హోమ్ /వార్తలు /క్రీడలు /

T20 World Cup : " చెత్త వాగుడు ఆపండి.. మీ జట్టులోనే ఫిక్సర్లు ఉన్నారు ముందు అది తెలుసుకోండి.. "

T20 World Cup : " చెత్త వాగుడు ఆపండి.. మీ జట్టులోనే ఫిక్సర్లు ఉన్నారు ముందు అది తెలుసుకోండి.. "

Pakistan (PC : ICC Twitter)

Pakistan (PC : ICC Twitter)

T20 World Cup : భారత్ గ్రాండ్ విక్టరీని తట్టుకోలేక పాకిస్తాన్ (Pakistan) జనాలు కుళ్లుకుంటున్నారు. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌పై ఫిక్స్ అయిదంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు.

  టీ-20 ప్రపంచకప్‌ (T-20 World Cup 2021)లో వరుస సూపర్ విక్టరీలతో భారత్‌ (Team India) సెమీస్ రేస్ లోకి రాకెట్ లా దూసుకొచ్చింది. వరుసగా అఫ్గానిస్తాన్, నమీబియాలను చిత్తు చేసిన టీమిండియా తమ నెట్ రన్ రేట్ ను మెరుగుపర్చుకుంది. అయితే, భారత్ గ్రాండ్ విక్టరీని తట్టుకోలేక పాకిస్తాన్ (Pakistan) జనాలు కుళ్లుకుంటున్నారు. భారత్-అఫ్గానిస్థాన్ మధ్య జరిగిన మ్యాచ్‌ ఫిక్స్ అయిదంటూ పిచ్చి కూతలు కూస్తున్నారు. వరుసగా రెండు మ్యాచ్‌ల్లో చిత్తుగా ఓడిన భారత జట్టు.. పరువు దక్కించుకునేందుకు అఫ్గాన్ క్రికెట్ టీమ్‌ను కొనేసి విజయాన్నందుకుందని పాకిస్థాన్ అభిమానులు ఆరోపిస్తున్నారు. ఫిక్సింగ్‌కు సంబంధించిన సాక్ష్యాలను ట్విటర్ వేదికగా పంచుకుంటున్నారు. కోహ్లీసేన దారుణ వైఫల్యంతో టీమిండియా భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని, బీసీసీఐ తమ ఉనికి కోసం ఈ పనిచేసిందని కామెంట్ చేస్తున్న సంగతి తెలిసిందే.

  దీంతో ఆ దేశ అభిమానులు చేస్తున్న ఆరోపణలపై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ (Harbhajan Singh) ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్ విజయాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డాడు. పాకిస్థాన్ క్రికెటర్ల ఫిక్సింగ్ గురించి అందరికి తెలిసిందేనని, ఈ బేఖార్ ముచ్చట్లు ఆపాలని చురకలంటించాడు.

  ఈ కామెంట్స్‌పై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన హర్భజన్ సింగ్.. పాక్ అభిమానుల తీరును తప్పుబట్టాటు. ఈ చెత్త వాగుడు ఆపాలని హితవు పలికాడు. "పాకిస్థాన్​ మంచి క్రికెట్​ ఆడిందని అంగీకరించాం. టీమిండియాపై మెరుగ్గా ఆడి గెలిచినందుకు కూడా అభినందించాం. కానీ మీ విజయాలు న్యాయబద్దమైనవి, మేం గెలిచినప్పుడు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తూ అక్రమంగా గెలిచారు.. ఫిక్సింగ్​కు పాల్పడ్డారు' అని అనడం సరైంది కాదు. మీ క్రికెటర్ల ఫిక్సింగ్, ఖ్యాతి గురించి మా అందరికీ తెలిసిందే." అంటూ చురకలంటించాడు భజ్జీ.

  ఇక ఐపీఎల్​ కాంట్రాక్టుల కోసం అఫ్గాన్​ ఆటగాళ్లు కోహ్లీసేన గెలిచేందుకు సహాయం చేశారని పాక్ అభిమానులు ఆరోపించడాన్ని కూడా భజ్జీ తప్పుబట్టాడు. ఇలాంటి ఆరోపణలతో సమయం వృథా చేసుకోకుండా, పాక్ విజయాలను ఆస్వాదించాలని సూచించాడు. అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్‌పై భారీ విజయాలు సాధించిన టీమిండియా మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్స్‌ టేబుల్లో మూడో స్థానంలో నిలించింది.

  ఇది కూడా చదవండి : కేఎల్ రాహుల్ కన్నా ముందు బాలీవుడ్ భామలను ప్రేమించి పెళ్లి చేసుకున్న క్రికెటర్లు వీళ్లే..!

  దీంతో, సెమీ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. ఆదివారం అఫ్గాన్‌ - న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఫలితంపైనే టీమిండియా భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే ఇప్పటికే ఆరు పాయింట్లతో ఉన్న విలియమ్సన్‌ సేన నేరుగా సెమీస్‌ చేరుతుంది. అదే అఫ్గాన్‌ గెలిస్తే.. 6 పాయింట్లతో ఉండటం వల్ల రన్‌రేట్‌ విషయంలో పోటీపడాల్సి ఉంటుంది. అప్పుడు కోహ్లీసేన చివరి మ్యాచ్‌లో నమీబియాను చిత్తుగా ఓడించి మెరుగైన రన్‌రేట్ సాధిస్తే సెమీస్ చేరుతుంది. మరి, టీమిండియా అదృష్టం ఎలా ఉందో వేచి చూడాలి.

  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Afghanistan, Harbhajan singh, India VS Pakistan, T20 World Cup 2021, Team India

  ఉత్తమ కథలు