T 20 WORLD CUP 2021 TEAM INDIA FORMER CRICKETER AJAY JADEJA QUESTIONS BCCI WHAT WAS THE NEED OF DHONI AS MENTOR SRD
MS Dhoni : " ధోనీకి నేను పెద్ద ఫ్యాన్.. కానీ, మెంటార్ గా అతడు అవసరమా..?" .. జడేజా సంచలన వ్యాఖ్యలు..
(ధోని, కోహ్లీ)
MS Dhoni : గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీ.. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు మెంటార్‌గా పనిచేయనున్నాడు. ఐసీసీ ఈవెంట్స్‌లో కెప్టెన్‌గా ధోనీకి మంచి రికార్డు ఉండటంతోనే జట్టు మార్గదర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.
ఐసీసీ టీ20 ప్రపంచకప్ (T20 world cup 2021 Latest Telugu News) బరిలోకి దిగే భారత జట్టు కోసం ఎదురుచూసిన అభిమానులకు, విశ్లేకులకు బీసీసీఐ ఊహకందని ఆనందాన్ని కలిగించింది. వరల్డ్‌కప్ (T-20 World Cup 2021) విజయం సాధించడమే లక్ష్యంగా టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ(Mahendra Singh Dhoni)ని జట్టులోకి తీసుకుని అందరినీ సర్ప్రైజ్ చేసింది. గతేడాదే అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన మహీ.. ఈ మెగా టోర్నీలో భారత జట్టుకు మెంటార్‌గా పనిచేయనున్నాడు. ఐసీసీ ఈవెంట్స్‌లో కెప్టెన్‌గా ధోనీకి మంచి రికార్డు ఉండటంతోనే జట్టు మార్గదర్శకుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయాన్ని కొందరు స్వాగతిస్తుండగా.. మరికొందరూ తప్పబడుతున్నారు. లేటెస్ట్ గా భారత మాజీ క్రికెటర్ అజేయ్ జడేజా టీమిండియా మెంటార్‌గా మహేంద్ర సింగ్ ధోనీని నియమించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించాడు.
కెప్టెన్ విరాట్ కోహ్లీ, కోచ్ రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా అద్భుత ప్రదర్శన చేస్తుంటే మెంటార్ అవసరమే లేదని సోనీ టీవీ కార్యక్రమంలో మాట్లాడుతూ జడేజా అభిప్రాయపడ్డాడు.
" మెంటార్‌గా ధోనీని నియమించడం వెనుక ఉద్దేశం ఏంటో నాకు అస్సలు అర్థం కావడంలేదు. నేను ధోనీ గురించి.. ఆటపై అతడికి ఉన్న అవగాహన, జట్టుకు అతను ఎలా ఉపయోగపడతాడు.. లాంటి విషయాల గురించి మాట్లాడటం లేదు. కెప్టెన్‌గా వైదొలగడానికి ముందే విరాట్ కోహ్లీకి అతను మెంటార్‌గా ఉన్నాడు.ధోనీకి నాకన్న పెద్ద ఫ్యాన్ లేడు. వీడ్కోలుకు ముందే కెప్టెన్‌ను తయారు చేసిన తొలి సారథి మహీ. కానీ, అతన్ని మెంటార్‌గా తీసుకోవడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఈ నిర్ణయం రవీంద్ర జడేజాకు బదులు అజింక్యా రహానేను ఆడించినట్లుంది"అని అజేయ్ జడేజా చెప్పుకొచ్చాడు.
అజయ్ జడేజా (ఫైల్ ఫోటో)
విరాట్ కోహ్లీ, రవిశాస్త్రి నేతృత్వంలో టీమిండియా బాగా ఆడుతోందని, జట్టుకు మెంటార్ అవసరం లేదనేది తన అభిప్రాయమని జడేజా తెలిపాడు. బహుశా కెప్టెన్ విరాట్ కోహ్లీపై ఒత్తిడి తగ్గించేందుకే ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చని జడేజా అభిప్రాయపడ్డాడు. ‘భారత క్రికెట్ భిన్నంగా పనిచేస్తుంది. ధోనీ స్పిన్నర్లను ఎక్కువగా ఆడిస్తే.. ఇంగ్లండ్‌లో కోహ్లీ నలుగురు పేసర్లను తీసుకున్నాడు. ఒకరు ఒకలా ఆలోచిస్తే, ఇంకొకరు మరోలా ఆలోచిస్తారు. ఈ రెండు ఆలోచనల కలయిక కోసమే బహుషా ఈ నిర్ణయం తీసుకున్నారేమో.
తన తొలి ఐసీసీ ట్రోఫీ కోసం ప్రయత్నిస్తున్న కోహ్లీపై ఒత్తిడి తగ్గించేందుకు బీసీసీఐ ధోనిని నియమించి ఉండొచ్చు. కోహ్లీ తన అత్యుత్తమ ఫామ్‌లో లేనందు వల్ల ఈ నిర్ణయంతో అతని బ్యాటింగ్‌పై దృష్టి పెట్టేందుకు ఈ నిర్ణయం తీసుకొని ఉండవచ్చు.'అని జడేజా తెలిపాడు. ఇక ధోనీని మెంటార్‌గా నియమించడంపై పెద్ద రచ్చ నడుస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నియామకంతో ధోనీకి పరస్పర విరుద్ధ ప్రయోజనాల సెగ తగిలింది.
Published by:Sridhar Reddy
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.