Viral Video : పోలా.. అదిరిపోలా.. ప్రపంచంలోనే ఎత్తైన బిల్డింగ్‌పై టీమిండియా న్యూ జెర్సీ వెలిగిపోలా..!

Photo Credit : twitter

Viral Video : లేటెస్ట్ గా బీసీసీఐ (BCCI) న్యూ జెర్సీని (BillionCheersJersey) విడుదల చేసింది. న్యూలుక్ లో టీమిండియా ఆటగాళ్లు (Team India Players) అదిరిపోయారు.

 • Share this:
  త్వరలో ప్రారంభంకానున్న మెగా టోర్నీ టీ20 ప్రపంచక‌ప్‌ (T-20 World Cup 2021 News) లో టీమిండియా ఆట‌గాళ్లు కొత్త జెర్సీల్లో క‌నిపించ‌నున్నారు. లేటెస్ట్ గా బీసీసీఐ (BCCI) న్యూ జెర్సీని (BillionCheersJersey) విడుదల చేసింది. న్యూలుక్ లో టీమిండియా ఆటగాళ్లు (Team India Players) అదిరిపోయారు. భార‌త క్రికెట్ జ‌ట్టుకు అఫిషియ‌ల్ కిట్ స్పాన్స‌ర్‌ అయిన ఎంపీఎల్ స్పోర్ట్స్ నూతన జెర్సీని ఆవిష్కరించింది. న్యూ జెర్సీ డార్క్ బ్లూ కలర్ లో ఉంది. ఈ జెర్సీపైన చాలా ప్యాట్రన్స్ ఉన్నాయ్. ఈ ప్యాట్రన్స్ ను కోట్లాది మంది అభిమానుల వాయిస్ తో పోల్చింది బీసీసీఐ. బిలియన్ చీర్స్ జెర్సీని ఆవిష్కరిస్తున్నామని, దేశవ్యాప్తంగా ఉన్న అభిమానులను స్పూర్తిగా తీసుకొని ఈ జెర్సీని రూపొందించామని ఈ ట్వీట్‌కు క్యాప్షన్‌గా పేర్కొంది. మాములుగా భారత ఆటగాళ్లు ధరించే జెర్సీల కంటే ఈసారి కలర్ డోస్‌ను పెంచేశారు. మెన్‌ఇన్‌ బ్లూ కాస్త.. డార్క్ బ్లూ‌గా మారిపోయింది. బీసీసీఐ పోస్ట్ చేసిన ట్వీటులో లోకేష్ రాహుల్, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ (Virat Kohli News), రవీంద్ర జడేజా మరియు జస్ప్రీత్ బుమ్రాలు కొత్త జెర్సీలను దరించి ఫొటోలకు పోజులిచ్చారు.

  అయితే టీ20 ప్రపంచకప్‌ 2021లో టీమిండియా ఆటగాళ్లు ధరించే జెర్సీ చిత్రాలను యూఏఈ అధికారులు ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బుర్జ్‌ ఖలీఫా (Burj Khalifa)పై ప్రదర్శించారు. జెర్సీ విడుదలకు సంబంధించిన వీడియోను కూడా ప్లే చేశారు. దీంతో అభిమానులు అందరూ ఒక్క్కసారిగా ఆశ్చర్యపోయారు. ముఖ్యంగా బుర్జ్‌ ఖలీఫాపై కోహ్లీ, రోహిత్, జడేజాల ఫొటోలు తళుక్కున మెరిసాయి. దీంతో భారత ఫాన్స్ ఆనందం వ్యక్తం చేశారు. ఇందుకు సంబందించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి.


  గతేడాది కూడా ఐపీఎల్ టైటిల్ గెలిచిన ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ చిత్రాన్ని బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించారు. ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన బిల్డింగ్‌ బూర్జ్ ఖలీఫాపై ఓ భారత క్రికెటర్ ఫొటో కనిపించడం అదే తొలిసారి. గతంలో మహాత్మా గాంధీ, షారుక్ ఖాన్‌ల ఫొటోలను బూర్జ్ ఖలీఫాపై ప్రదర్శించారు. ఐపీఎల్ 2021 సీజన్ ఆరంభంలో కోల్‌కతా నైట్ రైడర్స్ లోగో, ఆటగాళ్ల ఫొటోలను బూర్జ్ ఖలీపాపై ప్రదర్శించారు. ఇప్పుడు టీమిండియా ఆటగాళ్ల జెర్సీ చిత్రాలను ప్రదర్శించారు.
  క్రికెట్ అభిమానుల 'చీర్స్' ప్రేర‌ణ‌తో భారత జట్టు జెర్సీల‌ను రూపొందించిన‌ట్లు బీసీసీఐ తమ ట్విట్ట‌ర్‌లో వెల్ల‌డించింది. టీమిండియా జ‌ట్టుకు కిట్‌ స్పాన్స‌ర్‌గా ఎంపీఎల్ స్పోర్ట్స్‌ వ్య‌వ‌హ‌రిస్తోంది. ఈ జెర్సీలు కావాల‌నుకున్న‌వారు ఆన్‌లైన్‌లో ఆర్డ‌ర్ చేయ‌వ‌చ్చు. దీనిపై టీమిండియా కిట్ స్పాన్సర్స్‌ అయిన ఎమ్‌పీఎల్‌ స్పోర్ట్స్‌, బైజూస్‌ సంస్థల పేర్లు తెల్లని రంగులో కనిపిస్తున్నాయి. ఇక ఆరెంజ్ కలర్‌లో ఇండియా పేరు కనబడుతుంది. జెర్సీ ఎడమ భాగంలో బీసీసీఐ లోగోతో పాటు కొత్తగా మూడు చుక్కలు కనిపిస్తున్నాయి.

  ఇది కూడా చదవండి : దేవుడా.. మాకే ఎందుకిలా జరుగుతోంది..! ఓటమి తట్టుకోలేక ఏడ్చేసిన పంత్, పృథ్వీ షా..

  అయితే ఈ మూడు చుక్కలు ఏంటనే సందేహం అభిమానులందరికి కలుగుతుంది. అయితే ఆ మూడుచుక్కులు టీమిండియా గెలిచిన మూడు ప్రపంచకప్‌లకు సంకేతంగా తెలుస్తోంది. దిగ్గజ కెప్టెన్ కపిల్ దేవ్ సారథ్యంలో తొలిసారి 1983 ప్రపంచకప్ గెలుచుకున్న భారత్.. 24 ఏళ్ల తర్వా మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో అరంగేట్ర టీ20 ప్రపంచకప్‌ను కైవసం చేసుకుంది. మరో నాలుగేళ్ల వ్యవధిలోనే మహీ సారథ్యంలో 2011 వన్డే ప్రపంచకప్ గెలుపొందింది. ఈ మూడు విజయాలకు చిహ్నంగానే ఈ త్రీ స్టార్స్‌ను జెర్సీపై ఉంచారు.
  Published by:Sridhar Reddy
  First published: