స్క్విడ్ గేమ్( Squid Game ).. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తోందీ వెబ్‌సిరీస్. నెట్‌ఫ్లిక్స్‌లో ఉన్న ఈ కొరియన్ సిరీస్ ఆ ఓటీటీలో ఆల్‌టైమ్ హై వ్యూస్ సాధించిన వెబ్‌సిరీస్‌గా నిలిచింది. కాసుల వర్షం కురిపిస్తోంది. అయితే అందులోని డల్గోనా క్యాండీ చాలెంజ్‌ను ఇప్పుడు మన టీమిండియా ప్లేయర్స్ స్వీకరించారు. ఈ చాలెంజ్‌లో భాగంగా క్యాండీలో ఉన్న ఆకారాన్ని ఏమాత్రం దెబ్బతినకుండా బయటకు తీయాలి. అలా తీయలేకపోయిన వారిని నిర్దాక్షిణ్యంగా చంపేయడం ఈ వెబ్‌సిరీస్‌లో చూడొచ్చు. అలాంటి చాలెంజ్‌ను మన భారత క్రికెటర్లు సరదాగా తీసుకొని ఆడారు. రెండో టీ20 ప్రపంచకప్ (T20 World cup) వేటలో ఉన్న భారత ఆటగాళ్లు.. అందుకోసం గ్రౌండ్ లో చెమటోడ్చుతున్నారు.
ఇప్పటికే ఇంగ్లండ్ (England), ఆస్ట్రేలియా (Australia)తో జరిగిన రెండు వార్మప్ మ్యాచ్ లలో సత్తా చాటారు. ఈనెల 24న చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ (pakistan) తో తలపడటానికి రెడీ అయ్యారు. ఆటగాళ్లు తీరికలేని షెడ్యూల్ తో బిజీలో ఉన్నా.. ఐసీసీ (ICC) టీ20 ప్రపంచకప్ ప్రమోషన్స్ అదరగొడుతోంది.
ఇందులో భాగంగానే భారత ఆటగాళ్లతో స్క్విడ్ గేమ్ ఛాలెంజ్ (squid game challenge) ఆడించింది. ఈ ఛాలెంజ్ లో రోహిత్ శర్మ (Rohit Sharma), కేఎల్ రాహుల్ (KL rahul), సూర్య కుమార్ యాదవ్ (Surya Kumar Yadav), వరుణ్ చక్రవర్తి (Varun Chakravarthy), మహ్మద్ షమీ (Mohammed Shami), జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) లు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఐసీసీ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
View this post on Instagram
ఈ క్రేజీ ఛాలెంజ్ లో కేఎల్ రాహుల్, బుమ్రా, యాదవ్, వరుణ్ చక్రవర్తిలు విఫలమవ్వగా ఎంతో పేషెన్స్ తో ఆడిన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ, పేసర్ షమి లు విజయవంతమయ్యారు. పోస్టు కింద రోహిత్ శర్మ కామెంట్ కూడా చేశాడు. ప్లేయర్ నెంబర్ 45, ప్లేయర్ నెంబర్ 11 గెలిచారని రాసుకొచ్చాడు. ఆ రెండు జెర్సీలు రోహిత్, షమీ వే కావడం విశేషం. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది.
ఈ నెల 24న పాకిస్థాన్‌తో జరగబోయే తొలి మ్యాచ్‌లో టీమిండియా తలపడనున్న విషయం తెలిసిందే. రెండు వామప్ మ్యాచ్‌లలోనూ గెలిచి కోహ్లి సేన మాంచి ఊపు మీద కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ఎవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hardik Pandya, ICC, Jasprit Bumrah, KL Rahul, Mohammed Shami, Rohit sharma, T20 World Cup 2021, Team India, Viral Video