T-20 World Cup : మహాసంగ్రామంలో పాక్ తో తలపడే భారత తుది జట్టు ఇదే..! ఆ ఇద్దరు డౌటే..!

India Vs Pakistan

T-20 World Cup : నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం.. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం.. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ పోరులోనే చూస్తాం. అలాంటి బ్లాక్ బస్టర్ పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

 • Share this:
  ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ధనాధన్ టోర్నీ టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup) మొదలైంది. మొదటి రోజే సంచలనం నమోదైంది. పసికూన స్కాట్లాంట్(Scotland).. బంగ్లాదేశ్ (Bangladesh) ని చిత్తు చేసింది. ఇక, అక్టోబ‌ర్ 23న అసలు సమరం.. సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. ఇక అక్టోబర్ 24న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ (India Vs Pakistan) తలపడనున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. దీంతో, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ధనా ధన్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు. ఇక, దాయాది దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల ఎఫెక్ట్ తో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయ్. ఇక టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్‌ నాలుగు గెలుపొందింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది.

  ఇక, టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 స్టేజిలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12 దశలో జట్లను రెండు గ్రూపులుగా విభజించారు. గ్రూప్ 2లో భారత్, పాకిస్తాన్, న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ సహా క్వాలిఫైయర్ ద్వారా అర్హత సాధించిన మరో రెండు జట్లు ఉంటాయి. సూపర్ 12 స్టేజ్ అక్టోబర్ 23న ఆరంభం కానుండగా.. టీ20 ప్రపంచకప్ 2021 కోసం ఇప్పటికే అర్హత సాధించిన జట్లు ఆలోగా ప్రాక్టీస్ మ్యాచులు ఆడనున్నాయి. ఇక, హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం టీమిండియా రెడీ అవుతోంది. దాయాది పాకిస్థాన్ తో తలపడే భారత తుది జట్టుపై ఓ లుక్కేద్దాం.

  ఓపెనర్లుగా రోహిత్ శర్మ (Rohit Sharma), లోకేష్ రాహుల్ (Kl Rahul) బరిలోకి దిగనున్నారు. ఐపీఎల్ 2021లో రోహిత్ కాస్త తడబడినా.. రాహుల్ దుమ్ములేపాడు. పరుగుల వరద పారిస్తూ కింగ్స్ పంజాబ్ విజయాల్లో కీలక పాత్ర పోషించాడు. మూడో స్థానంలో కెప్టెన్ విరాట్ కోహ్లీ బరిలోకి దిగనున్నాడు. ఇక నాలుగో స్థానంలో హిట్టర్ సూర్యకుమార్ యాదవ్ ఆడనున్నాడు.

  ఇక వికెట్ కీపర్ స్థానంలో రిషబ్ పంత్ ఆడనున్నాడు. అయితే పంత్ ఐపీఎల్ 2021లో ఫెయిలయ్యాడు. దీంతో ఇషాన్ కిషన్‌కు అవకాశం ఇచ్చే ఛాన్స్ కూడా ఉంది. ఇషాన్ ముంబై ఇండియన్స్ జట్టుకు వికెట్ కీపర్ అన్న విషయం తెలిసిందే. ఇక ఐపీఎల్ 2021లో ఆల్‌రౌండర్‌ హార్దిక్ పాండ్యా కూడా విఫలమయ్యాడు. ఒకవేళ రిషబ్ ఉంటే పాండ్యా బదులుగా కూడా కిషన్‌ ఆడే అవకాశాన్ని కొట్టిపారేయలేం.

  ఇది కూడా చదవండి : " అతడే మా సైన్యం.. టీ20 ప్రపంచకప్ మాదే ".. ఆ ప్లేయర్ పై కోహ్లీ ప్రశంసలు..

  ఆల్‌రౌండర్‌ కోటాలో శార్దూల్‎ ఠాకూర్, రవీంద్ర జడేజా తుది జట్టులో ఆడనున్నారు. ఈ ఇద్దరు ఐపీఎల్ 2021లో ఇరగదీశారు. ముఖ్యంగా శార్దూల్‎ చెన్నై తరఫున 21 వికెట్లు పడగొట్టాడు. ఫైనల్లో కీలక సమయంలో మ్యాచును మలుపుతిప్పాడు. బీసీసీఐ ముందుగా ప్రకటించిన భారత జట్టులో శార్దూల్ లేదన్న విషయం తెలిసిందే. ఇక స్పెసలిస్ట్ స్పిన్నర్ కోటాలో వరుణ్ చక్రవర్తి ఆడనున్నాడు. దాంతో ఆర్ అశ్విన్, రాహుల్ చహర్‌కు నిరాశే ఎదురుకానుంది. పేస్ బౌలర్లుగా జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీలకు చోటు దక్కనుంది.

  టీమిండియా తుది జట్టు అంచనా :

  రోహిత్ శర్మ, లోకేష్ రాహుల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్, ఇషాన్ కిషన్‌/హార్దిక్ పాండ్యా, శార్దూల్‎ ఠాకూర్, రవీంద్ర జడేజా, వరుణ్ చక్రవర్తి, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ.
  Published by:Sridhar Reddy
  First published: