. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతంది. ఆ తర్వాత అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో, నవంబర్ 5న రౌండ్‌ 1లో గ్రూప్ బిలో టాప్-2గా నిలిచిన జట్టుతో, నవంబర్ 8న రౌండ్‌ 1లో గ్రూప్ ఏలో టాప్-2గా నిలిచిన జట్టుతో భారత్ తలపడనుంది.

టీ-20 వరల్డ్ కప్ పూర్తి షెడ్యూల్ :

మ్యాచ్ నెం.డేట్మ్యాచ్టైం(ఇండియన్)వెన్యూస్టేజ్
1అక్టోబర్ 17ఓమన్ Vs పపువా న్యూగినియా15:30మస్కట్రౌండ్ 1
2అక్టోబర్ 17 బంగ్లాదేశ్ Vs స్కాట్లాండ్19:30మస్కట్రౌండ్ 1
3అక్టోబర్ 18ఐర్లాండ్ Vs నెదర్లాండ్15:30అబుదాబిరౌండ్ 1
4అక్టోబర్ 18ఐర్లాండ్ Vs నెదర్లాండ్19:30అబుదాబిరౌండ్ 1
5అక్టోబర్ 19స్కాట్లాండ్ Vs పపువా న్యూ గినియా15:30మస్కట్రౌండ్ 1
6అక్టోబర్ 19స్కాట్లాండ్ Vs పపువా న్యూ గినియా19:30మస్కట్రౌండ్ 1
7అక్టోబర్ 20నమీబియా Vs నెదర్లాండ్స్15:30అబుదాబిరౌండ్ 1
8అక్టోబర్ 20శ్రీలంక Vs ఐర్లాండ్19:30అబుదాబిరౌండ్ 1
9అక్టోబర్ 21బంగ్లాదేశ్ Vs పపువా న్యూగినియా15:30మస్కట్రౌండ్ 1
10అక్టోబర్ 21ఒమన్ Vs స్కాట్లాండ్19:30మస్కట్రౌండ్ 1
11అక్టోబర్ 22నమీబియా Vs ఐర్లాండ్15:30షార్జారౌండ్ 1
12అక్టోబర్ 22శ్రీలంక Vs నెదర్లాండ్స్19:30షార్జారౌండ్ 1
13అక్టోబర్ 23ఆస్ట్రేలియా Vs సౌతాఫ్రికా15:30అబుదాబిసూపర్ 12
14అక్టోబర్ 23ఇంగ్లాండ్ Vs వెస్టిండీస్19:30దుబాయ్సూపర్ 12
15అక్టోబర్ 24ఏ1 Vs బీ215.30షార్జాసూపర్ 12
16అక్టోబర్ 24ఇండియా Vs పాకిస్తాన్19.30దుబాయ్సూపర్ 12
17అక్టోబర్ 25అఫ్గానిస్తాన్ Vs బీ119:30షార్జాసూపర్ 12
18అక్టోబర్ 26సౌతాఫ్రికా Vs వెస్టిండీస్15.30దుబాయ్సూపర్ 12
19అక్టోబర్ 26పాకిస్తాన్ Vs న్యూజీలాండ్19.30షార్జాసూపర్ 12
20అక్టోబర్ 27ఇంగ్లాండ్ Vs బీ215.30అబుదాబిసూపర్ 12
21అక్టోబర్ 27బీ1 Vs ఏ219.30అబుదాబిసూపర్ 12
22అక్టోబర్ 28ఆస్ట్రేలియా Vs ఏ119:30దుబాయ్సూపర్ 12
23అక్టోబర్ 29వెస్టిండీస్ Vs బీ215.30షార్జాసూపర్ 12
24అక్టోబర్ 29అఫ్గానిస్తాన్ Vs పాకిస్తాన్19:30దుబాయ్సూపర్ 12
25అక్టోబర్ 30సౌతాఫ్రికా Vs ఏ115.30షార్జాసూపర్ 12
26అక్టోబర్ 30ఇంగ్లాండ్ Vs ఆస్ట్రేలియా19:30దుబాయ్సూపర్ 12
27అక్టోబర్ 31అఫ్గానిస్తాన్ Vs ఏ215.30అబుదాబిసూపర్ 12
28అక్టోబర్ 31ఇండియా Vs న్యూజీలాండ్19.30దుబాయ్సూపర్ 12
29నవంబర్ 1ఇంగ్లాండ్ Vs ఏ119.30షార్జాసూపర్ 12
30నవంబర్ 2సౌతాఫ్రికా Vs బీ215.30అబుదాబిసూపర్ 12
31నవంబర్ 2పాకిస్తాన్ Vs ఏ219.30అబుదాబిసూపర్ 12
32నవంబర్ 3న్యూజీలాండ్ Vs బీ115.30దుబాయ్సూపర్ 12
33నవంబర్ 3ఇండియా Vs అఫ్గానిస్తాన్19.30అబుదాబిసూపర్ 12
34నవంబర్ 4ఆస్ట్రేలియా Vs బీ215.30దుబాయ్సూపర్ 12
35నవంబర్ 4వెస్టిండీస్ Vs ఏ119.30అబుదాబిసూపర్ 12
36నవంబర్ 5న్యూజీలాండ్ Vs ఏ215.30షార్జాసూపర్ 12
37నవంబర్ 5ఇండియా Vs బీ219.30దుబాయ్సూపర్ 12
38నవంబర్ 6ఆస్ట్రేలియా Vs వెస్టిండీస్15.30అబుదాబిసూపర్ 12
39నవంబర్ 6ఇంగ్లాండ్ Vs సౌతాఫ్రికా19.30షార్జాసూపర్ 12
40నవంబర్ 7న్యూజీలాండ్ Vs అఫ్గానిస్తాన్15.30అబుదాబిసూపర్ 12
41నవంబర్ 7పాకిస్తాన్ Vs బీ119.30షార్జాసూపర్ 12
42నవంబర్ 8ఇండియా Vs ఏ219.30దుబాయ్సూపర్ 12
43నవంబర్ 10తొలి సెమీ ఫైనల్19:30అబుదాబిప్లే ఆఫ్
44నవంబర్ 11రెండో సెమీఫైనల్19:30దుబాయ్ప్లే ఆఫ్
45నవంబర్ 14ఫైనల్19:30దుబాయ్ఫైనల్


భారత కాలమానం ప్రకారం మ్యాచ్ టైమింగ్స్..

భారత్ కాలమాన ప్రకారం టీమిండియా మ్యాచ్‌లన్నీ కూడా రాత్రి 7.30 గంటలకు ప్రసారమవుతాయి. అయితే టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup) లో ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. ప్రతీసారి టీమిండియానే పైచేయి సాధించింది. ఇందులో కూడా 4 సార్లు గ్రూప్ దశలోనే తలపడ్డారు.

డీఆర్‌ఎస్ అందుబాటులో ఉంటుందా?

అవును, మొదటిసారిగా పురుషుల టీ 20 ప్రపంచకప్ సమీక్షలకు డీఆర్‌ఎస్‌ను అందుబాటులోకి తీసుకొచ్చారు. కరోనా మహమ్మారి తర్వాత మరలా క్రికెట్ మొదలయిన తరువాత టీ 20 ల్లో జరిగినట్లుగా ప్రతీ జట్టుకు ఒక ఇన్నింగ్స్‌కు గరిష్టంగా రెండు రివ్యూలు వాడుకునేందుకు అవకాశం ఉంది.

First published:

Tags: Cricket, ICC, India VS Pakistan, Sports, T20 World Cup 2021, Team india, Virat kohli

ఉత్తమ కథలు