India vs Pakistan : పాక్ జట్టును టీజ్ చేస్తోన్న మౌకా మౌకా యాడ్..! భారత్ ఫ్యాన్స్ కు పండుగే..

Photo Credit : Twitter

India vs Pakistan : అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ ధనాధన్ టోర్నమెంట్‌ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్లు యుఏఈ చేరుకున్నాయి. ఇక, టీ20 ప్రపంచకప్‌ డ్రాలో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్.. (India Vs Pakistan) అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి.

 • Share this:
  ఐపీఎల్ 2021 సీజన్ (IPL 2021 Season Latest News) చివరి అంకానికి చేరుకుంది. ఇక, ఐపీఎల్ తర్వాత అలరించడానికి టీ-20 ప్రపంచకప్ టోర్నీ (T-20 World Cup 2021) రెడీ అవుతోంది. ఈ మెగా టోర్నీపైన రోజు రోజుకు అభిమానుల్లో ఉత్సుకత పెరుగుతోంది. అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న ఈ ధనాధన్ టోర్నమెంట్‌ కోసం ఇప్పటికే కొన్ని దేశాల జట్లు యుఏఈ చేరుకున్నాయి. ఇక, టీ20 ప్రపంచకప్‌ డ్రాలో ఒకే గ్రూప్‌లో ఉన్న భారత్, పాకిస్థాన్.. (India Vs Pakistan) అక్టోబర్ 24న తమ తొలి మ్యాచ్ ఆడనున్నాయి. దాయాదీల పోరంటే యావత్ క్రికెట్ ప్రపంచం ఆసక్తికనబరుస్తోంది. ఇరుదేశాల మధ్య గత కొన్నేళ్లుగా ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతినడంతో కేవలం ఐసీసీ టోర్నీల్లోనే తలపడుతున్నాయి. దీంతో ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం వెయ్యి కళ్లుతో ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. ఇంత వ‌ర‌కూ వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండియాపై గెల‌వ‌ని పాకిస్థాన్ ఈసారి ఎన్నో ఆశ‌ల‌తో బ‌రిలోకి దిగుతోంది. ఆ టీమ్ వెంట ప‌టాకులు ప‌ట్టుకొని ఆ అభిమాని కూడా వ‌చ్చేశాడు. ఈసారి దుబాయ్‌లో గెలుపు ప‌క్కా.. అక్క‌డ ప‌టాకులు కాలుస్తానంటూ వ‌చ్చాడు.

  ఇంత‌కీ అత‌డు ఎవ‌ర‌నే కదా మీ డౌట్‌. ఆ మ‌ధ్య ఇండోపాక్ మ్యాచ్ సంద‌ర్భంగా మౌకా మౌకా (Mauka Mauka) యాడ్ ఎన్ని సంచ‌ల‌నాలు సృష్టించిందో తెలుసు క‌దా. 2015 వ‌ర‌ల్డ్‌క‌ప్ టైమ్‌లో ప్రారంభ‌మైన ఈ యాడ్‌.. ప్ర‌తి ఐసీసీ టోర్నీలో ఈ దాయాదులు త‌ల‌ప‌డిన‌ప్పుడ‌ల్లా వ‌స్తూ అభిమానుల‌ను అలరిస్తోంది. ఇప్పుడు మ‌రోసారి టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్ సంద‌ర్భంగా ఆ మౌకా మౌకా యాడ్‌లోని పాక్ అభిమాని మ‌ళ్లీ ప‌టాకులు ప‌ట్టుకొని దుబాయ్ వ‌చ్చాడు.

  ఈ లేటెస్ట్ యాడ్‌ను బ్రాడ్‌కాస్ట‌ర్ స్టార్‌స్పోర్ట్స్ రిలీజ్ చేసింది. కాస్త ఫ‌న్నీగా, ప్ర‌త్య‌ర్థిని స‌ర‌దాగా ఏడిపించేలా ఈ ప్రోమో రూపొందించారు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఇండోపాక్ మ్యాచ్ చూడటానికి ఓ పేద్ద టీవీ కొన‌డానికి త‌న ఫ్రెండ్ షోరూమ్‌కు ప‌టాకులు ప‌ట్టుకొని వ‌స్తాడు ఆ పాక్ అభిమాని. ఈ సంద‌ర్భంగా ఆ టీవీ షోరూమ్ ఓన‌ర్‌.. అత‌న్ని ఆట ప‌ట్టిస్తాడు. అతని చేతిలో రెండు టీవీలు పెడతాడు.

  ఇది కూాడా చదవండి : ఇండియా అమ్మాయికి మ్యాక్సీ క్లీన్ బౌల్డ్..! మ్యాక్స్ వెల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి గురించి తెలుసా..?

  రెండు టీవీలు ఎందుకని పాక్‌ అభిమాని అడుగుతాడు. దానికి ఇండియా అభిమాని.. ఏం లేదు.. ఒక టీవీ మ్యాచ్‌ చూడడానికి.. మరొకటి పగులగొట్టడానికని సమాధానమిస్తాడు. అంటే ఈ మ్యాచ్‌లో కూడా టీమిండియాదే విజయం అంటూ పరోక్షంగా చెప్పాడు. దీనికి ఇండియా అభిమాని ''బై వన్‌.. బ్రేక్‌ వన్‌'' ఆఫర్‌ చెప్పడంతో మౌకా.. మౌకా అంటూ యాడ్‌ ముగుస్తుంది. ప్రస్తుతం మౌకా- మౌకా యాడ్‌ సోషల్‌ మీడియాను ఒక ఊపు ఊపుతుంది. ముఖ్యంగా ఇండియ‌న్ ఫ్యాన్స్ ఈ ప్రోమోను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.


  ఇక, వరల్డ్ కప్ టోర్నీల్లో టీమిండియాకు పాకిస్ధాన్ మీద అజేయ రికార్డు ఉంది. 12-0 తేడాతో భారత్ పాకిస్థాన్ కు అందనంత ఎత్తులో ఉంది. ఇక, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ టిక్కెట్లు ఇప్పటికే హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయ్.చివరగా 2012-13లో పరిమిత ఓవర్ల సిరీస్‌ కోసం భారత్‌లో పాక్‌ పర్యటించింది. 2008లో ఆసియా కప్‌ కోసం భారత్.. పాక్‌కు వెళ్లింది.

  2017 ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్లో టీమిండియాను పాకిస్తాన్ ఓడించింది. ఛాంపియన్స్‌ ట్రోఫీ తర్వాత భారత్‌తో ఆడిన రెండు మ్యాచుల్లోనూ పాక్ ఓటమి పాలైంది. 2018 ఆసియా కప్‌, 2019 వన్డే ప్రపంచకప్‌ పోరులో పాక్ ఓడిపోయింది. టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్‌ నాలుగు గెలవగా.. ఓ మ్యాచ్ టై కాగా.. బౌల్‌ అవుట్‌లో టీమిండియానే గెలుపొందింది.
  Published by:Sridhar Reddy
  First published: