హోమ్ /వార్తలు /క్రీడలు /

Team India New Jersey : టీమిండియా జెర్సీపై మూడు చుక్కలు.. వాటికి అర్థమెంటో తెలుసా..?

Team India New Jersey : టీమిండియా జెర్సీపై మూడు చుక్కలు.. వాటికి అర్థమెంటో తెలుసా..?

T-20 World Cup

T-20 World Cup

Team India New Jersey : భార‌త క్రికెట్ జ‌ట్టుకు అఫిషియ‌ల్ కిట్ స్పాన్స‌ర్‌ అయిన ఎంపీఎల్ స్పోర్ట్స్ నూతన జెర్సీని ఆవిష్కరించింది. న్యూ జెర్సీ డార్క్ బ్లూ కలర్ లో ఉంది. ఈ జెర్సీపైన చాలా ప్యాట్రన్స్ ఉన్నాయ్.

  త్వరలో ప్రారంభంకానున్న మెగా టోర్నీ టీ20 ప్రపంచక‌ప్‌ (T-20 World Cup 2021 News) లో టీమిండియా ఆట‌గాళ్లు కొత్త జెర్సీల్లో క‌నిపించ‌నున్నారు. లేటెస్ట్ గా బీసీసీఐ (BCCI) న్యూ జెర్సీని (BillionCheersJersey) విడుదల చేసింది. న్యూలుక్ లో టీమిండియా ఆటగాళ్లు (Team India Players) అదిరిపోయారు. భార‌త క్రికెట్ జ‌ట్టుకు అఫిషియ‌ల్ కిట్ స్పాన్స‌ర్‌ అయిన ఎంపీఎల్ స్పోర్ట్స్ నూతన జెర్సీని ఆవిష్కరించింది. న్యూ జెర్సీ డార్క్ బ్లూ కలర్ లో ఉంది. ఈ జెర్సీపైన చాలా ప్యాట్రన్స్ ఉన్నాయ్. ఈ ప్యాట్రన్స్ ను కోట్లాది మంది అభిమానుల వాయిస్ తో పోల్చింది బీసీసీఐ. బిలియన్ చీర్స్ జెర్సీని ఆవిష్కరిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను స్పూర్తిగా తీసుకొని ఈ జెర్సీని రూపొందించామని ఈ ట్వీట్‌కు క్యాప్షన్‌గా పేర్కొంది. మాములుగా భారత ఆటగాళ్లు ధరించే జెర్సీల కంటే ఈసారి కలర్ డోస్‌ను పెంచేశారు. మెన్‌ఇన్‌ బ్లూ కాస్త.. డార్క్ బ్లూ‌గా మారిపోయింది. నేవీ బ్లూ కలర్‌లో ఉన్న ఈ జెర్సీపై ముందుభాగంలో రాయల్‌ బ్లూ కలర్‌ షేడ్స్‌ కనిపిస్తున్నాయి.

  దీనిపై టీమిండియా కిట్ స్పాన్సర్స్‌ అయిన ఎమ్‌పీఎల్‌ స్పోర్ట్స్‌, బైజూస్‌ సంస్థల పేర్లు తెల్లని రంగులో కనిపిస్తున్నాయి. ఇక ఆరెంజ్ కలర్‌లో ఇండియా పేరు కనబడుతుంది. జెర్సీ ఎడమ భాగంలో బీసీసీఐ లోగోతో పాటు కొత్తగా మూడు చుక్కలు కనిపిస్తున్నాయి.

  అయితే ఈ మూడు చుక్కలు ఏంటనే సందేహం అభిమానులందరికి కలుగుతుంది. అయితే ఆ మూడుచుక్కులు టీమిండియా గెలిచిన మూడు ప్రపంచకప్‌లకు సంకేతంగా తెలుస్తోంది. దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారి 1983 ప్రపంచకప్ గెలుచుకున్న భారత్.. 24 ఏళ్ల తర్వా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. మరో నాలుగేళ్ల వ్యవధిలోనే మహీ సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్ గెలుపొందింది. ఈ మూడు విజయాలకు చిహ్నంగానే ఈ త్రీ స్టార్స్‌ను జెర్సీపై ఉంచారు.

  అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ ధనాధన్ టోర్నమెంట్‌ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్లు యుఏఈ చేరుకున్నాయి. ఇక, టీ20 ప్రపంచకప్‌ డ్రాలో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్.. (India Vs Pakistan) అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి.

  దాయాదీల పోరంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికనబరుస్తోంది. ఇరుదేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దీంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లుతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

  ఇది కూడా చదవండి :  వామ్మో.. బుమ్రాలో ఈ యాంగిల్ కూడా ఉందా.. హోటల్ రూంలో భార్య సంజనాతో సరసాలు..

   పాకిస్థాన్‌‌తో మ్యాచ్ అనంతరం అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న ఆఫ్గనిస్తాన్‌‌తో భారత్ ఆడనుంది. ఆ తర్వాత క్వాలిఫయర్‌లో గెలిచిన జట్లతో మరో రెండు మ్యాచులు కోహ్లీసేన తలపడనుంది. ఈ రెండు మ్యాచులు నవంబర్ 5, 8 తేదీల్లో జరగనున్నాయి. పాకిస్థాన్, న్యూజిలాండ్‌ జట్లను భారత్ ఓడిస్తే.. సునాయాసంగా తదుపరి రౌండ్ చేరుకుంటుంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Bcci, Cricket, Rohit sharma, T20 World Cup 2021, Team India, Virat kohli

  ఉత్తమ కథలు