Ind Vs Pak : ప్రాక్టీస్ మ్యాచ్ లతో క్లారీటి..! పాక్ తో తలపడే భారత తుది జట్టు ఇదే.. ఆ ఇద్దరు ఔట్..!

Team India

Ind Vs Pak : నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం.. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం.. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరులోనే చూస్తాం. అలాంటి బ్లాక్ బస్టర్ పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

  • Share this:
    ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup) మొదలైంది. క్వాలిఫైయర్స్, ప్రాక్టీస్ మ్యాచ్ లతో అభిమానులకు బోలెడంత కిక్ ఇస్తోంది. ఇక, అక్టోబ‌ర్ 23న అసలు సమరం.. సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. ఇక అక్టోబర్ 24న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ (India Vs Pakistan) తలపడనున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. దీంతో, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ధనా ధన్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇక, దాయాది దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల ఎఫెక్ట్ తో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయ్. ఇక టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్‌ నాలుగు గెలుపొందింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.

    ఇక, టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 స్టేజిలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 దశలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ సహా క్వాలిఫైయర్ ద్వారా అర్హత సాధించిన మరో రెండు జట్లు ఉంటాయి. సూపర్ 12 స్టేజ్ అక్టోబర్ 23న ఆరంభం కానుండగా.. టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఇప్పటికే అర్హత సాధించిన జట్లు ఆలోగా ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నాయి. ఇక, హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. దాయాది పాకిస్థాన్ తో తలపడే భారత తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.

    ఓపెనర్లుగా రోహిత్ శర్మ (Rohit Sharma), లోకేష్ రాహుల్ (Kl Rahul) బరిలోకి దిగనున్నారు. ప్రాక్టీస్ మ్యాచ్ ల్లో వీరిద్దరూ అదరగొట్టిన సంగతి తెలిసిందే. విరాట్‌ కోహ్లీ మూడు, సూర్యకుమార్ యాదవ్‌ నాలుగు, రిషబ్ పంత్‌ ఐదో స్థానంలో బ్యాటింగ్‌కు దిగుతారు. ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా బౌలింగ్‌ చేయకున్నా.. ఫినిషర్‌ అవసరం ఉంది కాబట్టి ఆరో స్థానంలో అతన్ని దించే అవకాశం ఉంది.

    ఇది కూడా చదవండి : ఐపీఎల్ పై కన్నేసిన వరల్డ్ నెం.1 ఫుట్ బాల్ క్లబ్ .. కొత్త జట్ల కోసం ఇంత పోటీనా..?

    రవీంద్ర జడేజా ఆల్ రౌండర్ గా జట్టులో చోటు దక్కించుకోనున్నాడు. ఇక, టీమిండియా బౌలర్లుగా మహ్మద్ షమీ, జస్ప్రీత్ బుమ్రా స్ధానాలు ఖాయం. ఇక, మూడో పేసర్ గా శార్దూల్ ఠాకూర్, భువనేశ్వర కుమార్ ల్లో ఒకరికి చోటు దక్కవచ్చు. ఫామ్ ప్రకారం చూస్తే శార్దూల్ ఠాకూర్ కే ఎక్కువ అవకాశాలు ఉన్నాయ్. ఇక, రెండో స్పిన్నర్ స్ధానం కోసం రవిచంద్రన్ అశ్విన్, వరుణ్ చక్రవర్తి, రాహుల్ చాహర్ లు పోటీపడుతున్నారు. సీనియర్ స్పిన్నర్ గా రవిచంద్రన్ అశ్విన్ తుది జట్టులో చోటు దక్కించుకోవచ్చు.

    తుది జట్టు అంచనా :

    రోహిత్‌ శర్మ, కేఎల్ రాహుల్‌, విరాట్‌ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్‌, రిషబ్ పంత్‌ (కీపర్), హార్దిక్‌ పాండ్యా, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్/ వరుణ్ చక్రవర్తి, మహమ్మద్‌ షమీ, జస్ప్రీత్ బుమ్రా, భువనేశ్వర్‌ కుమార్‌/శార్దూల్ ఠాకూర్‌.
    Published by:Sridhar Reddy
    First published: