Home /News /sports /

T 20 WORLD CUP 2021 FORMER PAKISTAN CAPTAIN JAVED MIANDAD BELIEVES A FEARLESS APPROACH AGAINST STRONG TEAM INDIA FAVOURS HIS COUNTRYS CHANCES SRD

India Vs Pakistan : " భయం లేకుండా ఆడితే టీమిండియాను ఓడించొచ్చు.. లేదంటే ఫసక్కే "

India Vs Pakistan

India Vs Pakistan

India Vs Pakistan : దాయాది దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల ఎఫెక్ట్ తో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయ్.

  ఐపీఎల్ 2021 సీజన్ (IPL 2021 Season Latest Updates) తర్వాత క్రికెట్ లవర్స్ ను అలరించడానికి ధనాధన్ టోర్నీ టీ -20 ప్రపంచ కప్ ( T-20 World Cup 2021) రెడీ అవుతోంది. ఈ మెగా టోర్నీ కోసం అన్ని జట్లు ఇప్పటికే యూఏఈ చేరుకున్నాయ్. మరో రెండు రోజుల్లో (అక్టోబర్‌ 17) టీ20 ప్రపంచకప్‌ 2021 ప్రారంభంకానుంది. ఇప్పటికే ప్రాక్టీస్ మ్యాచులు జరుగుతుండగా.. అక్టోబ‌ర్ 17న క్వాలిఫైర్ మ్యాచులు ప్రారంభం కానున్నాయి. అక్టోబ‌ర్ 23న అసలు సమరం.. సూప‌ర్ 12 స్టేజ్ ఆరంభం అవుతుంది. ఇక అక్టోబర్ 24న దాయాది దేశాలు భారత్, పాకిస్తాన్ (India Vs Pakistan) తలపడనున్నాయి. రెండు జట్లకీ మెగా టోర్నీలో ఇదే తొలి మ్యాచ్. దీంతో, ఈ హై ఓల్టేజ్ మ్యాచ్ కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ ధనా ధన్ మ్యాచ్ కోసం క్రికెట్ లవర్స్ తో పాటు మాజీ క్రికెటర్లు కూడా ఎంతో ఉత్సుకతతో ఎదురుచూస్తున్నారు.

  ఇక, దాయాది దేశాల మధ్య ఉన్న ఉద్రిక్తత పరిస్థితుల ఎఫెక్ట్ తో గత కొన్నేళ్లుగా ఇరు జట్ల మధ్య ద్వైపాక్షిక సిరీస్ లు జరగడం లేదు. కేవలం ఐసీసీ టోర్నీల్లోనే రెండు జట్లు తలపడుతున్నాయ్. ఇక టీ20 ప్రపంచకప్‌లో పాక్‌తో భారత్ ఐదుసార్లు ఆడింది. అందులో భారత్‌ నాలుగు గెలుపొందింది. ఓ మ్యాచ్ టైగా ముగిసింది. ఇక, ఈ మ్యాచ్ పాకిస్థాన్ దిగ్గజం జావేద్ మియాందాద్ .. తన జట్టుకు విలువైన సలహాలిచ్చాడు.

  తాజాగా జియో టివికి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాకిస్తాన్ మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ (Javed Miandad) భారత్, పాకిస్తాన్ మ్యాచుపై స్పందించాడు. " టీ20 ప్రపంచకప్‌లో ఆదిలోనే పాకిస్థాన్ జోరందుకోవడానికి టీమిండియాతో మ్యాచ్‌ కీలకం కానుంది. భారత్ బలమైన జట్టు. అగ్రశ్రేణి ఆటగాళ్లు ఆ జట్టులో ఉన్నారు. కానీ పాకిస్థాన్ ఎలాంటి బెరుకు లేకుండా ఆడితేనే భారత్‌ని ఓడించగలదు. ముఖ్యంగా మైదానంలో పాక్ ప్లేయర్స్ ఒత్తిడికి గురికాకూడదు. ధైర్యంతోనే ఆడాలిటీ20 కాబట్టి చిన్న క్యాచ్ కూడా నేలపాలుచేయకూడదు. మొదటి నుంచే హిట్టింగ్ చేయొద్దు. సరైన సమయం కోసం వేచి చూడాలి. పక్కాగా ప్రణాళికలతో మైదానంలోకి దిగి.. వాటిని అమలు చేయాలి" అని మియాందాద్ పాక్ కు సలహాలిచ్చాడు.

  ఇది కూడా చదవండి : టీమ్ ఇండియా నుంచి విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఔట్.. కొత్త కుర్రాళ్లకు చాన్స్ ఇవ్వనున్న బీసీసీఐ

  అయితే, ఈ మెగా ఫైట్ కు ముందు దాయాది పాకిస్థాన్ కు భారీ ఎదురుదెబ్బ తగిలింది.పాకిస్థాన్ హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ చీఫ్ గ్రాంట్ బ్రాడ్‌బర్న్ (Grant Bradburn) తన పదవికి రాజీనామా చేశారు. న్యూజిలాండ్ మాజీ టెస్ట్ క్రికెటర్ బ్రాడ్‌బర్న్ పీసీబీ 3 ఏళ్లు ఒప్పందం చేసుకున్నాడు. అతను సెప్టెంబర్ 2018 నుంచి జూన్ 2020 వరకు పాకిస్తాన్ క్రికెట్ జట్టు ఫీల్డింగ్ కోచ్‌గా కూడా ఉన్నారు. ఈ బాధ్యత తర్వాత హై పెర్ఫార్మెన్స్ కోచింగ్ చీఫ్ గా నియమితులయ్యారు.

  ఇది కూడా చదవండి : పాక్ జట్టును టీజ్ చేస్తోన్న మౌకా మౌకా యాడ్..! భారత్ ఫ్యాన్స్ కు పండుగే..

  పీసీబీ ఛైర్మన్ గా రమీజ్ రాజా బాధ్యతలు స్వీకరించిన తర్వాత పదవీ విరమణ చేసిన ఐదో కీలక వ్యక్తి బ్రాండ్ బర్న్. అతని కంటే ముందు పాకిస్థాన్ హెడ్ కోచ్ మిస్బా ఉల్ హక్, బౌలింగ్ కోచ్ వకార్ యూనిస్, సీఈఓ వసీం ఖాన్ లతో పాటు మార్కెటింగ్ హెడ్ బాబర్ హమీద్ కూడా రాజీనామా చేశారు.
  Published by:Sridhar Reddy
  First published:

  Tags: Babar Azam, Cricket, India VS Pakistan, T20 World Cup 2021, Virat kohli

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు