ఐసీసీ (ICC) టీ20 వరల్డ్ కప్‌లో (T20 World Cup) భాగంగా శుక్రవారం రాత్రి దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో అఫ్గానిస్తాన్ (Afghanistan) - పాకిస్తాన్ (Pakistan) మధ్య లీగ్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్‌లో పాకిస్తాన్ 5 వికెట్ల తేడాతో అఫ్గాన్‌పై విజయం సాధించింది. అయితే మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఇరు జట్లకు చెందిన ఫ్యాన్స్ రెండు గ్రూపులుగా విడిపోయి స్టేడియంలోనే బాహాబాహీకి దిగారు. బౌండరీ లైన్‌కు అతి సమీపంలోనే రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకున్నది. ఈ మ్యాచ్ చూడటానికి భారీగా ప్రేక్షకులు తరలి వచ్చారు. రాత్రి జరగాల్సిన మ్యాచ్ కోసం మధ్యాహ్నం నుంచే ఫ్యాన్స్ స్టేడియం వద్దకు చేరుకున్నారు. అయితే భారీగా చేరుకున్న అఫ్గాన్ ఫ్యాన్స్ స్టేడియంలోనికి చొరబడటానికి ప్రయత్నించారు. వారి వద్ద టికెట్లు లేకపోయినా గేట్లు బద్దలు కొట్టి లోనికి ప్రవేశించడానికి తీవ్రంగా ప్రయత్నించారు. కొంత మంది ఫ్యాన్స్ లోపలకు కూడా వెళ్లిపోయారు. దుబాయ్ పోలీసులు, స్టేడియం సెక్యూరిటీ వీరిని నిలువరించడానికి ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో ముందుగానే స్టేడియం గేట్లు మూసేశారు.
కాగా ఒక పాకిస్తాన్ ఫ్యాన్ తన పిల్లలతో కలసి లండన్ నుంచి మ్యాచ్ చూడటానికి దుబాయ్ వచ్చాడు. వాళ్ల వద్ద టికెట్లు ఉన్నా లోనికి వెళ్లడానికి వీలు లేకుండా పోయింది. పదుల సంఖ్యలో టికెట్లు కలిగిన ఫ్యాన్స్ లోపలకు వెళ్లలేకపోయారు. భారీగా చేరిన వారి వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కున్నారు. గేట్లు దూకి మరీ లోపలకు వెళ్లడానికి ప్రయత్నించారు. దీంతో అక్కడ రసాభసగా మారింది. సెక్యూరిటీ, దుబాయ్ పోలీసులు కేవలం చూస్తూ ఉండిపోయారు. టికెట్లు లేని వారిని అక్కడి నుంచి తరిమేయడానికి తీవ్రంగా ప్రయత్నించి విఫలమయ్యారు. దీంతో టికెట్లు ఉన్న వాళ్లు కూడా మ్యాచ్ చూడకుండానే తిరుగు ముఖం పట్టారు.
Is this a third world country?? #PAKvAFG #T20WorldCup @ICC @Platinumlist @T20WorldCup pic.twitter.com/LrzNEVVdJ4
— Waqy (@waqyyy) October 29, 2021
big game . #PakvsAfg pic.twitter.com/UJ5dPdL3OH
— just butter (@joshthebutter) October 29, 2021
Afghan crowd is desperate to watch match many are arrested by police they were trying to enter stadium without ticket #afg #pak #PakvsAfg pic.twitter.com/d0bR78vqBA
— Qamber Zaidi (@qamber_official) October 29, 2021
ఇక లోపలకు ఎంటర్ అయిన ఫ్యాన్స్‌లో చాలా మంది రెండు వర్గాలుగా విడిపోయి ఘర్షణలకు దిగారు. బౌండరీ లైన్‌కు దగ్గరగా ఉన్న స్టాండ్స్‌లో కూర్చున్ అఫ్గాన్-పాక్ ఫ్యాన్స్ బాహాబాహీకి దిగడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. సెక్యూరిటీ వారిని విడదీసి దుబాయ్ పోలీసులకు అప్పగించింది. పదుల సంఖ్యలో ఫ్యాన్స్‌ను దుబాయ్ పోలీసులు అరెస్టు చేశారు. అలాగే టికెట్ లేకుండా లోపలకు ప్రవేశించిన వారిని కూడా గుర్తించి అదుపులోనికి తీసుకున్నారు. మొత్తానికి ఒకవైపు మ్యాచ్ జరుగుతుండగానే ఇలా ఉద్రిక్త వాతావరణం ఏర్పడటంతో సెక్యూరిటీ. దుబాయ్ పోలీసులు అప్రమత్తమయ్యారు. ఇంకోసారి ఇలాంటి ఘటనలు జరుగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని స్టేడియం నిర్వాహకులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Cricket, ICC, T20 World Cup 2021