T-20 World Cup - Ind Vs Aus: ఆస్ట్రేలియాను కూడా మడతెట్టేశారు.. ఇక, పాకిస్థాన్ కు బ్యాండ్ బాజానే..!

T-20 World Cup

T-20 World Cup - Ind Vs Aus: టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) లో పాకిస్థాన్ (India Vs Pakistan) తో హై ఓల్టేజ్ మ్యాచ్ కు ముందు టీమిండియా అదరగొడుతోంది.

  • Share this:
    టీ -20 వరల్డ్ కప్ (T-20 World Cup 2021) లో పాకిస్థాన్ (India Vs Pakistan) తో హై ఓల్టేజ్ మ్యాచ్ కు ముందు టీమిండియా అదరగొడుతోంది. టీమిండియా ఆటగాళ్లు రెచ్చిపోవడంతో రెండో ప్రాక్టీస్ మ్యాచ్ లో కూడా అద్భుత విక్టరీ మన సొంతం అయింది. ఆస్ట్రేలియాతో జరిగిన వార్మప్ మ్యాచ్‌లో టీమిండియా 9 వికెట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. 153 పరుగుల టార్గెట్‌తో బరిలో దిగిన భారత జట్టుకి ఓపెనర్లు కెఎల్ రాహుల్ (KL Rahul), రోహిత్ శర్మ (Rohit Sharma) కలిసి శుభారంభం అందించారు. తొలి వికెట్‌కి 68 పరుగుల భాగస్వామ్యం జోడించిన తర్వాత 31 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులుచేసిన కెఎల్ రాహుల్ అవుట్ అయ్యాడు.ఆ తర్వాత రోహిత్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్ధిక్ పాండ్యా కలిసి మ్యాచ్‌ను ముగించారు. కెప్టెన్ రోహిత్ శర్మ 41 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేయగా... సూర్యకుమార్ యాదవ్ 27 బంతుల్లో 5 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 38 పరుగులు చేశాడు..

    హార్ధిక్ పాండ్యా 8 బంతుల్లో 14 పరుగులు చేసి సిక్సర్‌తో మ్యాచ్‌ని ముగించాడు. రెండు వార్మప్ మ్యాచుల్లోనూ విజయాలు అందుకున్న విరాట్ సేన, హాట్ ఫెవరెట్‌గా అక్టోబర్ 24న పాకిస్తాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.అంతకు ముందు.. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు చేసింది. రెండో ఓవర్‌లోనే బౌలింగ్‌కి వచ్చిన రవిచంద్రన్ అశ్విన్, ఆఖరి రెండు బంతుల్లో రెండు వికెట్లు పడగొట్టి... ఆసీస్‌కి ఊహించని షాక్ ఇచ్చాడు.

    7 బంతుల్లో ఒక్క పరుగు మాత్రమే చేసిన డేవిడ్ వార్నర్, అశ్విన్ బౌలింగ్‌లో ఎల్బీడబ్ల్యూగా అవుట్ కాగా, ఆ తర్వాత మిచెల్ మార్ష్ డకౌట్ అయ్యాడు. 10 బంతుల్లో 8 పరుగులు చేసిన ఆసీస్ కెప్టెన్ ఆరోన్ ఫించ్‌ను రవీంద్ర జడేజా అవుట్ చేశాడు. 11 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది ఆస్ట్రేలియా. అయితే స్టీవ్ స్మిత్, గ్లెన్ మ్యాక్స్‌వెల్ కలిసి నాలుగో వికెట్‌కి 61 పరుగుల భాగస్వామ్యం జోడించారు.

    28 బంతుల్లో 5 ఫోర్లతో 37 పరుగులు చేసిన గ్లెన్ మ్యాక్స్‌వెల్, రాహుల్ చాహార్ బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా, తనస్టైల్‌లో బ్యాటింగ్ కొనసాగించిన స్టీవ్ స్మిత్, 41 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు.

    48 బంతుల్లో 7 ఫోర్లతో 57 పరుగులు చేసిన స్టీవ్ స్మిత్, భువనేశ్వర్ కుమార్ వేసిన ఆఖరి ఓవర్‌లో అవుట్ అయ్యాడు. 25 బంతుల్లో 4 ఫోర్లు, ఓ సిక్సర్‌తో 41 పరుగులు చేసిన స్టోయినిస్ నాటౌట్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో రవిచంద్రన్ అశ్విన్ రెండు వికెట్లు తీయగా, భువనేశ్వర్ కుమార్, రాహుల్ చాహార్, జడేజా తలా ఓ వికెట్ తీశారు. సబ్‌స్ట్రిట్యూట్ ఫీల్డర్‌గా క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ, రెండు ఓవర్లు బౌలింగ్ చేసి 12 పరుగులు మాత్రమే ఇవ్వడం విశేషం.

    ఇది కూడా చదవండి : మాకు దర్శన భాగ్యం ఎప్పుడో..? విరుష్క ఫ్యాన్స్ కు మరోసారి నిరాశే..!

    గత మ్యాచ్‌లో బౌలింగ్ చేయలేకపోయిన హార్ధిక్ పాండ్యా, ఈ మ్యాచ్‌లో కూడా బౌలింగ్‌కి రాలేదు. దీంతో విరాట్ కోహ్లీతో బౌలింగ్ చేయించి, ప్రయోగం చేసినట్టు కనిపించింది. వచ్చే మ్యాచ్ ల్లో కోహ్లీ, రోహిత్, సూర్యకుమార్ యాదవ్ లు బౌలింగ్ వేసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published: