T-20 World Cup 2021 : మహాసంగ్రామానికి కోహ్లీసేన రెడీ..! టీమిండియా షెడ్యూల్, బలగం లాంటి పూర్తి వివరాలు మీ కోసం..

Team India

T-20 World Cup 2021 : రెండంచెల్లో పోటీలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 16 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే ఎనిమిది జట్లు సూపర్‌-12కు నేరుగా అర్హత సాధించాయి.

  • Share this:
    క్రికెట్‌ లవర్స్ కు అలరించడానికి మరో మహా సంగ్రామం రెడీ అయింది. . యూఏఈ వేదికగా అక్టోబర్ 17 నుంచి టీ20 ప్రపంచకప్‌(T20 World Cup 2021) ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచ్‌లు.. జరుగుతుండగా నేటి నుంచి క్వాలిఫై మ్యాచులు ప్రారంభం కానున్నాయ్. రెండంచెల్లో పోటీలు జరగనుండగా.. గతంలో ఎన్నడూ లేనివిధంగా మొత్తం 16 జట్లు ఈసారి బరిలోకి దిగనున్నాయి. ఇప్పటికే ఎనిమిది జట్లు సూపర్‌-12కు నేరుగా అర్హత సాధించాయి. ఇందులో.. భారత్‌(T20 world cup india team), ఇంగ్లాండ్ (England), ఆస్ట్రేలియా (Australia), దక్షిణాఫ్రికా (South Africa), వెస్టిండీస్ (West Indies), పాకిస్థాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘానిస్థాన్ ఉన్నాయి. మరో ఎనిమిది జట్లు శ్రీలంక, బంగ్లాదేశ్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, నమీబియా, స్కాట్లాండ్, పాపువా న్యూ గినియా, ఒమన్ క్వాలిఫయర్‌ మ్యాచ్‌లు ఆడనున్నాయి. ఇందులో అర్హత సాధించిన నాలుగు జట్లు సూపర్‌ 12లోకి ప్రవేశిస్తాయి. అప్పుడు అసలైన సమరం ప్రారంభమవుతుంది.

    ఇక, టీ20 వరల్డ్ కప్‌లో తొలి మ్యాచ్‌లో టీమిండియా(India T20 World Cup Squad).. పాకిస్తాన్‌తో తలపడనుంది. అక్టోబర్ 24న దుబాయ్ వేదికగా ఈ మ్యాచ్ జరుగుతంది. ఆ తర్వాత అక్టోబర్ 31న న్యూజిలాండ్‌తో, నవంబర్ 3న అఫ్గానిస్తాన్‌తో, నవంబర్ 5న రౌండ్‌ 1లో గ్రూప్ బిలో టాప్-2గా నిలిచిన జట్టుతో, నవంబర్ 8న రౌండ్‌ 1లో గ్రూప్ ఏలో టాప్-2గా నిలిచిన జట్టుతో భారత్ తలపడనుంది.

    టీమిండియా షెడ్యూల్ :



























































    మ్యాచ్ నెం డేట్ మ్యాచ్ టైం వెన్యూ స్టేజ్
    1 అక్టోబర్ 24 ఇండియా Vs పాకిస్థాన్ 19.30 దుబాయ్ సూపర్ -12
    2 అక్టోబర్ 31 ఇండియా Vs న్యూజీలాండ్ 19.30 దుబాయ్ సూపర్ -12
    3 నవంబర్ 3 ఇండియా Vs అఫ్గానిస్తాన్ 19.30 అబుదాబి సూపర్ -12
    4 నవంబర్ 5 ఇండియా Vs బీ2 19.30 దుబాయ్ సూపర్ -12
    5 నవంబర్ 8 ఇండియా Vs ఏ2 19.30 దుబాయ్ సూపర్ -12
    మ్యాచ్ లన్నీ భారత కాలమానం ప్రకారం సా. 7.30 గంటలకు

    టీమిండియా పూర్తి జట్టు :

    విరాట్‌ కోహ్లి(కెప్టెన్‌), రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌, సూర్యకుమార్‌ యాదవ్‌, రిషభ్‌ పంత్‌(వికెట్‌ కీపర్‌), ఇషాన్‌ కిషన్‌(వికెట్‌ కీపర్‌), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్‌ చహర్‌, రవిచంద్రన్‌ అశ్విన్‌, శార్దూల్‌ ఠాకూర్‌, వరుణ్‌ చక్రవర్తి, జస్‌ప్రీత్‌ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌, మహ్మద్‌ షమీ.

    రిజర్వు ప్లేయర్లు: శ్రేయస్‌ అయ్యర్‌, దీపక్‌ చహర్‌, అక్షర్‌ పటేల్‌.

    మెంటార్‌: ఎంఎస్‌ ధోని

    టీమిండియా కోచ్ : రవిశాస్త్రి

    ఇది కూడా చదవండి : కోహ్లీని సంప్రదించకుండానే బీసీసీఐ కీలక నిర్ణయం..! విరాట్ దూకుడుకు కళ్లెం వేశారా..?

    భారత కాలమానం ప్రకారం మ్యాచ్ టైమింగ్స్..

    భారత్ కాలమాన ప్రకారం టీమిండియా మ్యాచ్‌లన్నీ కూడా రాత్రి 7.30 గంటలకు ప్రసారమవుతాయి. అయితే టీ20 ప్రపంచ కప్‌(T20 World Cup) లో ఇప్పటివరకు భారత్, పాకిస్తాన్ జట్లు 5 సార్లు తలపడ్డాయి. ప్రతీసారి టీమిండియానే పైచేయి సాధించింది. ఇందులో కూడా 4 సార్లు గ్రూప్ దశలోనే తలపడ్డారు.
    Published by:Sridhar Reddy
    First published: