Home /News /sports /

T 20 WORLD CUP 2021 ENG VS BAN LIVE UPDATES MORGAN LED ENGLAND TEAM WON BY 8 WICKETS SRD

Eng Vs Ban : ఇంగ్లండ్ ముందు బంగ్లా పులులు మ్యావ్ మ్యావ్.. 14 ఓవర్లలోనే మ్యాచ్ ఫినిష్..

Photo Credit : Twitter

Photo Credit : Twitter

Eng Vs Ban : అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగడంతో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది.

    టీ20 ప్రపంచకప్ 2021 (T-20 World Cup 2021) లో భాగంగా అబుదాబిలో జరిగిన మ్యాచులో ఇంగ్లండ్(England) చేతిలో బంగ్లాదేశ్ (Bangladesh) చిత్తయింది. బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లో ఇంగ్లండ్ ముందు తేలిపోయింది. ఫలితం 8 వికెట్ల తేడాతో ఇంగ్లండ్ గ్రాండ్ విక్టరీ కొట్టింది. 124 పరుగుల సాధారణ టార్గెట్ తో బరిలోకి దిగిన ఇంగ్లండ్ 14.1 ఓవర్లలోనే రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఇంగ్లండ్ బ్యాటర్లలో జేసన్ రాయ్ దంచి కొట్టాడు. మలన్, బట్లర్ రాణించారు. జేసన్ రాయ్ (38 బంతుల్లో 61.. 5 ఫోర్లు, 3 సిక్సర్లు), మలన్ (25 బంతుల్లో 28 పరుగులు) రాణించారు. బంగ్లా బౌలర్లలో నసుమ్ అహ్మద్, షాఫ్రుల్ ఇస్లామ్ కి చెరో వికెట్ దక్కింది. ఈ ఓటమితో బంగ్లాదేశ్ సెమీస్ ఆశలు సన్నగిల్లాయ్. ఏదైనా అద్భుతం జరిగితే తప్ప బంగ్లా సెమీస్ చేరదు. బ్యాటింగ్ లో విఫలమైనా.. బంగ్లా దేశ్ బౌలింగ్ లో కూడా తేలిపోయింది. ఈ టోర్నీలో నిలకడగా రాణిస్తున్న షకిబ్ ఉల్ హసన్.. 3 ఓవర్లు వేసిన 24 పరుగులిచ్చాడు. ఒక వికెట్ కూడా పడలేదు. ముస్తాఫిజుర్ కూడా ఆకట్టుకోలేదు.

    ఇక, అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ కు దిగిన బంగ్లాదేశ్ స్వల్ప స్కోరుకే పరిమితమైంది. ఇంగ్లండ్‌ బౌలర్లు చెలరేగడంతో బంగ్లా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 124 పరుగులు మాత్రమే చేసింది. దీంతో, ఇంగ్లండ్ ముందు 125 పరుగుల స్వల్ప లక్ష్యంను మాత్రమే ఉంచగలిగింది. బంగ్లాదేశ్ ఇన్నింగ్స్‌లో ముష్పికర్ రహీమ్ చేసిన 29 పరుగులే అత్యధికం.

    రహీం 30 బంతుల్లో మూడు ఫోర్ల సాయంతో 29 పరుగులు చేశాడు. మహ్మద్ నయీం (5), లిట్టన్ దాస్ (9), షకీబుల్ హసన్ (4) పూర్తిగా విఫలమయ్యారు. ఇన్నింగ్స్ చివరలో నాసుమ్ అహ్మద్ (19), నూరుల్ హసన్ (16) ఆదుకోకుంటే బంగ్లా ఆ మాత్రం స్కోర్ కూడా చేసేదికాదు. ఇంగ్లండ్ బౌలర్లలో టైమల్ మిల్స్ మూడు వికెట్లు పడగొట్టగా.. లియామ్ లివింగ్‌స్టోన్, మొయిన్ అలీ తలో రెండు వికెట్లు పడగొట్టాడు.


    టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న బంగ్లాదేశ్ కెప్టెన్ మహ్మదుల్లా అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లోనే ఓపెనర్లు మహ్మద్ నయీం (5), లిట్టన్ దాస్ (9)ను మొయీన్ అలీ పెవిలియన్ చేర్చాడు. ఇద్దరు క్యాచ్ ఔట్ అయ్యారు. ఆరో ఓవర్లో షకీబుల్ హసన్ (4)ను క్రిస్ వోక్స్ బోల్తాకొట్టించాడు. రషీద్ అద్భుత క్యాచ్ అందుకోవడంతో షకీబ్ పెవిలియన్ చేరాడు. ఆ తర్వాత కాసేపు ముష్ఫికర్‌ రహీమ్ (39), మహ్మదుల్లా (19) క్రీజులో నిలబడ్డారు. దీంతో స్కోరు బోర్డు నెమ్మదించింది.

    అయితే ముష్ఫికర్‌ రహీమ్ అవుట్ అయిన తర్వాత బంగ్లాదేశ్ పరిస్థితి పూర్తిగా దిగజారింది. మహ్మదుల్లాతో సమన్వయలోపంతో ఆతిఫ్ హుస్సేన్ (5) రనౌట్ అయ్యాడు. నురుల్ హసన్ (16), మెహెదీ హసన్‌ (11) కూడా నిరాశపరిచారు. ఇక చివర్లో నాసుమ్ అహ్మద్‌ (9 బంతుల్లో 19) రెండు సిక్సర్లు కొట్టాడు.

    ఇది కూడా చదవండి : CSK స్టార్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ కు బంపరాఫర్..!

    ఇన్నింగ్స్ చివరి ఓవర్‌ ఆఖరి రెండు బంతులకు బంగ్లా జట్టు రెండు వికెట్లు కోల్పోయింది. అహ్మద్, హసన్ ఆదుకోకుంటే బంగ్లా ఆ మాత్రం స్కోర్ కూడా చేసేదికాదు. ఇంగ్లండ్ బౌలర్లలో టైమల్‌ మిల్స్‌ 3 వికెట్లు పడగొట్టాడు. మొయీన్ అలీ 2, లియామ్‌ లివింగ్‌స్టన్‌ 2 వికెట్లు కూల్చగా.. క్రిస్‌ వోక్స్ ఒక వికెట్ పడగొట్టాడు.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Bangladesh, Cricket, England, T20 World Cup 2021

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు