Ind Vs Pak : ఐసీసీ బ్లాక్ బస్టర్ ప్రొమో చూశారా..? సినిమా టీజర్ లు కూడా పనికిరావు..!

India Vs Pakistan

Ind Vs Pak : క్రికెట్ అభిమానుల్ని ఆనందడోలికల్లో ముంచెత్తడానికి బ్లాక్ బస్టర్ టీజర్ రిలీజ్ అయింది. ఇది సినిమా టీజర్ అనుకుంటే పొరపాటే.. అంతకు మించి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడ ఉన్నా.. వారికి కిక్ ఇచ్చే మాస్ మసాలా టీజర్. ఈ ప్రొమో ముందు సినిమా టీజర్లు , యాక్షన్ సినిమాలు కూడా పనికిరావు.

 • Share this:
  టీ20 వరల్డ్‌కప్ 2021 (T-20 World Cup 2021) టోర్నీ లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ పోరు కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. వారి ఎదురుచూపులకు మరికొద్ది సమయమే మిగిలింది. ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కు కౌంట్ డౌన్ షూరు అయింది. సూపర్ 12 రౌండ్‌లో భాగంగా ఆదివారం దుబాయ్ (Dubai) ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్‌కి ఇప్పటికే ఫుల్ క్రేజ్ వచ్చేసింది. టీ20 వరల్డ్‌కప్ టోర్నీలో భారత్, పాకిస్తాన్ తలబడడం ఇది ఆరోసారి.నరాలు తెగే ఉత్కంఠ, బంతి బంతికి మారే ఆధిపత్యం.. విజయం కోసం ఆఖరి వరకు పోరాటం.. మైదానంలో యుద్ధం లాంటి వాతావరణం.. కేవలం ఇది ఇండియా వర్సెస్ పాకిస్థాన్ (India Vs Pakistan) పోరులోనే చూస్తాం. అలాంటి బ్లాక్ బస్టర్ పోరు కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ప్రపంచకప్‌ల్లో, ముఖ్యంగా టీ20 ఫార్మాట్‌లో దాయాదీపై భారత్‌దే పూర్తి ఆధిపత్యం. టీ20ల్లో 8 మ్యాచుల్లో 6 టీమిండియా, ఒకే ఒక్క మ్యాచ్‌లో పాక్ గెలిచింది. మరొక మ్యాచ్‌ టైగా ముగిసినా.. బౌలౌట్‌లో విజయం భారత్‌నే వరించింది. టీ20 ప్రపంచకప్‌లో ఐదు మ్యాచ్‌లకు ఐదు భారతే గెలిచింది.

  ఇక, క్రికెట్ అభిమానుల్ని ఆనందడోలికల్లో ముంచెత్తడానికి బ్లాక్ బస్టర్ టీజర్ రిలీజ్ అయింది. ఇది సినిమా టీజర్ అనుకుంటే పొరపాటే.. అంతకు మించి. ప్రపంచవ్యాప్తంగా భారతీయులు ఎక్కడ ఉన్నా.. వారికి కిక్ ఇచ్చే మాస్ మసాలా టీజర్. ఈ ప్రొమో ముందు సినిమా టీజర్లు , యాక్షన్ సినిమాలు కూడా పనికిరావు.

  ఈ సాయంత్రం 7:30 గంటలకు భారత్-పాకిస్తాన్ మధ్య జరుగనున్న టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్ మ్యాచ్‌కు సంబంధించిన టీజర్ ఇది. ఐసీసీ దీన్ని ప్రత్యేకంగా రూపొందించింది. 58 సెకెన్ల పాటు నిడివి ఉన్న ఈ ప్రోమో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. టీ20 ప్రపంచకప్ టోర్నమెంట్‌లో ఇన్ని మ్యాచ్‌లు ఉండగా.. ఐసీసీ ప్రత్యేకంగా భారత్-పాకిస్తాన్ మధ్య జరిగే మ్యాచ్ కోసమే ఈ ప్రోమోను రూపొందించిందంటే.. దీనికి ఉన్న ప్రాధాన్యత ఎలాంటిదో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.


  ఈ ప్రోమోలో ఐసీసీ వినియోగించిన కొన్ని పదాలు మ్యాచ్ తీవ్రతను తెలియజేస్తోన్నాయి. టు డే ఈజ్ ద బిగ్ డే అనే టైటిల్‌తో మొదలవుతుంది ఈ ప్రోమో. క్రమంగా ఒక్కో పదం వీక్షకుల ముందుకు వస్తుంది. ఇండియా.. పాకిస్తాన్, రైవల్రీ, ప్యాషన్, ప్రెషర్ అనే పదాలు మన కళ్లముందు దర్శనమిస్తాయ్. చివరిలో ది వరల్డ్ ఈజ్ వాచింగ్ యు అనే సెంటెన్స్‌తో ఈ వీడియో ముగుస్తుంది. చూస్తున్నంత సేపూ గూస్ బంప్సే. ఒంటి మీద వెంట్రులు నిక్కబొడుచుకునేలా ఉంటుందీ ప్రోమో.

  ఇది కూడా చదవండి : ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌ సమయంలో వర్షం పడుతుందా? దుబాయ్ వెదర్ ఎలా ఉందంటే..

  భారత్-పాకిస్తాన్ మధ్య ఇదివరకు జరిగిన మ్యాచ్‌లకు సంబంధించిన క్లిప్పింగ్స్.. ప్రేక్షకుల కేరింతలు అదర గొట్టేలా ఉంటాయి. భారీ షాట్లు, క్యాచ్‌లు, వికెట్లు గాల్లోకి లేవడాలు.. ఇవన్నీ ఈ ప్రోమోను రెప్పవాల్చకుండా చేస్తాయి. ఈ ప్రొమో ఇరు దేశాల క్రికెట్ ఫ్యాన్స్ కు బోలెడంత కిక్ ఇచ్చింది.
  Published by:Sridhar Reddy
  First published: