Ind Vs Nz : టీమిండియాతో మ్యాచ్ కి ముందు న్యూజిలాండ్‌కి భారీ షాక్... గాయంతో స్టార్ ప్లేయర్ దూరం..

New Zealand Team

Ind Vs Nz : పాకిస్తాన్ చేతిలో పరాభవానికి గురైన భారత్-న్యూజిలాండ్ జట్లు ఫేస్ టు ఫేస్ తేల్చుకోనున్నాయి. టోర్నీలో ముందుకు సాగాలంటే రెండు జట్లకు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది.

 • Share this:
  యూఏఈ వేదికగా జరుగుతున్న టీ-20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) ఫ్యాన్స్ అంచనాలకు అందకుండా సాగుతోంది. ఈ మెగాటోర్నీలో హాట్ ఫేవరేట్లు బొక్క బొర్లాపడుతుంటే.. మరి కొన్ని జట్లు అద్భుత విజయాలతో దూసుకుపోతున్నాయ్. ఇక, టైటిల్ కొట్టే జట్టుగా బరిలోకి దిగిన టీమిండియా (Team India)కి ఫస్ట్ మ్యాచ్ లోనే ఘోర పరాభవం ఎదురైంది. దాయాది పాకిస్థాన్ (Pakistan) చేతిలో 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. మరోవైపు, న్యూజిలాండ్ (New Zealand) కూడా పాక్ చేతిలో 5 వికెట్ల తేడాతో ఓడిపోయింది. సెమీస్ రేస్ లో నిలవాలంటే భారత్, కివీస్ లు ప్రతి మ్యాచ్ గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఇరు జట్లు ఆదివారం దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో తలపడనున్నాయ్. భారత కాలమానం ప్రకారం సాయంత్రం 7:30 గంటలకు ఆరంభమౌతుంది.

  ఈ నెల 24వ తేదీన ఇదే దుబాయ్ స్టేడియంలో పాకిస్తాన్‌ను ఎదుర్కొన్న టీమిండియా.. పరాజయాన్ని చవి చూసింది. టాస్ ఓడిపోయి తొలుత బ్యాటింగ్ చేసిన కోహ్లీసేన నిర్దేశించిన 152 పరుగుల లక్ష్యాన్ని పాకిస్తాన్ అలవోకగా ఛేదించింది. వికెట్ నష్టపోకుండా విజయాన్ని అందుకుంది. ఇదే పాకిస్తాన్ జట్టు తన రెండో మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ను మట్టి కరిపించింది. మంగళవారం జరిగిన టి మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై అయిదు వికెట్ల తేడాతో విజయఢంకా మోగించింది. ఈ గ్రూప్‌లో అగ్రస్థానంలో నిలిచింది పాకిస్తాన్ టీమ్.

  పాకిస్తాన్ చేతిలో పరాభవానికి గురైన భారత్-న్యూజిలాండ్ జట్లు ఫేస్ టు ఫేస్ తేల్చుకోనున్నాయి. టోర్నీలో ముందుకు సాగాలంటే రెండు జట్లకు గెలిచి తీరాల్సిన మ్యాచ్ ఇది. బలమైన టీమిండియాను ఎదుర్కొనడానికి సన్నద్ధమౌతున్న న్యూజిలాండ్ జట్టుకు అనుకోని భారీ షాక్ తగిలింది. స్టార్ బౌలర్ లూకీ ఫెర్గ్యూసన్గాయపడ్డాడు. టీమిండియాతో మ్యాచ్‌కే కాదు.. టోర్నమెంట్ మొత్తానికీ దూరం అయ్యాడు. అతని కుడి కాలి చీలమండంలో తేలికపాటి ఫ్రాక్చర్ ఏర్పడింది. పాకిస్తాన్‌తో మ్యాచ్‌లోనూ అతను అందుబాటులో లేడు.


  చీలమండం నొప్పితో గాయపడుతున్న అతనికి ఎంఆర్ఐ స్కానింగ్ చేయించగా.. ఫ్రాక్చర్‌గా తేలింది. దీంతో అతనికి విశ్రాంతి ఇవ్వనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. లూకీ ఫెర్గ్యూసన్ స్థానంలో ఆడమ్ మిల్నెను జట్టులోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఫెర్గూసన్ స్థానంలో ఆడమ్ మిల్నేను ఆడించడానికి అవకాశం ఇవ్వాలంటూ కివీస్ బోర్డు.. ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్‌ టెక్నికల్ కమిటీకి దరఖాస్తు చేసుకుంది.

  ఇది కూడా చదవండి : అక్షరాలా రూ. 12715 కోట్లు.. ఆ రెండు జట్లు లాభాల బాట పట్టేదెన్నడు? కొత్త ఐపీఎల్ ఫ్రాంచైజీలకు లాభాలు వస్తాయా?

  ఐపీఎల్ లో కోల్ కతా నైట్ రైడర్స్ తరపున అద్బుతంగా రాణించాడు లూకీ ఫెర్గ్యూసన్. 150 కి.మీ వేగం తగ్గకుండా బంతుల్ని సంధిస్తూ, అప్పడప్పుడు స్లో డెలివరీలతో బ్యాటర్లను బోల్తా కొట్టించాడు. అలాంటి బౌలర్ జట్టుకు దూరమవ్వడం కివీస్ మైనస్ పాయింట్ గా మారనుందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
  Published by:Sridhar Reddy
  First published: