Home /News /sports /

T 20 WORLD CUP 2021 WI VS BAN LIVE UPDATES WEST INDIES SETS NORMAL TARGET SRD

WI Vs Ban : డూ ఆర్ డై మ్యాచ్ లో తడబడ్డ విండీస్.. బంగ్లా ముందు స్వల్ప టార్గెట్..

Photo Credit : ICC

Photo Credit : ICC

WI Vs Ban : బంగ్లాదేశ్ తో జరుగుతున్న చావోరేవో మ్యాచులో వెస్టిండీస్ (WI Vs Ban) ఎప్పటిలాగే తడబడింది వెస్టిండీస్. టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. విండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది.

    యూఏఈ వేదికగా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) ఫ్యాన్స్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఈ మెగాటోర్నీలో హాట్ ఫేవరేట్లు బొక్క బొర్లాపడుతుంటే.. మరి కొన్ని జట్లు అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాయ్. డిఫెండింగ్ ఛాంపియన్ విండీస్ విషయంలోనూ అదే జరుగుతోంది. బంగ్లాదేశ్ తో జరుగుతున్న చావోరేవో మ్యాచులో వెస్టిండీస్ (WI Vs Ban) ఎప్పటిలాగే తడబడింది. వెస్టిండీస్ బ్యాటర్లు. టాస్ గెలిచిన బంగ్లాదేశ్.. విండీస్ ను బ్యాటింగ్ కు ఆహ్వానించింది. నిర్ణీత 20 ఓవర్లలో విండీస్.. 7 వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి విండీస్ ను నిలువరించారు. ఆఖర్లో పూరన్ చెలరేగడంతో విండీస్ ఈ మాత్రం స్కోరైనా సాధించింది. లేకపోతే.. వారి పరిస్థితి మరింత దారుణంగా మారేది. వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 40) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.

    టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన విండీస్ కు ఆదిలోనే షాక్ తగిలింది ఓపెనర్లు క్రిస్ గేల్ (10 బంతుల్లో 4), ఎవిన్ లూయిస్ (9 బంతుల్లో 6) మాత్రమే చేశారు. మూడో ఓవర్ చివరి బంతికి లూయిస్ ను ముస్తాఫిజుర్ ఔట్ చేశాడు. ఇక ఐదో ఓవర్లో మెహది హసన్.. గేల్ ను క్లీన్ బౌల్డ్ చేశాడు. దీంతో 5 ఓవర్లు ముగిసేసరికి విండీస్ స్కోరు 21-2. ఓపెనర్లిద్దరూ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన హిట్మెయర్ (9) ఎక్కువసేపు నిలువలేదు. ఆ వెంటనే విండీస్ సారథి కీరన్ పొలార్డ్ (14) రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరిగాడు. తర్వాత వచ్చిన రసెల్ (0) కూడా రనౌట్ అయ్యాడు. దీంతో విండీస్ పీకల్లోతు కష్టాల్లో పడింది.


    ఆ సమయంలో వన్ డౌన్ బ్యాటర్ గా వచ్చిన రోస్టన్ చేజ్ ( 46 బంతుల్లో 39) నిలకడైన ఆటతీరుతో ఆదుకున్నాడు. వీలు చిక్కినప్పుడల్లా బౌండరీలు కొడుతూ.. స్కోరుబోర్డును ముందుకు నడిపించాడు. రసెల్ రనౌట్ అయ్యాక చేజ్ కు జత కలిసిన వికెట్ కీపర్ నికోలస్ పూరన్ (22 బంతుల్లో 40) ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆఖర్లో జేసన్ హోల్డర్ ( 5 బంతుల్లో 15 నాటౌట్) మెరుపులు మెరిపిండచంతో 20 ఓవర్లలో ఆ జట్టు 142 పరుగులు చేసింది. ఆఖరి ఓవర్లో హోల్డర్ రెండు సిక్సర్లు బాదగా.. మళ్లీ క్రీజులోకి వచ్చిన పొలార్డ్ చివరి బంతికి సిక్సర్ కొట్టాడు.

    ఇది కూడా చదవండి : ఈ వరల్డ్ కప్ లో రికార్డుల మొనగాళ్లు వీళ్లే..! సిక్సర్ల కింగ్ ఎవరంటే..

    బంగ్లా బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి విండీస్ ను అడ్డుకున్నారు. నాలుగు ఓవర్లు వేసిన టస్కిన్ అహ్మద్.. 17 పరుగులే ఇచ్చాడు. మెహది హసన్ (4-0-27-2), ఇస్లాం (4-0-20-2) పొదుపుగా బౌలింగ్ చేశారు. షకిబ్.. విండీస్ బ్యాటర్లను కట్టడి చేసినా వికెట్ దక్కించుకోలేకపోయాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bangladesh, Chris gayle, T20 World Cup 2021, West Indies

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు