India Vs Pakistan : " కచ్చితంగా మాదే గెలుపు " .. విజయంపై పాక్ కెప్టెన్ ధీమా..! రికార్డులు మర్చినట్టున్నాడు..!

Pakistan cricket (Twitter)

India Vs Pakistan : ఇరుదేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దీంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లుతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

 • Share this:
  ఐపీఎల్ 2021 సీజన్ (IPL 2021 Season Latest News) చివరి అంకానికి చేరుకుంది. ఇక, ఐపీఎల్ తర్వాత అలరించడానికి టీ-20 ప్రపంచకప్ టోర్నీ (T-20 World Cup 2021) రెడీ అవుతోంది. ఈ మెగా టోర్నీపైన రోజు రోజుకు అభిమానుల్లో ఉత్సుకత పెరుగుతోంది. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ ధనాధన్ టోర్నమెంట్‌ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్లు యుఏఈ చేరుకున్నాయి. ఇక, టీ20 ప్రపంచకప్‌ డ్రాలో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్.. (India Vs Pakistan) అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. దాయాదీల పోరంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికనబరుస్తోంది. ఇరుదేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దీంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లుతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు.

  ఈ మెగా ఫైట్ పై పాకిస్తాన్‌ కెప్టెన్‌ బాబర్‌ అజామ్‌ (Pakistan Skipper Babar Azam) కీలక వాఖ్యలు చేశాడు. టీమిండియాపై విజయం సాధించి టి20 ప్రపంచ్‌ కప్‌లో శుభారంభం చేయనున్నట్లు అజమ్‌ తెలిపాడు. ఇటీవల కాలంలో యుఏఈలో అనేక మ్యాచ్‌లు ఆడిన అనుభవం తమకు కావలసిన ప్రయోజనాన్ని అందిస్తుందని బాబర్‌ అజమ్ అభిప్రాయపడ్డాడు.

  "ప్రతి మ్యాచ్‌ ఒత్తిడి మాకు తెలుసు. ముఖ్యంగా మొదటి మ్యాచ్‌ ఇది. మేము మ్యాచ్ గెలిచి ముందుకు వెళ్తాము. మేము గత 3-4 సంవత్సరాలుగా యుఏఈలో క్రికెట్ ఆడుతున్నాం. మాకు అక్కడి పరిస్థితులపై పూర్తి అవగాహన ఉంది. వికెట్ ఎలా ఉంటుందో.. దానికి తగ్గట్టు ఏ బ్యాటర్‌ని ఏ స్ధానంలో పంపాలనేదానిపై ఒక అంచనా ఉంది. ఎవరైతే బాగా ఆడుతారో, వారే మ్యాచ్‌లో గెలుస్తారు. మీరు నన్ను అడిగారు.. కచ్చితంగా మేమే గెలుస్తాము " అని బాబర్‌ ఓ పాక్‌ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపాడు.

  "ఒక జట్టుగా మా విశ్వాసం, ధైర్యం చాలా ఎక్కువ. మేము గతం గురించి కాదు.. భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్నాము. మేము భారత్‌పై విజయం కోసం సిద్ధమవుతున్నాము. భారత్‌తో బాగా ఆడతామని నాకు పూర్తి నమ్మకం ఉంది " అని బాబర్ తెలిపాడు.

  ఇది కూడా చదవండి : కోల్‌కతా రాత మార్చిన మొనగాడు అతడు..! అందుకే టీ20 వరల్డ్ కప్ కోసం పిలుపు..

  పాక్ క్రికెటర్లలో దాదాపు ఏడుగురు సీనియర్ ప్లేయర్లున్నారని, వారి అనుభవం జట్టకు ఎంతో ఉపయోగపడుతుందని అజామ్ అన్నాడు. అంతేగాక ఆసీస్ మాజీ ఓపెనర్ మాథ్యూ హెడెన్, సౌతాఫ్రికా స్పీడ్ బౌలర్ ఫిలాండర్ సేవలు జట్టుకు ఎంతగానో ఉపయోగపడుతాయని చెప్పాడు.

  ఇది కూడా చదవండి : జట్టులోకి CSK స్టార్ ప్లేయర్.. భారత కొత్త జట్టు ఇదే..! ఆ ఆటగాడికి మరోసారి నిరాశే..

  అయితే, పాకిస్తాన్‌ ఇప్పటి వరకు వన్డే, టి20 ప్రపంచకప్‌లలో భారత్‌పై ఒక్క విజయాన్ని కూడా నమోదు చేయలేదు.ఇక, వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియాకు పాకిస్ధాన్ మీద అజేయ రికార్డు ఉంది. 12-0 తేడాతో భారత్ పాకిస్థాన్ కు అందనంత ఎత్తులో ఉంది.
  Published by:Sridhar Reddy
  First published: