T-20 World Cup 2021 : ఒకే బంతికి మూడు సార్లు రనౌట్ మిస్.. ఆ బ్యాటర్ భారతీయుడే..! వైరలవుతున్న వీడియో..

Photo Credit : ICC

T-20 World Cup 2021 : అయితే ఒకే బంతికి బ్యాటర్ మూడు సార్లు రనౌట్ నుంచి తప్పించుకోవడం చూశారా..? బహుశా ఇప్పటివరకు ఈ సంఘటనను ఎప్పుడూ చూసి ఉండరు. ఇలాంటిదే ఫస్ట్ టైమ్ టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) లో నమీబియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ లో చోటు చేసుకుంది.

 • Share this:
  అప్పుడప్పుడూ క్రికెట్‌ (Cricket) లో ఫన్నీ మూమెంట్స్ జరుగుతుంటాయి. ఫీల్డర్స్ మెరుపు విన్యాసాలు కావొచ్చు. వికెట్ కీపర్ల నైపుణ్యాలు కావచ్చు.. బ్యాటర్ల అద్భుతమైన షాట్స్ కావొచ్చు.. ఇలా ఎన్నో జరుగుతాయి. అయితే ఒకే బంతికి బ్యాటర్ మూడు సార్లు రనౌట్ నుంచి తప్పించుకోవడం చూశారా..? బహుశా ఇప్పటివరకు ఈ సంఘటనను ఎప్పుడూ చూసి ఉండరు. ఇలాంటిదే ఫస్ట్ టైమ్ టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) లో నమీబియా వర్సెస్ ఐర్లాండ్ మ్యాచ్ లో చోటు చేసుకుంది. ఐర్లాండ్ టీమ్ లో భారత ప్లేయర్ సిమీ సింగ్ (Simi Singh) ఆడుతున్న సంగతి తెలిసిందే. ఐర్లాండ్ బ్యాటింగ్ సమయంలో సిమీ సింగ్ లాస్ట్ ఓవర్ ఆఖరి బంతిని ఫేస్ చేశాడు. అయితే, ఈ బంతిని స్కూప్ చేయబోయాడు సిమీ. అయితే, ఆ బంతి ఎడ్జ్ కు తాకి బౌలర్ వైపు వెళ్లింది. బౌలర్ డేవిడ్ వీస్ ఆ బంతి స్టంప్స్ కి డైరక్ట్ త్రో చేశాడు. కానీ అది మిస్ అయింది. దీంతో బ్యాటర్లు మరో పరుగు తీశారు. రెండో పరగుకు ప్రయత్నించినప్పుడు ఫీల్డర్ ఆ బంతిని కీపర్ కు అందించాడు. కీపర్ అక్కడ రనౌట్ మిస్ చేశాడు. ఆ తర్వాత నాన్ స్ట్రైక్ ఎండ్ వైపు వేసిన త్రో కూడా మిస్ అయింది. ఇలా ఒక బంతికి మూడు సార్లు రనౌట్ నుంచి తప్పించుకున్నాడు సిమీ సింగ్. సింగిల్ రాని చోట మూడు పరుగులు సమర్పించింది నమీబియా. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో వైరల్ గా మారింది. ఈ రనౌట్ నెటిజన్లు రకరకాల ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు.

  ఇక, ఈ మ్యాచ్ లో నమీబియా క్రికెట్ జట్టు జట్టు చరిత్ర సృష్టించింది. టీ20 ప్రపంచకప్‌లో తొలిసారి పోటీపడ్డ ఆ జట్టు.. సూపర్-12 రౌండ్‌కు కూడా అర్హత సాధించింది. తొలి రౌండ్ గ్రూప్‌-ఎలో భాగంగా శుక్రవారం జరిగిన లోస్కోరింగ్ మ్యాచ్‌లో నబీబియా 8 వికెట్ల తేడాతో ఐర్లాండ్‌పై ఉత్కంఠ విజయం సాధించింది.

  ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఐర్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 128 పరుగులు చేసింది. ఓపెనర్లు స్టిర్లింగ్(38), కెవిన్ ఒబ్రెయిన్(25) టాప్ స్కోరర్లుగా నిలిచారు. నమీబియా బౌలర్లలో జాన్ ఫ్రీలింగ్(3/21), వీస్(2/22) ప్రత్యర్థిని కట్టడి చేశారు. అనంతరం కెప్టెన్ గెరార్ట్ ఎరాస్కన్(53 నాటౌట్), డేవిడ్ వీస్(28 నాటౌట్) పోరాటంతో నమీబియా 18.3 ఓవర్లలో 2 వికెట్లకు 126 పరుగులు చేసి సునాయస విజయాన్నందుకుంది.
  View this post on Instagram


  A post shared by ICC (@icc)

  ఇక 2019లో టీ20ల్లోకి అరంగేట్రం చేసిన నమీబియా.. 25 మ్యాచ్‌ల అనంతరమే టీ20 ప్రపంచకప్ సూపర్-12కు అర్హత సాధించడం ఓ రికార్డు గా చెప్పుకోవచ్చు. 1993లో ఐసీసీలో అసోసియేట్‌ మెంబర్‌గా సభ్యత్వం పొందిన నమీబియా తొలిసారి 2003 ప్రపంచకప్‌లో పాల్గొంది. ఆ టోర్నీలో నమీబియాతో భారత్ తలపడగా.. సచిన్, గంగూలీ సెంచరీలతో చెలరేగారు.

  గ్రూప్-ఎ నుంచి ఇప్పటికే సూపర్-12కు అర్హత సాధించిన శ్రీలంక తమ ఆఖరి మ్యాచ్‌లో 8 వికెట్ల తేడాతో నెదర్లాండ్స్‌ను చిత్తు చేసి హ్యాట్రిక్ విక్టరీతో గ్రూప్ టాపర్‌గా ముందంజ వేసింది. లంక బౌలర్ల దెబ్బకు నెదర్లాండ్స్ 10 ఓవర్లలో 44 రన్స్‌కే కుప్పకూలింది. వానిందుహసరంగ(3/9), లాహిరు కుమార(3/7), మహేశ్ తీక్షణ(2/3) చెలరేగారు.

  ఇది కూడా చదవండి : సూపర్ -12 స్టేజ్ ముందు శ్రీలంకకు భారీ షాక్.. కొంపముంచిన బయోబబుల్ ..!

  అనంతరం లంక 7.1 ఓవర్లలో రెండు వికెట్లకు 45 రన్స్ చేసి సులువుగా గెలుపొందింది. గ్రూప్-ఏలో టాపర్‌గా లంక సూపర్ 12లో ఆసీస్, ఇంగ్లండ్ ఉన్న గ్రూప్-1కు చేరింది. రెండో ప్లేస్‌తో నమీబియా.. భారత్, న్యూజిలాండ్, పాకిస్థాన్‌తో కూడిన గ్రూప్-2లోకి వచ్చింది.
  Published by:Sridhar Reddy
  First published: