హోమ్ /వార్తలు /క్రీడలు /

T-20 World Cup : జట్టులోకి CSK స్టార్ ప్లేయర్.. భారత కొత్త జట్టు ఇదే..! ఆ ఆటగాడికి మరోసారి నిరాశే..

T-20 World Cup : జట్టులోకి CSK స్టార్ ప్లేయర్.. భారత కొత్త జట్టు ఇదే..! ఆ ఆటగాడికి మరోసారి నిరాశే..

T-20 World Cup

T-20 World Cup

T-20 World Cup : పురుషుల టీ20 వరల్డ్ కప్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను ఐసీసీకి పంపించాయి.

  ఐపీఎల్ 2021 (IPL 2021 Season Latest News) సీజన్ మరో రెండు రోజుల్లో యుగియనుంది. దీంతో అందరి దృష్టి టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup) పై పడింది. పురుషుల టీ20 వరల్డ్ కప్ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. ఇప్పటికే అన్ని దేశాల క్రికెట్ బోర్డులు తమ జట్ల వివరాలను ఐసీసీకి పంపించాయి.అయితే, తుది జట్టులో మార్పుల కోసం అక్టోబర్ 10 వరకు సమయం ఇచ్చింది. ఆ తర్వాత బీసీసీఐ అభ్యర్ధనతో మరో వారం రోజుల డెడ్ లైన్ విధించింది ఐసీసీ. దీంతో, లేటెస్ట్ గా బీసీసీఐ టీమ్ ఇండియాలో కీలక మార్పు చేసింది. ముందుగా ప్రకటించిన జట్టులో అక్షర్ పటేల్ కి బదులుగా శార్దూల్ ఠాకూర్ ను టీమ్ లోకి తీసుకుంది. ఇక, అక్షర్ పటేల్ ను స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేసింది. ముందుగా శార్దూల్ ఠాకూర్ ను స్టాండ్ బై ప్లేయర్ గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. అయితే, శార్దూల్ ఠాకూర్ ఐపీఎల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున సత్తా చాటిన సంగతి తెలిసిందే. మరోవైపు, అతని బ్యాటింగ్ కూడా టీమ్ కు ప్లస్ పాయింట్ కానుంది. దీంతో అతన్ని నేరుగా జట్టులోకి తీసుకున్నారు. ఇక, స్పిన్నర్ యుజువేంద్ర చాహాల్ కు మరోసారి నిరాశ ఎదురైంది. అతని కచ్చితంగా జట్టులో చోటు దక్కుతుందని అందరూ భావించారు.

  మార్పులు చేసిన తర్వాత టీమిండియా జట్టు : విరాట్ కోహ్లీ (captain), రోహిత్ శర్మ (vice-captain), కేఎల్ రాహుల్, సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ (wicket-keeper), ఇషాన్ కిషన్ , హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, రాహుల్ చాహర్, రవిచంద్రన్ అశ్విన్, శార్దూల్ ఠాకూర్, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమీ

  Stand-by players: శ్రేయస్ అయ్యర్, దీపక్ చాహర్, అక్షర్ పటేల్

  ఇక, వీరితో పాటు.. టీమిండియాకు ప్రాక్టీస్ సహాయపడటానికి మరి కొంత మంది క్రికెటర్లును బయోబబుల్ లోకి పంపనుంది బీసీసీఐ. వారిలో అవేశ్ ఖాన్, ఉమ్రన్ మాలిక్, హర్షల్ పటేల్, లుక్మన్ మరివాలా, వెంకటేశ్ అయ్యర్, కర్ణ్ శర్మ, షాబాజ్ అహ్మద్, క్రిష్టప్ప గౌతమ్ వంటి యంగ్ క్రికెటెర్లు ఉన్నారు.

  అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ ధనాధన్ టోర్నమెంట్‌ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్లు యుఏఈ చేరుకున్నాయి. ఇక, టీ20 ప్రపంచకప్‌ డ్రాలో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్.. (India Vs Pakistan) అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి.

  దాయాదీల పోరంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికనబరుస్తోంది. ఇరుదేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దీంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లుతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

  ఇది కూడా చదవండి : టీ20 ప్రపంచకప్‌కు ముందు రోహిత్ శర్మ అరుదైన రికార్డు.. ధోనీ, కోహ్లీల వల్ల కూడా కాలేదు..!

  ఇక, అదే సమయంలో భారత జట్టు (Team India) రెండు వార్మప్ మ్యాచ్‌లు (Warmup Matches) కూడా ఆడనున్నది. గతంలో తొలి వార్మప్ ఆస్ట్రేలియాతో, రెండో వార్మప్ ఇంగ్లాండ్‌తో ఆడాలని నిర్ణయించారు. కానీ తాజాగా ఐసీసీ (ICC) ఈ మ్యాచ్‌లలో మార్పులు చేసింది. ఇంగ్లాండ్ జట్టుతో జరగాల్సిన వార్మప్ మ్యాచ్‌ను రద్దు చేసింది.

  ఇది కూడా చదవండి : స్మృతి మంధానకు గోల్డెన్ ఛాన్స్.. త్వరలోనే కొత్త బాధ్యతలు..!

  కొత్త షెడ్యూల్ (New Schedule) ప్రకారం భారత జట్టు అక్టోబర్ 18న ఆస్ట్రేలియాతో, 20న దక్షిణాఫ్రికాతో వార్మప్ మ్యాచ్‌లు ఆడనున్నది. ఈ రెండు మ్యాచ్‌లు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరగాల్సి ఉండగా వేదికలో కూడా మార్పు చేసింది. ఈ రెండు మ్యాచ్‌లు రాత్రి 7.30 గంటలకు దుబాయ్‌లోని ఐసీసీ అకాడమీ గ్రౌండ్‌లో ఆడనుంది.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Bcci, Chennai Super Kings, T20 World Cup 2021, Team India, Virat kohli

  ఉత్తమ కథలు