Home /News /sports /

T 20 WORLD CUP 2021 INDIA VS PAKISTAN HERE PREDICTED PAKISTAN PLAYING XI AGAINST TEAM INDIA IN BLOCKBUSTER FIGHT SRD

Ind Vs Pak : సీనియర్లకే పట్టం.. టీమిండియాతో తలపడే పాక్ తుది జట్టు ఇదే..!

Pakistan cricket (Twitter)

Pakistan cricket (Twitter)

Ind Vs Pak : నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం.. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం.. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరులోనే చూస్తాం. అలాంటి బ్లాక్ బస్టర్ పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

    ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup) మొదలైంది. క్వాలిఫైయర్స్, ప్రాక్టీస్ మ్యాచ్ లతో అభిమానులకు బోలెడంత కిక్ ఇస్తోంది. ఇక, అక్టోబ‌ర్ 23న అసలు సమరం.. సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. ఇక అక్టోబర్ 24న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ (India Vs Pakistan) తలపడనున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. దీంతో, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ధనా ధన్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇక, దాయాది దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల ఎఫెక్ట్ తో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయ్. ఇక టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్‌ నాలుగు గెలుపొందింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.

    ఇక, టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 స్టేజిలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 దశలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ సహా క్వాలిఫైయర్ ద్వారా అర్హత సాధించిన మరో రెండు జట్లు ఉంటాయి. సూపర్ 12 స్టేజ్ అక్టోబర్ 23న ఆరంభం కానుండగా.. టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఇప్పటికే అర్హత సాధించిన జట్లు ఆలోగా ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నాయి. ఇక, హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియాతో పాటు దాయాది పాకిస్థాన్ కూడా రెడీ అవుతోంది. దాయాది పాకిస్థాన్ తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.

    మహ్మద్ రిజ్వాన్ (Mohammed Rizwan), బాబర్ అజమ్‌ (Babar Azam) లు పాక్ ఓపెనర్లుగా బరిలోకి దిగనున్నారు. ఈ ఏడాది టీ20ల్లో ఇద్దరు ఆటగాళ్లు గొప్ప ఫామ్‌లో ఉన్నారు. వీరిద్దరూ రాణిస్తే టీమిండియాకు కష్టమే. ఇక, వన్‌డౌన్‌లో ఫఖర్ జమాన్‌ బరిలోకి దిగనున్నాడు. భారీ హిట్టింగ్ తో విరుచుకుపడే ఫఖర్ జమాన్ క్షణాల్లో ఆటను మార్చగలడు.

    ఇది కూడా చదవండి : Smriti Mandhana : వామ్మో.. స్మృతి మంధానలో ఇంత టాలెంట్ ఉందా..? డ్యాన్స్ ఇరగదీసిన స్టార్ బ్యాటర్..

    నాలుగు, ఐదు స్థానాల్లో సీనియర్లు షోయబ్ మాలిక్, మహ్మద్ హఫీజ్‌లు కరెక్ట్. వీరిద్దరి అనుభవం పాకిస్తాన్ జట్టుకు ఉపయోగపడనుంది. ఇక ఆల్‌రౌండర్ల కోటాలో మొహమ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇమాద్ వసీం చోటు దక్కించుకున్నారు. షాదాబ్, ఇమాద్ స్పిన్నర్లుగా రాణించగలరు. ఇక పేస్‌ బౌలింగ్‌ విభాగంలో షహీన్ షా అఫ్రిది, హసన్ అలీ, హారిస్ రౌఫ్‌లు కీ రోల్ ప్లే చేయనున్నారు.

    పాకిస్తాన్ తుది జట్టు అంచనా:
    బాబర్ అజమ్ (కెప్టెన్‌), మొహమ్మద్ రిజ్వాన్ (వికెట్‌ కీపర్‌), ఫఖర్ జమాన్, మహ్మద్ హఫీజ్, షోయబ్ మాలిక్, మహ్మద్ నవాజ్, షాదాబ్ ఖాన్, ఇమాద్‌ వసీం, హసన్ అలీ, హారిస్ రౌఫ్, షహీన్ షా అఫ్రిది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Babar Azam, India VS Pakistan, Pakistan, T20 World Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు